ఈ మధ్యన నాకు నా అంతరాత్మకి చిన్ని చిన్ని ఘర్షణలు తరుచుగా జరుగుతూండడంతో నాకు విసుగొచ్చి దానికి కటీఫ్ చెప్పేసా. అప్పటినించీ మా ఇద్దరికీ మధ్య మాటల్లేవు. ఇప్పుడు ప్రాణం హాయిగా, ప్రశాంతంగా ఉంది.
ఇంతకీ గొడవలెందుకంటారా? వస్తున్నా అక్కడికే.
అది తెలుసుకోవాలంటే అధమపక్షం ఓ మూడు, నాలుగు దశాబ్దాలు వెనక్కి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోవాలి. పదండి మరిహ అలీసం దేనికి? అక్కడే ఉంచేస్తానని భయపడకండి. ఇలా వెళ్లి అలా వచ్చేద్దాం. ఆబ్బె అది కాదు. అలా వెళ్లి ఇలా వచ్చేద్దాం.
అవి నేను బ్రహ్మచారిగా ఎంచక్కా చిన్ని ఉద్యోగం చేసుకుంటూ హాయిగా కాలం గడిపేస్తున్న రోజులు. ఏంటో గురూ ఆ రోజులే వేరు. సరే రోజూ బైటికి వెళ్తున్నప్పుడు ఈ అంతరాత్మ నేను కూడా వస్తానని ఓ తెగ గొడవ చేసేది. సర్లే ఇంట్లో ఒక్కర్తికి భయమేమో నాక్కూడా కాస్త కంపెనీ ఇచ్చినట్టు ఉంటుందని దాన్ని వెనకేసుకుని అంటే సంకనెత్తుకుని ఊరంతా బలాదూర్ తిరిగేవాడిని. అప్పుడు మార్కెటింగ్ ఉద్యోగం వెలగపెట్టాను లెండి.
అలా తిరిగినప్పుడు ఇదిగో ఈ అంతరాత్మ ఉందే నా మానాన్న నన్ను ఉండనిచ్చేది కాదు. రోజంతా ఒకటే నస. చెవిలో జోరీగలా
"ఏమిటీ ఆ అమ్మాయివైపు అంత సేపు చూస్తున్నావు" - పెళ్లికాని ప్రసాదు అమ్మాయిల వేపు చూడక ఆంటీ లని చూస్తాడా దాని పిచ్చి కానీ.
"ఈ మజ్జెన సిగరెట్లు ఎక్కువ కాలుస్తున్నావు" - చస్తున్నాను దీంతో. ఓ పక్కన సేల్స్ ఎందుకు అవ్వటం లేదని రోజూ బాస్ తలంటు పోస్తున్నాడు. ఎలా ఎక్కువ అమ్మాలో తెలీక, బాస్ చెప్పక, వాడికి సమాధానం చెప్పలేక, ఇంకో బోడి ఉజ్జోగం దొరక్క టెన్షన్ తో ఓ నాలుగు సిగరెట్లు ఎక్కువ కాలిస్తే అర్ధం చేసుకోవడం పోయి ఈ ఇంటరాగేషన్ ఏమిటి?
"అసయ్యంగా ఆ బీడీలు కాల్చడం ఏమిటి" - దానికేం తెలుసు గొర్రెతోక బెత్తెడని చిరుద్యోగి జీతం ఇరవయ్యో తారీఖు కల్లా శివార్పణమ్ అని అప్పటిదాకా దర్జాగా గోల్డ్ ఫ్లేక్ సిగరెట్టేలు కాల్చినా చివరి వారంలో బీడీలతోనే సరిపెట్టుకోవాలని!
"నీకొచ్చే తొక్కలో జీతానికి నువ్వు ప్రతి ఆదివారం రెండు సినిమాలు చూడాలా?" - మా జీతానికి మా బ్రతుక్కి మందా మాకా? కనీసం సినిమాలు చూసే కనీస అదృష్టం కూడా లేదన్న మాట ఈ ఎదవ జీవితానికి
ఇలా దానికి అక్కరలేని విషయం లేదు. ప్రతి దాంట్లో వేలెట్టడమే... కాదు కాదు పుల్లలు పెట్టడమే.
అనకూడదు కానీ మనలో మన మాట పెళ్లయ్యాక నా బ్రతుకు ఎలా ఉంటుందో 70 mm సినిమాస్కోప్ లో నాకు ట్రైలర్ చూపించేసింది. ఇహ దీంతో ఇలా లాభం లేదని పెళ్లయ్యాక దాన్ని ఇంట్లోనే వదిలేసి బైటికి పోతున్నాను ఇన్ని సంవత్సరాలుగా
కానీ మీకు తెలీనిది ఏముంది సాయంత్రం ఆఫీస్ నించి ఇంటికి రాగానే మళ్ళీ ఇంటరాగేషన్ మొదలు. "ఏమిటి ఇంతాలీసం అయ్యిందివాళ" - అరే చిన్న కంపెనీల్లో పెద్ద ఉద్యోగం వెలగ పెడుతున్నప్పుడు రోజూ కొత్తగా పెళ్లయిన వాడిలా ఏడింటికల్లా ఇంట్లో వాలాలంటే ఎలా - అవతల బోల్డు పనులు, కధలు, కమామీషులు.
"ఈ మజ్జెన ఆదివారం ఇంటి పట్టునుండకుండా ఆ వెధవాఫీసు పట్టుకు వెళ్లాడకపోతే ఇంట్లో పెళ్ళాం పిల్లలతో గడపచ్చుగా " - నేను ఇంటికంటే ఆఫీస్ పదిలం అని వెళ్తున్నానని ఎప్పటికి అర్ధం చేసుకుంటుందో ఏమిటో
"ఈ మధ్య పార్టీలు ఎక్కువయ్యాయి నీకు. ఛాన్స్ దొరికితే చాలు ఏదో వంకతో పార్టీ అని జంప్ అయ్యిపోతావు" - అమ్మా తల్లీ నీకేం తెలుసు మగాళ్ల సోషల్ రెస్పాన్సిబిలిటీస్. ఆఫీసన్నాకా బోల్డు మంది సహోద్యోగులుంటారా? నలభై ఏళ్లుగా హైదరాబాద్ లో పడుంటే బోల్డు మంది ఫ్రెండ్స్ కూడా ఉంటారుగా?
మరి ఒకడికి కొత్త ఉద్యోగం వస్తుంది. పార్టీ.
ఇంకోడి కొడుక్కి ఎంసెట్ లో మంచి రాంక్ వచ్చింది. పార్టీ.
ఇంకోడు ఇల్లు బుక్ చేసాడు. పార్టీ. దాని గృహప్రవేశం అయ్యాక పార్టీ.
ఇంకోడి కూతురికి పెళ్లి కుదిరింది. పార్టీ. ఎంగేజ్మెంట్ పార్టీ. పెళ్లయ్యాక రిసెప్షన్ పార్టీ. నాలుగు రోజులయ్యాక ఆప్త మిత్రులందరికీ సినిమా వాళ్ళు సక్సెస్ మీట్ చేసుకున్నట్టు పార్టీ.
ఇంకోడు కొత్త కారు కొంటాడు. పార్టీ.
ఇంకోడి కొడుక్కి అమెరికా వీసా వచ్చింది. పార్టీ.
ఆఫీసులో ఒకడికి ప్రమోషన్. పార్టీ.
ఇలా పార్టీ పార్టీ పార్టీ. ఏది అటెండ్ అవ్వకపోతే వాడికే కోపం. అటెండ్ అయితే అంతరాత్మకి, దాంతో పాటు ఆవిడ గారికి కోపం. మీరెన్ని చెప్పండి. మన దేశంలో మగాడి పరిస్థితి బహు అధ్వానం.
ఈ ఈతి బాధలు పోలీసోడి దెబ్బల్లాంటివి. చెప్పుకోలేం. చూపించుకోలేం. పడ్డ వాడికే తెలుస్తుంది నొప్పి
ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ సమాప్తం
ఈ అంతరాత్మలు సామాన్య మానవుడినే కాదు సినిమాల్లో హీరోలని కూడా విసిగించేవి పాత సినిమాల్లో! పాపం హీరో ఏదో విషమ పరిస్థితుల్లో ప్రియురాలికి టాటా చెప్పేసి ఇంకో సుందరిని పెళ్లి చేసుకుందామనుకున్నాడనుకోండి. ఆ వదిలేసిన ప్రియురాలు "ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నే కోరుతున్నా" అని క్షమిస్తుందేమో కానీ ఈ అంతరాత్మ ఛస్తే క్షమించదు. వదలదు. పీక్కు తింటుంది వాడ్ని. ఇలా పీక్కు తినడాన్ని ఆ నాడు దర్శకులు చాలా బాగా చూపించేవాళ్ళు.
హీరో పెద్ద నిలువుటద్దం ముందు నిలపడి ఉంటాడు. అద్దంలో అంతరాత్మ. ఇద్దరికీ వేర్వేరు బట్టలేసేవాళ్ళు లేపోతే మనం కన్ఫ్యూషన్ అవుతామని. ఇహ చూస్కోండి వాళ్లిద్దరూ ఓ తెగ డిషుమ్! డిషుమ్! ! సివరాకరికి హీరోకి ఒళ్ళు మండిపోయి పక్కనే ఉన్న ఓ పెద్ద ఫ్లవర్ వాజ్ ని ఆ అద్దం మీదకి మాంఛి కోపంతో విసిరేస్తాడు. దాంతో అద్దం ముక్కలు ముక్కలు అయ్యి గదినిండా పడిపోతుంది.
అక్కడితో అవ్వలేదండోయ్. ఆ ప్రతి అద్దం ముక్కలో ఈ అంతరాత్మ మొహం భీకరంగా పెట్టి వికటాట్టహాసం చేస్తూంటుంది. హీరో కి ఇంకేం చెయ్యాలో తెలీక అంటే ఆ ముక్కలని తన చెయ్యి కోసుకు పోకుండా ఇంకా చిన్న చిన్న ముక్కలు ఎలా చేయాలో తెలీక, ఒహ వేళ తెలిసినా అలా చేస్తే ఇప్పుడు ఓ డజను ముక్కల్లో ఉన్న అంతరాత్మ ఇంకో రెండు డజను ముక్కల్లో కనిపిస్తుందన్న విషయం అర్ధమయ్యి ఆ గదిలోంచి విసురుగా బైటికి వెళ్ళిపోతాడు.
అదీ మా ఆవిడా చెవులు కొరుక్కుంటూంటారు నా గురించి. నాకేం భయమా?
చూద్దాం ఎన్నాళ్ళు సాగుతుందో.

ఇప్పుడు ఇప్పడికి వస్తే ఎందుకు నాకు నా అంతరాత్మకీ గొడవలయ్యాయంటే ఇన్నాళ్లు ఉద్యోగం, సద్యోగం పుణ్యమా అని అధమ పక్షం వారంలో ఆరు రోజులు బైటికి పోయేవాడిని. ఈ కొరోనా పాపమా అని నేను మూడు నెలలుగా ఇంటిపట్టునే పడుండడంతో వచ్చింది చిక్కంతా!
గత మూడు దశాబ్దాల పై చిలుకు నేను బైట, అంతరాత్మ లోపల (ఇక్కడో పన్ ఏడిసింది) ఉండేవాళ్ళం. ఇప్పుడో పొద్దున్న లేచిందగ్గరినించీ ఇద్దరం మొహామొహాలు చూసుకోవడం. అలవాటు లేని పనాయె. దాంతో ఇద్దరికీ చెప్పలేని చిరాకొచ్చి రోజూ చీటికీ మాటికీ కీచులాటలు. మాట మాట అనుకోవడం మొహం ముడుచుకోవడం .
మీరు కూడా అలా ఓ నదరుగా ఉన్న ఓ అద్దం పగలకొట్టేయచ్చుగా అంటారేమో. ఎంత కోపం వచ్చినా కాస్త వెనకా ముందు చూసుకుని రెచ్చిపోయే టైపు నేను., అలా అద్దం పగలకొడితే మళ్ళీ నాకే పడుతుంది దాని బడ్జెట్.
ఎవరి మీదన్నా కోపమొస్తే చేతిలో ఉంది కదా అని నలభై వేలు పోసి కొన్న వన్ ప్లస్ 7 విస్సిరి కొడతామా ఏమిటి? మహా అయితే దగ్గర్లో ఏదన్నా న్యూస్పేపర్ లేదా మ్యాగజైన్ ఉంటె దాన్ని విసురుతాం. ఎంతైనా బతక నేర్చిన బడ్జెట్ పద్మనాభాలం కదా
అయినా మనసు కవి ఆత్రేయ గారు ఎప్పుడో చెప్పారు "మనసున్న మనసుకి సుఖము లేదంతే" అని. ఈ మనసు అంతరాత్మ వేర్వేరని నా అంతరాత్మ ఛీ ఛీ ఛీ నేను చెప్తున్నా.
సరే మళ్ళీ అసలు కధలోకొస్తే దాని బాధ ఇలా రోజూ పడడం నావల్ల కాక మొన్నా మధ్య కటీఫ్ చెప్పేశా. అప్పటినించీ ప్రాణం హాయిగా. జీవితం ప్రశాంతంగా. గత మూడు దశాబ్దాల పై చిలుకు నేను బైట, అంతరాత్మ లోపల (ఇక్కడో పన్ ఏడిసింది) ఉండేవాళ్ళం. ఇప్పుడో పొద్దున్న లేచిందగ్గరినించీ ఇద్దరం మొహామొహాలు చూసుకోవడం. అలవాటు లేని పనాయె. దాంతో ఇద్దరికీ చెప్పలేని చిరాకొచ్చి రోజూ చీటికీ మాటికీ కీచులాటలు. మాట మాట అనుకోవడం మొహం ముడుచుకోవడం .
మీరు కూడా అలా ఓ నదరుగా ఉన్న ఓ అద్దం పగలకొట్టేయచ్చుగా అంటారేమో. ఎంత కోపం వచ్చినా కాస్త వెనకా ముందు చూసుకుని రెచ్చిపోయే టైపు నేను., అలా అద్దం పగలకొడితే మళ్ళీ నాకే పడుతుంది దాని బడ్జెట్.
ఎవరి మీదన్నా కోపమొస్తే చేతిలో ఉంది కదా అని నలభై వేలు పోసి కొన్న వన్ ప్లస్ 7 విస్సిరి కొడతామా ఏమిటి? మహా అయితే దగ్గర్లో ఏదన్నా న్యూస్పేపర్ లేదా మ్యాగజైన్ ఉంటె దాన్ని విసురుతాం. ఎంతైనా బతక నేర్చిన బడ్జెట్ పద్మనాభాలం కదా
అయినా మనసు కవి ఆత్రేయ గారు ఎప్పుడో చెప్పారు "మనసున్న మనసుకి సుఖము లేదంతే" అని. ఈ మనసు అంతరాత్మ వేర్వేరని నా అంతరాత్మ ఛీ ఛీ ఛీ నేను చెప్తున్నా.
అదీ మా ఆవిడా చెవులు కొరుక్కుంటూంటారు నా గురించి. నాకేం భయమా?
చూద్దాం ఎన్నాళ్ళు సాగుతుందో.
No comments:
Post a Comment