Saturday, November 22, 2014

హమ్మయ్య! నిన్నటితో కార్తీకమాసం వెళ్ళిపోయింది!!

హమ్మయ్య! నిన్నటితో కార్తీకమాసం వెళ్ళిపోయింది... ఇంక  ఉపవాసాల బాధ తప్పింది. అంటే నేనేదో కార్తీకమాసమంతా విపరీతంగా ఉపవాసాలు చేసేసి శుష్కించి పోయానేమోనని భయపడకండి. నా బాధ కార్తీకమాసంలో కనీసం ఒక్క రోజైన ఉపవాసం ఉండలేదే అని!!

ఈ కార్తీకమాసమంతా అద్దంలో మొహం చూసుకోవాలంటే భయపడాల్సి వచ్చింది. నేను అద్దంలో ఇలా చూడడం ఆలస్యం అందులోంచి అంతరాత్మ ప్రశ్నల వర్షం కురిపించేది. అదెలా సాధ్యం అనే వాళ్ళంతా పాత సినిమాలు చూడ ప్రార్థన! ఆ ప్రశ్నలు ఇలా సాగేవి

ఈ నెలలో వారానికి కనీసం ఒక్క రోజు ఉపవాసం ఉండలేవా?
ఒక్క రోజు ఉండలేకపోతే అధమపక్షం ఒక్క పూట తినకుండా ఉండలేవా? 
కనీసంలో కనీసం నెల మొత్తంలో ఒక్క రోజు లేక ఒక్క పూట ఉపవాసం ఉండలేవా?
ఏమయ్యింది నీ భారతీయ సంప్రదాయం?
మర్చిపోతున్నావా ఆచారం?

ఇన్ని ప్రశ్నలకి నాది ఒక్కటే సమాధానం. మౌనం! ఏమన్నా జవాబు చెప్తే మళ్ళీ సప్లిమెంటరీ ప్రశ్నలు వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకొచ్చిన గొడవ. నా అంతరాత్మేగా. కొన్నాళ్ళు అద్దంలో దాని (నా) మొహం చూడడం మానేస్తే సరి.

లోపాయికారి నేను ఉపవాసం ఉండక పోవడానికొక బలీయమైన కారణం ఉంది! అదేమిటంటే ఇటీవల ఎక్కడో చదివాను. మనం ఎప్పుడైనా ఉపవాసం ఉంటే మన మెదడుకి బోల్డు సందేహాలు వస్తాయిట. ఏమనంటే వీడు కావాలని తినలేదా లేక తిండి దొరక్క తినలేదా అని? కాని దానికి ఆ సందేహ నివృత్తి ఎలా అవుతుంది. అవ్వదు. అందుకని అదేం చేస్తుందంటే మనం తర్వాత ఎప్పుడు ఏం తిన్నా దాంట్లో అతి ఎక్కువ శాతాన్ని కొవ్వుకింద మార్చేస్తుందిట! ఎందుకంటే దానికి అనుమానం మనమీద. మనం మళ్ళీ ఇంత తొందరలో ఎమన్నా తింటామా తినమా అని? ఏమో ఇంకొన్నాళ్ళు ఏమీ తినకపోతే? అప్పుడు మనకి శక్తి ఇచ్చే బాధ్యత దానిదే అని దాని ఫీలింగ్. అందుకే ఈ ముందస్తు జాగ్రత్త పనులు. ఇంగ్లీష్ వాడు చెప్పినట్టు "సేవింగ్ ఫర్ ఏ రైనీ డే"! కాని ఆచారం, సాంప్రదాయం, భక్తి ఇవన్నీ పక్కన పెడితే ఉపవాసం చెయ్యడానికి నాకున్న మరీ ముఖ్య కారణం కనీసం ఒక 100 గ్రాములైన బరువు తగ్గుదామని. కాని ఇలా మన మెదడు తర్వాత తిన్నదాన్నంతా కొవ్వుకింద మార్చేస్తే బరువు తగ్గకపోగా బలుపు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది కదా?

కాని ఇదంతా ఆ అద్దంలో అంతరాత్మకి చెప్పాలంటే కష్టం. ఎందుకంటే నేను  అలా అద్దంలో చాలాసేపు మాట్లాదేస్తూంటే చుట్టూ ఉన్న వాళ్ళకి పిచ్చి ఎక్కిపోయి నాకు పిచ్చి పట్టింది అని ఒక తప్పుడు నిర్ణయానికి వచ్చే అవకాశాలు భారీ ఎత్తున కనిపించాయి. అందుకని ఉపవాసం చేసే సంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చేసా!

కాబట్టి కాగాపోగా ఇవాళ్టి నుంచీ అద్దంలో అంతరాత్మ అదృశ్యం :) ఎంచక్కా నా ముఖారవిందం అద్దంలో నేను హాయిగా చూసుకోవచ్చు!! 
 

Wednesday, November 19, 2014

సరాసరి మోక్షం పొందాలంటే చాల సులభమార్గం!! Surefire way to get "Moksham"!!

పూర్వం పురాణాల్లో చాల కథల్లో ఎవరైనా ఋషులకికాని, దేవుళ్ళకికాని బాగా కోపం తెప్పిస్తే వెంటనే వాళ్ళు అలా కోపం తెప్పించిన వాళ్ళని శపించేవాళ్ళు! దాంతో ఆ శాపగ్రస్తులు వెంటనే వాళ్ళని క్షమాభిక్ష కోసం స్తుతిస్తే శపించినవాళ్ళు శాంతించి వెంటనే శాపవిమోచనం చెప్పేవాళ్ళు. ఇక్కడ ఒక "చమత్కారం" ఏమిటంటే ఆ శాపగ్రస్తులందరూ వాళ్ళ శాపవిమోచనం అయ్యిన వెంటనే "మోక్షం" పొందేసేవాళ్ళు! అంటే ఇక  No పునరపి జననం. No పునరపి మరణం!

దీన్ని బట్టి నాకర్థం అయ్యింది ఏమిటంటే ఎవరికైనా ఇంకా బోల్డు బోల్డు జన్మలు ఎత్తకుండా సులభంగా సరాసరి మోక్షం పొందాలంటే చాల సులభమార్గం ఏమిటంటే ఎవరైనా ఋషులకికాని దేవుళ్ళకి కాని అర్జెంటుగా విపరీతమైన కోపం తెప్పించేయ్యడమే! మోక్షం తధ్యం :)

నోట్: ఇది నేను కేవలం సరదాకి రాసింది! నన్ను అపార్థం చేసుకొని ఇక్కడ ఋషులు ఎవరైనా ఉంటె వాళ్ళు నన్ని శపించవద్దని ముందస్తు మనవి! నాకింకా చాల జన్మలు ఎత్తాలని ఉంది...ఇంకా  తీరని, ఈ జన్మలో తీర్చుకోలేనివి బోల్డు కోరికలున్నాయి నాకు!!!

Thursday, November 13, 2014

Screen based life!!

Today people's lives are revolving around 4 screens! Mobile, Laptop/iPad/PC, TV & Cinema ;)

The other day an amusing incident happened which is yet another example of the present day screen based life! 

I was going to the airport alone at 9 PM and at the start of PVNR Expressway in Hyderabad there will always be few persons waiting for taxis/private cars for a paid/free lift! Though I've not done it before I suddenly decided to offer lift to any one who cared to ask for it. And to my surprise not even one person looked at me nor asked for a lift as, guess what, ALL of them were busy looking at their mobile screens:(