ఇవాళ "నువ్వు వంట చెయ్యి" అని మా ఆవిడకి ఛాన్స్ ఇచ్చాను. ఇలా అప్పుడప్పుడూ వాళ్లకి ఉత్సాహ, ప్రోత్సాహాలు ఇవ్వకపోతే రెండు ప్రమాదాలున్నాయి.
1. మర్రిచెట్టుకింద సామెత లాగా వంటలో మనంత ఎదగరు!
2. రోజూ మనమే చేస్తూంటే వాళ్ళకొచ్చిన ఆ కాస్త మర్చిపోయి, కూరల్లో పోపులో ఏవో చిన్ని చిన్ని ఆకులెయ్యాలన్నంత మట్టుకే గుర్తొచ్చి కరివేపాకు బదులుగా కొత్తిమీర పోపులో వేసే అవకాశాలు బాగా ఎక్కువ
పైపెచ్చు వర్కింగ్ డే నాడు సెలవెట్టి డైనింగ్ టేబుల్ దగ్గరో లేదా హాల్లో సోఫాలోనో కళ్ళు మూసుకుని, ఇంకొంచం ఓవర్ ఆక్షన్ చెయ్యాలంటే కుర్చీలోంచి సగం కిందకి జారిపోయి, కాళ్ళు చాపుకుని మా ఆవిడ బ్రహ్మాండంగా చేసిన వేడి వేడి ఫిల్టర్ కాఫీ తాగుతూ ఈ దేశం గురించి, ప్రజల గురించి, ఇప్పుడయితే ఒకింత ఆ కొరోనా గురించి ఆలోచించడంలో ఉన్న కిక్కే వేరప్పా
ఎందుకంటే మనలాంటి బిజీ బిజీ మడుసులకి అప్పుడప్పుడూ ఇలా ఆట విడుపు కావాలి. లేపోతే ముళ్ళపూడి గారు చెప్పినట్టు "మడిసన్నాక కూసింత కళాపోసనుండాల. లేపోతే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటాది" అందుకని మనం రోజూ గొడ్డు చాకిరీ చేసినా ఇలా ఆలోచించాలన్నమాట. అప్పుడు మడిసేం ఖర్మ ఏకంగా పెద్ద మడిసయిపోతాం
కాగాపోగా నే సెప్పొచ్ఛేదేటంటే ... ఆగండలాగా .... ఇంకా ఏటి సెప్పాల ... పైన సెప్పిందంతా ఏటంటారు. ఏదోలెండి. సంసారవాదులకి పేరుతొ ఏం పని?
ఇలా ఏమీ చెయ్యకుండా అప్పుడప్పుడూ కూర్చోడంలో ఇంకో ప్రయోజనం కూడా ఉంది . రోజూ ప్రజానీకం మనకి పనికిమాలిన వీడియోలు, పోస్టులు వాట్సాప్ లో తెగ ఫార్వర్డ్ చేసి విసిగిస్తూంటారు కాబట్టి. మనం ఇలా ఖాళీగా - ప్రజల దృష్టిలో అనుకోండి. మనమయితే దేశం గురించి ప్రపంచం గురించి ఆలోచిస్తూంటాం కదా - ఇలా ఆటవిడుపులో ఇంటర్వెల్ లా మనం కూడా ఒక గ్రూప్ నించి వచ్చిన పోస్టులు, వీడియోలు ఓ డజను గ్రూపులకి ఫార్వర్డ్ చేస్తే బోల్డు సేపు కాలక్షేపం అవుతుంది. ఎందుకంటే ఈ మజ్జెన ఆ వాట్సాప్ వాడు ఫార్వర్డ్ చేస్తే వచ్చిన వాటిని ఒకటికంటే ఎక్కువమందికి ఒకేసారి ఫార్వర్డ్ చేసే సదుపాయం తీసేసాడుగా. అంచేత ఒకటీ ఒకటీ ఒక్కో గ్రూప్ కి ఫార్వర్డ్ చేసే టైంకి మనకి టిఫినికి రండి అన్న పిలుపొస్తుంది.
అప్పుడు తెగ పని చేసి అలిసిపోయిన వాడిలా ఒక్కసారి బధ్ధకంగా ఒళ్ళు విరుచుకుని వెళ్లి బ్రేక్ఫాస్ట్ శుభ్రంగా లాగించేయచ్చు.
మనం ఖాళీగా కూర్చొని మనావిడని (ఇక్కడ మనావిడ అన్నది ఏదో ఫ్లో లో అన్నమాట .. ఒక సినిమాలో కమెడియన్ సుధాకర్ జగపతిబాబుకి వచ్చిన లెటర్ చదువుతాడు...అంతకు మించి డీటెయిల్స్ గుర్తులేవు ... అక్కడ దొర్లిన పొరపాటు లాంటిదని గమనించి క్షమించేయండి) మధ్య మధ్యలో వంటింట్లోకి వెళ్లి "ఇదిగో నిన్నే ఈ వీడియో చూడు. అదిరిందనుకో" అని డిస్టర్బ్ చేయచ్చు. అంటే వాళ్ళు ఆలా అనుకుంటారు మనం డిస్టర్బ్ చేశామని. మన ఉద్దేశం అది కాదని వాళ్ళకి ఏకాగ్రత పెరగడం కోసం ట్రైనింగ్ ఇస్తున్నామని ఎవరు చెప్తారు. నా గురించి నేను పెద్దగా మా ఆవిడ దగ్గర చెప్పుకోను.
ఈ ట్రైనింగ్ ఎందుకంటారా? ఎందుకేమిటండీ బాబూ ప్రతి మనిషికి చేస్తున్న పని మీద శ్రద్ధ, ఏకాగ్రత లేకపోతె ఎంత ప్రమాదం. మర్నాడు ఎంసెట్ పరీక్ష ఉంటె ఇవాళ పక్కింట్లో పెళ్లవుతున్నాది అని వాళ్ళు బాజా భజంత్రీలు వీర లెవెల్లో వాయిస్తూంటే మనం చదువు మీద శ్రద్ధ పెడతామా లేక ఆ బాజా భజంత్రీలు వాయించే పాటల మీదా? మరి అలాంటి ఏకాగ్రత ఎలా వస్తుంది. ఇలా అభ్యాసం చేస్తేనే. నేను ఈ వీడియో చూడు అనగానే కూరలో ఇంకో చెంచా ఉప్పేసేస్తే ఎలా? అందుకని మా ఆవిడకి ఇలా అవకాశం ఇచ్చి తను వంట చేస్తూంటే నేను పక్క వాయిద్యం లా కాదు కాదు.. అష్టావధానంలో "అప్రస్తుత ప్రసంగం" వాడిలా తనని డిస్టర్బ్ చేసి ట్రైనింగ్ ఇస్తాను. నేనేం చేసినా పైకి కనిపించని లోకకల్యాణం కోసమే కదా

No comments:
Post a Comment