Thursday, September 24, 2020

"బుద్ధి కర్మానుసారిణి" Betal Prasna!

ఇవాళ్టి బేతాళ ప్రశ్న!

"బుద్ధి కర్మానుసారిణి" అంటారు.

ఒప్పేసుకుందాం! అలాంటప్పుడు మనకి ఇప్పుడు వచ్చే ఆలోచనలు మనం లోగడ చేసిన పుణ్య, పాప కర్మలని పట్టి వస్తాయి కదా? ఓకే!

మరి అంతకు ముందు చేసిన ఆ పుణ్య, పాప కర్మలు చెయ్యడానికి వచ్చిన ఆలోచనలు అంతకు ముందు చేసిన పాప కర్మలని పట్టి వస్తాయి!

అంటే ఇది ఒక విషవలయం!

అలా అలా అలా పాత జన్మలకి వెళ్ళిపోతే ఇది ఎక్కడ ఆగుతుంది అంటే మనం మనుషులుగా పుట్టిన మొట్టమొదటి జన్మ దగ్గర! ఇక్కడితో సమస్య ఆగలేదు.

ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే అలా మన మొట్టమొదటి జన్మలో మనకి వచ్చిన ఆలోచనలు దేనిమీద ఆధారపడి వస్తాయి? ఎందుకంటే ఆ జన్మకి "బుద్ధి కర్మానుసారిణి" వర్తించదు ఎందుకంటే అంతకు ముందు మనం ఏ విధమైన పుణ్య, పాప కర్మలు చేయలేదు!

ఇంకో పాయింట్! పై ప్రశ్నకి జవాబు ఏదైనప్పటికీ మనం కొన్ని వేల జన్మల క్రితం ఆటవిక మానవుడిగా మొట్టమొదట పుట్టినప్పుడు తిండి కోసం ఓ చెవులపిల్లిని చంపితే దానికి పరిహారం ఇప్పటిదాకా చెల్లిస్తున్నాం!

మనం జంతువులుగా 84 లక్షల జన్మలు ఎత్తాక మనుషులుగా పుట్టినప్పుడు అలా జంతు జన్మల్లో చేసిన పాపలు ఓపెనింగ్ బాలన్స్ కింద వస్తాయి అంటే అది అన్యాయం. ఎందుకంటే పాముకి కుట్టడమే తెలుసు. కానీ అది ఎవరిని కుడితే వాళ్ళు చచ్చిపోతారని అది పాపమని తెలీదు. కాబట్టి తెలీని తప్పులకి శిక్ష ఇన్ని జన్మలు అనుభవించండి అనడం అతి అన్యాయం!

పోనీ ఈ విషవలయం లోనుంచి బైట పడడానికి బోల్డు బోల్డు పుణ్య కర్మలు, కుంచెం పాప కర్మలు చేసి అందులోనుంచి ఇది తీసేసి పుణ్య కర్మ బాలన్స్ ఎక్కువుండేలా చేద్దామంటే అలా అడ్జస్ట్మెంట్ కుదరదుట! పుణ్యానికి మంచి ఆలోచన, పాపానికి చెడు ఆలోచన దేనికదే వస్తాయిట.

మరిహ మనకెవ్వరికీ మోక్షం ఇళ్లే😂

1 comment:

  1. నిజమే, ఇల్లే ఎప్పటికీ ఇల్లే

    ReplyDelete