మధుర స్మృతులు!!
60's దశాబ్దం వరకు ఎవరు రైలు ప్రయాణం చేసినా ఇదిగో ఈ భారీ మరచెంబు మట్టుకు మర్చిపోయేవాళ్ళు కాదు!! దీనితో పాటు కొంచం దూర ప్రయాణం అయితే ఒక "హోల్దాల్", ఏ ప్రయాణానికైనా ఒక రేకు పెట్టె ;)
ఆ రోజుల్లో నేను చాలా చిన్నవాడిని. అయినా సరే నా వయసుకి మించిన భారం మొయ్యాల్సి వచ్చేది ఆ లేత వయసులోనే :( ఏమిటని సందేహం కూడానా?! ప్రయాణాల్లో ఇదిగో ఈ భారీ మరచెంబు నా చేతుల్లో పెట్టేవాళ్ళు, చిన్న పిల్లాడిని అనైనా చూడకుండా :( నీళ్ళు లేకుండానే దాని బరువు కనీసం ఒక కే.జి. కి తగ్గకుండా ఉంటుంది. అందులో నీళ్ళు నింపితే ఇంకో కే.జి. చచ్చినంత పనయ్యేది దాన్ని మొయ్యాలంటే. పొరపాటుని చెయ్యి జారి పాదం మీద పడితే? అన్న ఆలోచన కూడా వచ్చేది కాదు ఈ పెద్దొళ్ళకి :( అయితే ఒకటి లెండి! అన్ని "బరువు" బాధ్యతలు అందరూ మొయ్యాలన్న ఒక సాంఘిక సందేశం ఉండేది ఈ ప్రయాణాల్లో ;) పెద్ద వాళ్లకి పెద్ద సామానులు, చిన్న వాళ్లకి మర చెంబులు! సామాజిక న్యాయం అంటే ఇదేనా కొంప తీసి? ;)
ముఖ్య గమనిక: ఈ మరచెంబు ఫోటో ఇక్కడ పోస్ట్ చేసే స్థాయికి తేవడానికి నాకు కనీసం ఒక అరగంట పట్టింది!! అంటే సినిమాల్లో హీరోయిన్ లని అందంగా చూపించడానికి మేక్ అప్ మాన్ కష్టపడతారే అలా ఈ మరచెంబుని కూడా అందంగా చూపించే ప్రయత్నం అన్న మాట!!
దాన్ని ముందు ఒక అంట్లు తోమే సబ్బుతోనూ, పిదప ఒకింత చింతపండు ఉప్పు మిశ్రమం తోనూ, ఆ పైన ఇంకొంచం బ్రాస్సో తోనూ తోమి, తోమి ఇదిగో ఇలా "తళతళ" తప్ప ఇంకేమి మిగలని స్టేజి కి తెచ్చాను. ఇలా తోమడంలో నా "శక్తి""యుక్తులు" అన్నీ ఉపయోగించాను. శక్తి మీకు తెలిసినదే! చేతులు నొప్పెట్టేదాకా తోమడమే! "యుక్తి" ఏమిటంటే ఫోటోలో మర చెంబు 360° కనిపించదు కదా! ఏదో ఒక పక్కే కనిపిస్తుంది. మరయితే నేనెందుకు మరచెంబు మొత్తం తోమి, తోమి తెగ అలిసిపోవడం? ఈ చిదంబర రహస్యం తెలియగానే (Mentos వేసుకోకుండానే సుమండీ!!) వెంటనే నా శక్తినంతా ఈ చెంబు మీకు కనిపిస్తున్న వేపే తోమాను ;) శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు!!
Idhi raagi chembu aa ledha ithadi chembaa
ReplyDeleteithadi
Delete