ఇప్పటి కుర్రాళ్లందరూ నేటి, ఈనాటి సూపర్ హిట్ పాట "చూపే బంగారమాయెనా శ్రీవల్లీ" అని తెగ రెచ్చిపోయి శ్రీవల్లీ బదులు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పేరు ప్రతిక్షేపించుకొని తెగ పాడేస్తున్నారని "ఊరంతా అనుకుంటున్నారు!" ఈ చివరి రెండు మాటలు ఒకప్పటి తెలుగు పాటండోయ్!
ఇక్కడిదాకా బానే ఉంది.
కానీ మీ గర్ల్ ఫ్రెండ్ "బానే పాడుతున్నావ్రా" (ఆడా, మగా అందరూ ఒకళ్ళనొకళ్ళు "రా" అని పిలుచుకోవడం ఇప్పటి ఫాషన్ కదా!) ఏదీ పాట మొత్తం పాడంటే హద్దిరబన్నా అని పాట మొత్తం పాడారో అయిపోయారే!
అదేంటి సార్ అలాగనేస్తున్నారు? పాట ఫుల్లుగా పాడేస్తే ఏటవుతుందేటి? అని అడుగుతారు కదా? మీ చేత అడిగించుకొని చెప్పడం ఎందుకు? అడక్కుండానే చెప్పేస్తా! చెప్పకుండా ఉండలేనుగా? ఓ పక్క కడుపుబ్బిపోతూంటే!
ఎందుకంటే ... ఎందుకంటే .... మిగతాది రేపు చెప్తానని ఊరించచ్చు! కానీ ఎందుకులే పాపం రేపటిదాకా టెన్షన్. అసలే ఇప్పటి యూత్ కి ఎటు చూసినా టెన్షన్ టెన్షన్! నేనింకా దానికి అగ్నికి ఆజ్యం పోయడం దేనికి? రేప్పొద్దున్న పైన దేవుడు నన్ను చొక్కా పట్టుకు అడిగితే?
అందుకని చెప్పేస్తా... ఎందుకంటే
అసలు నేను చెప్పేముందు మిమ్మల్ని ఓ ప్రశ్న వెయ్యాలి. అసలు పాటంతా ఎప్పుడైనా శ్రద్ధగా విన్నారా? వింటే మీకే తెలియాలే? బహుశా విని ఉండరు. ఎందుకంటే చాలా సర్వేల్లో చదివా. కుర్రకారుకి అటెంషన్ స్పాన్, ఓపిక బాగా తక్కువని. అందుకని కేవలం పల్లవే పదేపదే వినుంటారు.
ఒహవేళ పొరపాటుని విన్నా మొదటి చరణం వినుంటారు! కానీ అసలు కధంతా రెండో చరణంలో ఉంది.
బోస్ గారు రెండో చరణంలో ఏం రాసారో తెలుసా
నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు
అందుకనే ఏమో నువ్వుందంగా ఉంటావు
పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు
నువ్వే కాదెవరైనా ముద్దుగా ఉంటారు
హయ్యబాబోయ్! ఇప్పుడు ఈ సీన్ ఊహించుకోండి. మీరు మీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర శ్రీవల్లీ పేరు బదులుగా ఆమె పేరు ప్రతిక్షేపించి పాడుతూంటే మీరు సిద్ శ్రీరామ్ లా ఫీల్ అయిపోతూంటే ఆమె పరవశించిపోయి ఆపేసావేం పాడు. పాట మొత్తం పాడు అంటే మీరు రెచ్చిపోయి ఆ రెండో చరణం పాడితే. తలుచుకుంటేనే నాకు గుండాగినంత పనయ్యింది
ఏ అమ్మాయినైనా నీ చెలికత్తెలు మాములుగా ఉన్నారు కాబట్టి నువ్వుందంగా ఉన్నావు. లేకపోతే నువ్వబ్బే. జస్ట్ ఆర్డినరీ! అని. టీనేజ్ లో ఏ అమ్మాయైనా ముద్దొస్తుంది. నువ్వూ అంతే. నీకు ముప్ఫయి ఏళ్ళొస్తే భరించడం కష్టం. అని ఇలా పాడితే ఏమవుతుంది.
అది కూడా నేనే చెప్తా.
మీరలా తన్మయత్వంలో కళ్ళు మూసుకుని గొంతెత్తి పాడుతూంటే ఒక్కసారి మీ పాదంలో ఓ గునపం గుచ్చుకున్న ఫీలింగ్. మీరు అరిచారనుకుంటారు కానీ శబ్దం బైటికి రాదు. ఎందుకంటే అంత నొప్పి.
ఎందుకో తెలుసా. మీరలా పాడగానే మీ గర్ల్ ఫ్రెండ్ తన ఆరించిల హై హీల్ తో మీ పాదాన్ని లేని శక్తి తెచ్చుకుని కసుక్కున తొక్కుతుంది.
ఇహ అప్పటినించీ ఆ పుష్పరాజ్ లా కాలీడ్చుకుంటూ బ్రతుకీడ్చడమే! ఆ పైన మీ ఇష్టం. తస్మాత్ జాగ్రత్త
PS: బోస్ గారు రాసింది అక్షర సత్యం. కాలేజీ లో ఒక అందమైన అమ్మాయి చెలికత్తెలు ఎప్పుడూ ఓ మోస్తరుగానే ఉంటారు. ఎందుకంటే చిన్న గీతని పెద్ద గీత చేయాలంటే ఎలా అన్న రహస్యం వాళ్ళకి తెలుసు. ఆర్డినరీ లుకింగ్ అమ్మాయిల మధ్యన ఏ మాత్రం అందంగా ఉన్నా మిస్ వరల్డ్ లా కనిపిస్తుంది.
అలాగే వయసులో ఉన్నప్పుడు ఎవరైనా ముద్దొస్తూ ఉంటారు! పెళ్ళిలో ఏ అమ్మాయికైనా పెళ్లికళ వచ్చినట్టు!
అలాగని చెప్పి అమ్మాయితో ఈ చేదు నిజాలు చెప్పేస్తామా ఏంటి
Sir eh mataki ah mata.. miru cheppindi chala chetthaga undi. Asalem chepthunaro.. enduku chepthunaro.. mikaina artham aite baundu anpichindi. Chivaridaka chaduvthunapudu.. ekkadina oka woww anpinche point untademo anukunna. Okkati ledu. Asal miru cheppina logic eh chandalanga aghorinchindi. First ala compare cheste thanthadi antaru.. chivarlo ala campare cheyadanike average ammailtho friendship chestaru antaru. Idantha rathiri 4peggulu vesi rasaru anpichindi. Nijunga ne 2mnts waste chesaru. Ila time waste cheyadam.. criminal pani. Daya chesi inkosari ilanti panili malina sollu rayakandi ani arthistunnanu.
ReplyDeleteఏ సినిమా అయినా, రచన అయినా, పెయింటింగ్ అయినా అందరికీ నచ్చదు. సూపర్ హిట్ సినిమాని తిట్టిపొసే వాళ్ళుంటారు. మీరొక్కరే నేను రాసింది చెత్త అన్నారు. అది మీ అభిప్రాయం. నన్ను ఇలాంటి పనికిమాలిన సొల్లు రాయద్దన్నారు. నేను రాస్తాను. మీరే చదవకండి. మీకు నచ్చని హీరో, హీరోయిన్, డైరెక్టర్ సినిమాలు చూడనట్టే! ట్విట్టర్ లో నన్ను ఫాలో అవుతూంటే (ఫాలో అవుతున్నారో లేదో తెలీదు ఎందుకంటే ఇక్కడ మీ పేరు రాయడానికి కూడా భయపడ్డారు! ) అన్ ఫాలో చేయండి. చాలామందికి హాస్యాన్ని ఆస్వాదించడం, నవ్వడం చేతకాదు. అందులో మీరు ఒకరు అనుకుంటాను.
ReplyDeleteఆ సినిమా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత ఉత్తమం. అయినప్పటికీ “తగ్గేదే లే” అంటూ మీరు రాస్తుండండి, రా “స్తా” నే ఉండండి. చదివి ఆస్వాదించే మాలాంటి వాళ్ళు ఉన్నారు. 👍
ReplyDeleteThank you!నిజం చెప్పాలంటే ఆ సినిమా టీవిలో ఓ గంట చూసి ఇంక చూడలేక ఆపేసాను
Delete