Showing posts with label అభ్యంగనస్నానం. Show all posts
Showing posts with label అభ్యంగనస్నానం. Show all posts

Friday, August 21, 2020

Intinti Ramayanam!

ఎనిమిదవుతోంది. లేవవే తల్లీ. నాకు వంట సాయం సంగతి దేవుడెరుగు. కనీసం తొందరగా స్నానం చేసి వినాయకుడి పూజకి పాలవెల్లి గట్రా కట్టచ్చుగా

అబ్బా లేస్తానుండవే

ఉంటానే ఉంటాను. అయినా నిన్ను కాదు అదిగో మీ నాన్నననాలి! నా బుజ్జి తల్లి. నా  బంగారు కొండ అని నిన్ను చిన్నప్పటినుంచి ముద్దు చేసి గారాబం చేశారు చూడు. ఆయనదే తప్పు. నువ్ పడుకో తల్లీ.  నేనున్నానుగా. గుమ్మటంలా. నే చేసుకుంటాలే. నువ్వు హాయిగా బజ్జో పదింటిదాకా.

దాన్ని వదిలెయ్యవే. శుభ్రంగా ఉద్యోగం చేస్తోంది. రేపు ఎలాగూ పెళ్లయ్యాక నీకంటే ఎక్కువే పని చేసుకోవాలి. ఇప్పుడయినా సుఖపడనియ్.

అట్లాగే వెనకేసుకు రండి. ఏం నేనేమన్నాఉద్యోగం చేయనిస్తే చెయ్యనన్నానా? నేను పాస్ అయ్యా ఎమ్ కామ్. ఏం సుఖం ఇలా ఇంట్లో కామ్ గా పడుండాల్సి వచ్చింది. నాకేమన్నా ఛాయిస్సా. వాయిస్సా.

ఒరిస్సా వేపు వెళ్తున్న వాయుగుండం గబుక్కున 180 డిగ్రీలు వెనక్కి తిరిగి కేరళ వేపు వచ్చినట్టు కూతురునుంచి తన మీదకి ఇలా బోఫోర్స్ గన్ ఎక్కు పెట్టింది ఏమిటని పాపం ఆ మొగుడుగారు విలవిలా విలపించింగ్!

అమ్మా కాఫీ!

లేచావా తల్లీ. రా. కాఫీ తాగాక మళ్ళీ ఆ వెధవ ఫోన్ పట్టుకు కూర్చోకుండా వెంటనే తలంటు పోసుకుంటే బాగుంటుంది. అసలే ఇంకో గంటలో దుర్ముహూర్తం వచ్చేస్తోంది.

నన్ను కాఫీ తాగనిస్తావా ప్రశాంతంగా? స్నానం ఎంతసేపు. చిటికెలో చేసొచ్చేస్తా. నువ్వేం వర్రీ అవ్వకు.

వర్రీ నేనెందుకు అవుతా. రేప్పొద్దున్న నిన్ను కట్టుకునే వాడు అవ్వాలి వర్రీ.

అబ్బా ఆలూ లేదూ చూలూ లేదూ . ఎప్పుడో అయ్యే పెళ్లి తర్వాత నా మొగుడు వర్రీ అవుతాడని నువ్వు ఇప్పటినించీ వర్రీ అవడం ఏమిటి. మా తిప్పలు మేం పడతాంలే. నువ్వు ముందు ఆ మహా నైవేద్యం సంగతి చూడు. అన్నీ చేస్తే కానీ పూజ మొదలెట్టనివ్వవు. దేవుడికి ముందు ఒక ప్రసాదం చేసేసి పూజయ్యాక చేసుకోవచ్చుగా మిగతా వంట.

ఇదిగో చూడు. మీ తరానికయితే పూజ పునస్కారాలు నామ్ కె వాస్తే. నన్ను ఇలా వదిలేయి. ఇన్నేళ్ళుగా చేసుకుంటున్నా. ఇప్పుడు చెయ్యలేనా  ఏమిటి.

అన్నట్టు స్నానం అయ్యాక నీ బట్టలన్నీ అలా బెడ్ రూంలో నేలమీద పడెయ్యకు రోజూలా. తీసుకెళ్లి బైట బాల్కనీ లో పడేయ్. అలాగే నీ తమ్ములుంగారి బట్టలు కూడా. వాడు ఓ రాజకుమారుడిలాగా అన్నీ ఎక్కడ పడితే అక్కడే పడేయడం. వాడి పెళ్లయ్యాక వాడి పెళ్ళాం ఎలా భరిస్తుందో చూడాలి.

నా మొగుడి సంగతయ్యింది. ఇప్పుడు వాడి రాబోయే పెళ్ళాం సంగతి అవసరమా. అయినా మీ పెద్దోళ్లున్నారే మాటిమాటికీ మా పెళ్లి ఊసే ఇంకో మేటర్ ఏమీ లేనట్టు.

ఏ వయసులో ముచ్చట ఆ వయసులో అన్నారు. నీ వయసుకి నాకు మీ ఇద్దరూ పుట్టారు తెలుసా?

ఎందుకు తెలీదు. శుభ్రంగా తెలుసు. పాతికేళ్ళు రాకుండానే ఇద్దరినీ కనేసి హాయిగా ఇంటికే అంకితం అయిపోయావ్.

శిష్యా! ఈ ఇంటింటి రామాయణం అనంతంగా ఇలా సాగుతూనే ఉంటుంది 

Tuesday, March 24, 2020

Ugadi. ఉగాది శుభాకాంక్షలు

ఓపిక, తీరిక లేనివాళ్ళందరికీ శార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలు! ఇదేటిదీ ఇలగంటున్నానేటి అని సంబ్రమాశ్చర్యపడకండి. నేను కోడికంటే ముందు లేస్తాను కాబట్టి నాకు బోల్డు సమయం ఉంది బోల్డు పెద్ద పోస్ట్ రాయడానికి సంకల్పించాను. మరది సదవాలంటే మీక్కూడా బోల్డు టైం ఉండాలిగా? అది లేనివాళ్ళకి ముందస్తుగా చెప్పేసాను.

ఇహ తీరిక ఉన్నవాళ్లు, తీరిక చేసుకున్నవాళ్ళు అమెరికావాడిలాగా ఓ పెద్ద జగ్గు సైజు మగ్గులో వేడి కాఫీ పోసుకొని, పడక్కుర్చీలో కాళ్ళు బార్ల చాపుకొని ఆ కాఫీ ఆస్వాదిస్తూ సదూకోండ్రి.

ఇవాళ ఉగాది అన్న విషయం తెలుగు పెజానీకానికి తెలిసిన విషయమే. కానీ ఇప్పటి తరాలకి తెలీని విషయాలు ...

ఇవాళ తెల్లారగట్లే లేచి .... ఎందుకులెండి... యువతరం బాధపడతారు... పొద్దున్నే లేచి (పొద్దున్నే అంటే ఏ గొడవా ఉండదు... పదింటికి లేచినా పొద్దున్నే!)... కూసీపయ్యాక జుట్టుకు భారీ ఎత్తున నూనె, నువ్వుల నూనె అయితే భేష్, మర్దనా చేసి అంటే హెయిర్ కటింగ్ సెలూన్లో మంగలాడు తబలా వాయించినట్టు అన్నమాట, ఆపై వళ్ళంతా శుభ్రంగా నలుగుపెట్టుకుని ..ఇగో కుర్రాళ్లు నలుగు పెట్టడం అంటే ఏంటి ఇది మాకు అవుట్ అఫ్ సిలబస్ అని నన్ను సింపుల్గా దాన్ని వివరించమని అడక్కండి. ఆశ, దోస, అప్పడం, ఆవడ! ఛస్తే చెప్పను. నాకసలే బోల్డు పనులున్నాయి. కావాలంటే మీ ఇంట్లో నాకంటే పెద్దవాళ్ళుంటే వాళ్ళని అడగండి. లేకపోతె గూగుల్ చెయ్యండి.

నలుగు పెట్టుకుని ఓ చిన్ని తువ్వాలు చుట్టుకుని అంటే జ్యోతిర్లచ్మి సీరంత తువ్వాలు అన్నమాట! అలా ఓ గంటసేపు ఎండలో సంచరించండి. ఒళ్ళంతా చిమచిమలాడాక కుంకుడుకాయలతో అభ్యంగనస్నానం చెయ్యండి. ఈ కుంకుడుకాయలేంటి అంకుల్ అని విసిగించకండి. ఈ అంకుల్ అంటీ పిలుపులంటే నాకు మా సెడ్డ సిరాకు. కుంకుడుకాయలంటే కూరొండుకునే బెండకాయ, వంకాయ టైపు కాదు! అవెట్టి అంటే వాటిని ఓ గుండ్రాయితో పగలకొట్టి మీరు షాంపూ తో తలస్నానం చేసినట్టు చెయ్యడం! ఈ కుంకుడుకాయలు ఎక్కడ దొరుకుతాయని మరింకో యక్షప్రశ్న వెయ్యద్దు. అమెజాన్ వాడు ఈపాటికి అమ్మడం మొదలెట్టే ఉంటాడు! కుంకుడు కాయల్ని ఇంగ్లీష్ లో ఏమంటారని మళ్ళీ నన్నడగద్దు. నేనేమీ గూగుల్ కాదు. అప్పుడప్పుడూ వాడిని కూడా  విసిగించండి. ఇంతకీ ఆ ఇంగ్లీష్ మాట తెలీగానే అమెజాన్ లో ఆర్డర్ సెయ్యండి. వచ్చే ఉగాదికయినా పనికొస్తాయి. ఎన్నేళ్లయినా పాడవ్వవు. అన్నట్టు కుంకుడుకాయలు బద్దలుకొట్టినప్పుడు లోపల నల్లటి గుండ్రంగా ఉన్న గింజలు ఉంటాయి. ఓ గింజనట్టుకుని గచ్చుమీద పదిసార్లు బాగా రుద్ది వెంటనే పక్కనోళ్ళ చేతిమీద పెట్టి చూడండి. మస్తుగుంటది! మనకి. వాళ్ళక్కాదు

అలా అభ్యంగనస్నానం ... ఓహో ఇది కూడా తెల్దుగా ... సింపుల్గా మీకర్ధమయ్యేట్టు చెప్పాలంటే తలంటు! ఈ కార్యక్రమం జయప్రదంగా ముగించాక ఇంకో పావుగంట ఓ మంచి కాలక్షేపం పనోటుంది. అదేటంటే ఆ కుంకుడుకాయ తొక్కలు, గింజ ముక్కలు మీ జుట్టులో ఇరుక్కుపోయిన వాటిని ఒకటొకటి పీకడం. బోల్డు టైం పాస్... ఓ పక్క ఈ ఫేస్బుక్ సూస్తూ.

లేకపోతే ఒక కోతి ఇంకో కోతికి తల్లో పేలు చూసినట్టు, మీరు ఇంకోళ్ళ జుత్తులో ఉన్నవి పీకి మీ జుత్తులోవి వాళ్ళని పీకమనండి. ఎవరు ఎక్కువ పీకితే వాళ్లకి రెండో వాళ్ళు ఓ నూట పదహార్లు సదివించుకోవాలని ఓ పందెం పోటీ కూడా సర్దాగా పెట్టుకోవచ్చూ.

ఆ పైన మీ ఇంట్లో ఉన్న దేవుడికి ఓ చిన్ని నమస్కారం పడేసి మీకు కంఠతా రాకపోతే గూగుల్ చేసి "శుక్లాంబరధరం ... " అని ఓ రెండు లైన్ల శ్లోకం సదివేసి... దానర్ధం తర్వాత తీరిగ్గా తెలుసుకుందారి ... అది తప్పులు పోకుండా సదివి... ఆ తర్వాత ఉగాదిపచ్చడి తిని, ఒకింత తాగితే ... అందులో ఉన్న షడ్రుచులు ... ఇదేటి మాస్టారూ ఆడపడుచులు అని విన్నాం కానీ ఈ షడ్రుచులు ఏటంటారా? కూసింత అప్పుడప్పుడూ తెలుగు నేర్చుకుంటే బాగుంటుంది. షడ్రుచులు అంటే ఆరు రుచులు ... బహుశా ఆరు ఋతువులకి గుర్తుగానేమో . అవి తీపి, పులుపు, కారం, వగరు, ఉప్పు, చేదు! ఇవన్నీ ఆ ఉగాదిపచ్చడిలో ఉంటాయి. భారీఎత్తుని తినండి! తాగండి! ఇక్కడ ఓ నమ్మకం ఉందండోయ్! ఉగాదిపచ్చడి నోట్లో వేసుకోగానే మనకి ముందస్తుగా ఏ రుచి తగులుతుందో ఇహా ఈ సంవత్సరం అంతా ఆ అనుభవాలు ఎక్కువగా ఉంటాయి అని! ఉదాహరణకి తీపి తగిలితే ఇంకేముంది హోల్ ఇయర్ హోల్ సేల్ గా తీపి గుర్తులే! ఇక్కడ వాస్తు మార్పులు చేసి మన అదృష్టాన్ని మనకిష్టం వఛ్చినట్టు మార్చేసినట్టు, మనకి ఏ అనుభవం కావాలనుకుంటే తత్సంబంధమైనది ఒకింత ఎక్కువ వేసి పచ్చడి చేస్తే సరి! ఉదా: బెల్లం ఎక్కువేస్తే ఇహ మరి తియ్యగానే కదా ఉండేది! మరింకేం రెచ్చిపోండి.

అన్నట్టు సెప్పడం మర్సేపోయా మీకు పండక్కి, పబ్బానికి (లోపాయికారీ మేటర్ ఏమిటంటే ఈ పబ్బానికి అన్న మాటకి అర్ధం నాకూడా తెలీదు!) కొత్త బట్టలు వేసుకునే సాంప్రదాయం ఉంటే అవి వేసుకుని ఆ పైన దేవుడికి దండం, తర్వాత తొంగోడం1

అన్నట్టు మర్సేపోయా! తొంగోడానికంటే ముందు పంచాంగ శ్రవణం! అంటే ఇంట్లో పంచాంగం ఉందనో, లేక ఆన్లైన్ లో చూసో మీ రాశిఫలాలు చదివేసుకోవడం కాదు! శాస్త్రం ఒప్పుకోదు! ఇంకొకళ్ళు చదివితే వినడం! రాశిఫలాలే కాదు, దేశానికి ప్రపంచానికి కూడా వార్షిక ఫలితాలు చెప్తారు. ఏ కొరోనా ఎప్పుడు పోతుందో కూడా దుర్భిణీ వేసి చూసి సెప్తారు. 

ఆ తర్వాత పచ్చడి (మెతుకుల)తో కడుపు నిండదు కాబట్టి... పండగ పూట కూడా పాత మొగుడేనా అన్నట్టు ఇవ్వాళ కూడా పొద్దుగాల ఉప్మా చేసుకోకుండా ఇంకేదైనా వెరైటీ టిఫినీ చేసుకొని తినండి.

తర్వాతేముంది ...షరా మామూలే... వాట్సాప్ లో వచ్సిన ప్రతి మెసేజ్ ని ప్రతి గ్రూప్లో ఫార్వర్డ్ చెయ్యడం, ఇక్కడ ఓ పోస్టు పడెయ్యడం. తర్వాత అబ్బా బాగా అలిసిపోయాం అని బోయనం టైం దాకా ఓ కునుకెయ్యడం. ఏ మాటకామాటే! నలుగెట్టుకొని, తలంటోసుకున్నాక నిద్రొస్తుంది చూడండి...

నిద్ర లేచాక, క్షమించాలి లేపాక... భారీగా ఆవలించి ఏమిటి పండగ స్పెషల్ అని మీ ఆవిడనో, ముమ్మీనో విసిగించి ఆవిడ పెట్టినవి తిని netflix లో, అమెజాన్ ప్రైమ్ లో ఓ అరా డజనుకు తక్కువ కాకుండా సినిమాలు సీరియళ్లు బింజ్ వాచింగ్!

మరిహ డిన్నరయ్యాక ఢాంమ్మని మంచం మీదకి గెంతి బొబ్బొడం!

ఇలా చేసిన వాళ్లందరికీ, వచ్చే ఏడాది చేద్దాంలే అనుకుని ఇవాళ ప్రతి రోజులాగే సాదా సీదాగా గడిపేసే వాళ్లందరికీ ... ఇవన్నీ ఎందుకు మీ అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు

ముఖ్య గమనిక: ఇవాళ ఏం చేసినా, ఎలా చేసినా మీ ఇష్టం. కానీ మీ కొంప నాలుగు గోడల మధ్యే చేయండి. లేప్పోతే తర్వాత నవ్వలే"క రోనా" 

Friday, April 5, 2019

Ugadi! ఉగాది!!

ఓపిక, తీరిక లేనివాళ్ళందరికీ వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు! ఇదేటిదీ ఇలగంటున్నానేటి అని సంబ్రమాశ్చర్యపడకండి. నేను కోడికంటే ముందు లేస్తాను కాబట్టి నాకు బోల్డు సమయం ఉంది బోల్డు పెద్ద పోస్ట్ రాయడానికి సంకల్పించాను. మరది సదవాలంటే మీక్కూడా బోల్డు టైం ఉండాలిగా? అది లేనివాళ్ళకి ముందస్తుగా చెప్పేసాను.

ఇహ తీరిక ఉన్నవాళ్లు, తీరిక చేసుకున్నవాళ్ళు అమెరికావాడిలాగా ఓ పెద్ద జగ్గు సైజు మగ్గులో వేడి కాఫీ పోసుకొని, పడక్కుర్చీలో కాళ్ళు బార్ల చాపుకొని ఆ కాఫీ ఆస్వాదిస్తూ సదూకోండ్రి.

ఇవాళ ఉగాది అన్న విషయం తెలుగు పెజానీకానికి తెలిసిన విషయమే. కానీ ఇప్పటి తరాలకి తెలీని విషయాలు ...

ఇవాళ తెల్లారగట్లే లేచి .... ఎందుకులెండి... యువతరం బాధపడతారు... పొద్దున్నే లేచి (పొద్దున్నే అంటే ఏ గొడవా ఉండదు... పదింటికి లేచినా పొద్దున్నే!)... కూసీపయ్యాక జుట్టుకు భారీ ఎత్తున నూనె మర్దనా చేసి అంటే తబలా వాయించినట్టు అన్నమాట, ఆపై వళ్ళంతా శుభ్రంగా నలుగుపెట్టుకుని ..ఇగో కుర్రాళ్లు నలుగు పెట్టడం అంటే ఏంటి ఇది మాకు అవుట్ అఫ్ సిలబస్ అని నన్ను సింపుల్గా దాన్ని వివరించమని అడక్కండి. ఆశ, దోస, అప్పడం, ఆవడ! ఛస్తే చెప్పను. నాకసలే బోల్డు పనులున్నాయి. కావాలంటే మీ ఇంట్లో నాకంటే పెద్దవాళ్ళుంటే వాళ్ళని అడగండి. లేకపోతె గూగుల్ చెయ్యండి.

నలుగు పెట్టుకుని ఓ చిన్ని తువ్వాలు చుట్టుకుని అంటే జ్యోతిర్లచ్మి సీరంత తువ్వాలు అన్నమాట! అలా ఓ గంటసేపు ఎండలో సంచరించండి. ఒళ్ళంతా చిమచిమలాడాక కుంకుడుకాయలతో అభ్యంగనస్నానం చెయ్యండి. ఈ కుంకుడుకాయలేంటి అంకుల్ అని విసిగించకండి. ఈ అంకుల్ అంటీ పిలుపులంటే నాకు మా సెడ్డ సిరాకు. కుంకుడుకాయలంటే కూరొండుకునే బెండకాయ, వంకాయ టైపు కాదు! అవెట్టి అంటే వాటిని ఓ గుండ్రాయితో పగలకొట్టి మీరు షాంపూ తో తలస్నానం చేసినట్టు చెయ్యడం! ఈ కుంకుడుకాయలు ఎక్కడ దొరుకుతాయని మరింకో యక్షప్రశ్న వెయ్యద్దు. అమెజాన్ వాడు ఈపాటికి అమ్మడం మొదలెట్టే ఉంటాడు! ఆర్డర్ సెయ్యండి. రెండుగంటల్లో ఇస్తాడు. అన్నట్టు కుంకుడుకాయలు బద్దలుకొట్టినప్పుడు లోపల నల్లటి గుండ్రంగా ఉన్న గింజలు ఉంటాయి. ఓ గింజనట్టుకుని గచ్చుమీద పదిసార్లు బాగా రుద్ది వెంటనే మీ చేతిమీద పెట్టుకుని చూడండి. మస్తుగుంటది!!

అలా అభ్యంగనస్నానం ... ఓహో ఇది కూడా తెల్దుగా ... సింపుల్గా తలంటు! ఈ కార్యక్రమం జయప్రదంగా ముగించాక ఇంకో పావుగంట ఓ మంచి కాలక్షేపం పనోటుంది. అదేటంటే ఆ కుంకుడుకాయ తొక్కలు, గింజ ముక్కలు మీ జుట్టులో ఇరుక్కుపోయిన వాటిని ఒకటొకటి పీకడం. బోల్డు టైం పాస్... ఓ పక్క ఈ ఫేస్బుక్ సూస్తూ.

ఒక కోతి ఇంకో కోతికి తల్లో పేలు చూసినట్టు, మీరు ఇంకోళ్ళ జుత్తులో ఉన్నవి పీకి మీ జుత్తులోవి వాళ్ళని పీకమనండి. ఎవరు ఎక్కువ పీకితే వాళ్లకి రెండో వాళ్ళు ఓ నూట పదహార్లు సదివించుకోవాలని ఓ పందెం పోటీ కూడా సర్దాగా పెట్టుకోవచ్చూ.

ఆ పైన మీ ఇంట్లో ఉన్న దేవుడికి ఓ చిన్ని నమస్కారం పడేసి మీకు కంఠతా రాకపోతే గూగుల్ చేసి "శుక్లాంబరధరం ... " అని ఓ రెండు లైన్ల శ్లోకం సదివేసి... దానర్ధం తర్వాత తీరిగ్గా తెలుసుకుందారి ... అది తప్పులు పోకుండా సదివి... ఆ తర్వాత ఉగాదిపచ్చడి తిని, ఒకింత తాగితే ... అందులో ఉన్న షడ్రుచులు ... ఇదేటి మాస్టారూ ఆడపడుచులు అని విన్నాం కానీ ఈ షడ్రుచులు ఏటంటారా? కూసింత అప్పుడప్పుడూ తెలుగు నేర్చుకుంటే బాగుంటుంది. షడ్రుచులు అంటే ఆరు రుచులు ... బహుశా ఆరు ఋతువులకి గుర్తుగానేమో . అవి తీపి, పులుపు, కారం, వగరు, ఉప్పు, చేదు! ఇవన్నీ ఆ ఉగాదిపచ్చడిలో ఉంటాయి. భారీఎత్తుని తినండి! తాగండి! ఇక్కడ ఓ నమ్మకం ఉందండోయ్! ఉగాదిపచ్చడి నోట్లో వేసుకోగానే మనకి ముందస్తుగా ఏ రుచి తగులుతుందో ఇహా ఈ సంవత్సరం అంతా ఆ అనుభవాలు ఎక్కువగా ఉంటాయి అని! ఉదాహరణకి తీపి తగిలితే ఇంకేముంది హోల్ ఇయర్ హోల్ సేల్ గా తీపి గుర్తులే! ఇక్కడ వాస్తు మార్పులు చేసి మన అదృష్టాన్ని మనకిష్టం వఛ్చినట్టు మార్చేసినట్టు మనకి ఏ అనుభవం కావాలనుకుంటే తత్సంబంధమైనది ఒకింత ఎక్కువ వేసి పచ్చడి చేస్తే సరి! ఉదా: బెల్లం ఎక్కువేస్తే ఇహ మరి తియ్యగానే కదా ఉండేది! మరింకేం రెచ్చిపోండి.

అన్నట్టు సెప్పడం మర్సేపోయా మీకు పండక్కి, పబ్బానికి (లోపాయికారీ మేటర్ ఏమిటంటే ఈ పబ్బానికి అన్న మాటకి అర్ధం నాకూడా తెలీదు!) కొత్త బట్టలు వేసుకునే సాంప్రదాయం ఉంటే అవి వేసుకుని ఆ పైన దేవుడికి దండం, ఉగాది పచ్చడి తిండం!

అటు పిమ్మట పంచాంగ శ్రవణం! అంటే ఇంట్లో పంచాంగం ఉందనో, లేక ఆన్లైన్ లో చూసో మీ రాశిఫలాలు చదివేయడం కాదు! శాస్త్రం ఒప్పుకోదు! ఇంకొకళ్ళు చదివితే వినడం! ఆ రాశిఫలాలు, ఆదాయ వ్యయాలు విని నిరాశపడకండి.

ఆ తర్వాత పచ్చడి (మెతుకుల)తో కడుపు నిండదు కాబట్టి... పండగ పూట కూడా పాత మొగుడేనా అన్నట్టు ఇవ్వాళ ఇంట్లో టిపినీకి బ్రేక్ ఇచ్చి స్విగ్గీ వాడితో మంచి ఒటేలునుంచి జబర్దస్త్ టిఫిన్ తెప్పించుకొని లాగించేయ్యండి.

తర్వాతేముంది ...షరా మామూలే... వాట్సాప్ లో వచ్సిన ప్రతి మెసేజ్ ని ప్రతి గ్రూప్లో ఫార్వర్డ్ చెయ్యడం, ఇక్కడ ఓ పోస్టు పడెయ్యడం. తర్వాత అబ్బా బాగా అలిసిపోయాం అని బోయనం టైం దాకా ఓ కునుకెయ్యడం. ఏ మాటకామాటే! నలుగెట్టుకొని, తలంటోసుకున్నాక నిద్రొస్తుంది చూడండి...

నిద్ర లేచాక, క్షమించాలి లేపాక... భారీగా ఆవలించి ఏమిటి పండగ స్పెషల్ అని మీ ఆవిడనో, ముమ్మీనో విసిగించి ఆవిడ పెట్టినవి తిని netflix లో బింజ్ వాచింగ్!

మరిహ సాయంత్రం ఓ నలుగురింటికెళ్లి వాళ్ళందరి ఉగాది పచ్చడి తిని తాగి పదింటికి కొంప చేరి ధామ్మని మంచం మీదకి గెంతి బొబ్బొడం!

ఇలా చేసిన వాళ్లందరికీ, వచ్చే ఏడాది చేద్దాంలే అనుకుని ఇవాళ ప్రతి రోజులాగే సాదా సీదాగా గడిపేసే వాళ్లందరికీ ... ఇవన్నీ ఎందుకు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు