EULOGY FOR MY DAD
Caution! This is a very very long post
Our dad Narasinga Rao aka Bina Devi, Judge garu, Guru garu
left us very suddenly this day exactly 30 years ago.
Wanted to share my memories of him.
He was a truly multi-faceted personality. He was a painter,
photographer, writer, great conversationalist, and an amateur musician! Above
all a very simple and humble gentleman.
His favourite phrase was “An officer and a gentleman”. He lived like that.
Among the four children (2 elder sisters and 1 younger
brother) I was fortunate to spend nearly 9 years more with him as we both
shifted to Hyderabad in 1981 and lived together till his death in 1990.
He loved and lived on coffee, cigarettes, and friends. When
I look back, I believe he lived and enjoyed almost every moment of his life.
One thing I now noticed is he rarely complained barring few
times about in-laws who happened to be his sister and BIL! Never heard him
complaining about his office, work, superiors, or anyone or anything for that
matter. Never observed it when he was alive.
He loved animals, all kinds, and believed that they should
be free, unchained and uncaged even when we have them as pets. And he walked
the talk. We had dogs right from when I was about 3 years old till my 25th
year. First, we had an Alsatian and later all Pomeranians. They were never chained. At different times
we also had peacocks, parrots (8 of them together!), rabbits and even a buffalo
with calf (for milk and as a pet too!) They were all unchained barring the
buffalo. I will write a longer post exclusively about the pets we had as it’s a
very long and interesting experience for us.
He never discussed nor even told us once his financial
status, matters or dealings and we wonder how he managed to bring up 4 of us
and given us professional education (two sisters are doctors, I did MBA and
brother ICWA)
He had a passion for fine arts, and I remember him doing oil
paintings back in late 60’s! He got a big easel made so that he can paint
standing. He also dabbled in water colours, nail etching, pencil drawings. He
even tried his hand in sculpture albeit very briefly and we had those two big
stone blocks he bought in our home for many years! He had this habit of giving
away all his paintings to whoever first saw and praised them! So much so after
his death we realized that we were left with just 4 water colours paintings,
perhaps Universe ensured that each of his children got at least one each!
He was a photographer even before I was born! Recently I
discovered an ancient negative of a photo he took in Hampi in the year I was
born! He had 2 Rolleiflex cameras in 50’s but both were stolen during two
burglaries in early 60’s. He later bought a 120 mm Voigtlander camera which he
used extensively and later from late 70’s I took possession of it and shot many
photos with that and I still happen to have it!
He had two electricity extension switchboards made with long
wire and used them to place 3 table lights in his Chambers to create the
required lighting effect and I used to work as his light boy! He used to shoot
anyone visiting our house! We still have some photos with us whom we can’t
recognize/remember!
He had a knack with musical instruments and can fiddle with
any new instrument for a few minutes and can play them (of course hesitatingly
with pauses and all that) but without any apa sruthi! More than Sa Re Ga Ma Pa
he used to go by the sound. We used to have Veena, big Harmonium (which I
recently gifted to one of my friends), violin, flute, Mridangam etc., in those
days.
As for his writing abilities he and my mom started writing
short stories and novels in Telugu from 1965 under the pen name Bina Devi. BiNa
was short B Narasinga Rao and Devi means wife. Perhaps they got the “writing”
genes from both sides! Arudra was a distant relative from my father’s side and
Sri Sri was a distant relative from my mother’s side though we never met them! An
overwhelming majority of the readers used to believe that my dad only was
writing and not my mom. That popular opinion was proved wrong with my mom
writing to this day! They wrote very many short stories
He started his career as an advocate and later got into
judicial service along with his brother
in law and joined as Munsiff and got promoted as Sub Judge and later as
District Judge. Perhaps he was the only District Judge to serve in Guntur
twice! Till 5 days before his death he was in government
service in one position or other i.e., till his 66th year! He worked as Guest Faculty in Law at Lal Bahadur Sastry National Academy of Administration at Mussourie and later as full time faculty in AP Institute of Administration . During one of his visits there he visited Sahranpur in UP and learned Sahaj Marg meditation and meditated for 1 hour twice a day till his death. Being a teacher he passed away on Teacher’s Day.
service in one position or other i.e., till his 66th year! He worked as Guest Faculty in Law at Lal Bahadur Sastry National Academy of Administration at Mussourie and later as full time faculty in AP Institute of Administration . During one of his visits there he visited Sahranpur in UP and learned Sahaj Marg meditation and meditated for 1 hour twice a day till his death. Being a teacher he passed away on Teacher’s Day.
He had friends mainly outside of his profession and
interestingly many of them were doctors. And he had many friends who are much
younger than him and he used to engage them in long conversations over endless
cups of coffee.
He was like an Encyclopaedia! Knowing little bit about
everything! That helped him to converse with anyone on any subject.
He had thousands of books in English and Telugu and read all
of them. I remember he bought many expensive books on paintings too. They used
to be very big ones bigger than A4 size. I still remember one incident! Once I
was curiously browsing one such big painting book keeping it on the table
because it was so heavy and stretching it to 180 degrees! My dad saw that and
slapped me instantly! I didn’t know that seeing painting book was such a sin
but he explained that’s not the issue but stretching the book to 180 degrees is
an unpardonable sin! He told me that such expensive books should not be opened
beyond 30/40 degrees if we want to keep them in good condition. He should’ve
told me that without slapping!
He had a childlike fascination for many things and used to
get excited by any new thing. Though satellite TV hasn’t come to India till
after his death he was aware of the National Geographic, Discovery, BBC
channels and as he was interested in animals and all that he used to browse NG
magazines and just a month before his death bought a National VCR for a
princely amount of Rs.10,000 in 1990! He used to request me to bring him video
cassettes of NG etc., and I used to bring 2/3 cassettes. One regret I still
have is I didn’t bring cassettes daily as we don’t expect a person to leave us
just like that suddenly! I used to bring them once every three or four days. He
used to watch them eagerly. Unfortunately, he enjoyed that simple pleasure for
just one month. Life is like that. If you have any old relatives living with
you and if they ask you for something to get/do then please do it without
postponement.
One very amusing skill he had was he was able to move his
ears back and forth just like that!
I think I got few skills / qualities from him – writing,
photography, many friends of whom many are much younger and long conversations
with them if not over coffee with something else! I even started looking like
him of late!
I’ve another regret which unfortunately will remain so. I
should’ve spent more time with him in the evenings and perhaps should’ve got
him talking about his life, his childhood etc
నాన్నకి ప్రేమతో
ఇది కొంచం పెద్ద పోస్ట్! సమయం. ఓపిక లేనివాళ్లు చదివే ప్రయత్నం చేయద్దు!
ఇది కొంచం భావోద్వేగంతో రాస్తున్నది కాబట్టి ఒకింత ఆర్డర్ లేకుండా పట్టాలు తప్పిన ఫీలింగ్ రావచ్చు చదువరులకు.
మా నాన్నగారు భాగవతుల నరసింగరావు గారు సరిగ్గా ఇదే రోజు 30 సంవత్సరాల క్రితం మమ్మల్నందరిని విడిచి వెళ్లిపోయారు.
30వ సంవత్సరం కాబట్టి ఆయన్ని ఓ సారి గుర్తు చేసుకునే, మీ అందరికీ పరిచయం చేసే ప్రయత్నం.
మా నాన్నగారిని బంధువులు బుచ్చి అని, ఇతరులు గురూ గారు, జడ్జి గారు అని పిలిచేవారు.
అయన నిజంగా బహుముఖ ప్రజ్ఞాశాలి. రచయిత. చిత్రకారుడు. ఫోటోగ్రాఫర్, గొప్ప సంభాషణకారి, ఒకింత వాయిద్యకారులు!
నాకు ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు. కానీ వాళ్లందరికంటే ఓ 9 సంవత్సరాలు ఎక్కువ నేను మా నాన్నతో గడిపాను మేమిద్దరం హైదరాబాద్ కి 81 లో ఉద్యోగరీత్యా వచ్చిన దగ్గర నించి ఆయన 90 లో మరణించేదాకా. అందుకని నాకు అయన గురించి కొంచం ఎక్కువ తెలుసు
ఆయన జీవితంలో బాగా ప్రేమించినవి ఆనందించినవి కాఫీ, సిగరెట్లు స్నేహితులు! ఇవుంటే ఇంకేమీ అవసరం లేదు ఆయనకి. వెనక్కి తిరిగి చూస్తే అయన బ్రతికున్నన్నాళ్లు ప్రతి నిమిషం జీవించారు. అనుభవించారు. ఆనందించారు.
అయన బ్రతికున్నపుడు నేను గమనించలేదు కానీ ఇప్పుడు తెలుసుకున్నాను. నాకు తెలిసి అయన ఎప్పుడూ ఎవ్వరి మీదా, దేని మీదా, ఉద్యోగం గురించి కానీ, సహోద్యోగులు గురించి కానీ, స్నేహితుల గురించి కానీ, బంధువుల గురించి కానీ కంప్లైంట్ చేయలేదు. అప్పుడప్పుడూ అత్తగారు మామగారి మీద తప్ప! వాళ్ళు అయన అక్కా బావలే!!
ఆయనకి జంతువులంటే విపరీతమైన ప్రేమ. పెంపుడు జంతువులని కూడా గొలుసులు లేకుండా ఫ్రీగా ఉంచాలని ఆయన అభిప్రాయం. అలాగే ఉంచారు కూడా. నాకు పాతికేళ్ళు వచ్చేదాకా మా ఇంట్లో కుక్కలున్నాయి. మొట్టమొదట ఆల్సేషియన్, తర్వాత అన్నీ బొచ్ఛుకుక్కలు! కుక్కలే కాకుండా అయన నెమళ్లని, కుందేళ్ళని, చిలకలని కూడా పెంచారు. వాటిని బంధించి ఉంచలేదు. 8 చిలకలుండేవి మా ఇంట్లో ఫ్రీగా! ఆ జంతువుల పెంపకం గురించి వేరే ఇంకెప్పుడైనా రాస్తాను. చాలా ఇంటరెస్టింగ్ అది
ఆయన పిల్లల దగ్గర ఎప్పుడూ ఆర్ధిక విషయాలు మాట్లాడలేదు. ఆయన సంపాదన కానీ, ఖర్చులు కానీ, అయన పడుతున్న ఇబ్బందులు కానీ. అయన జీతంలో మమ్మల్ని నలుగురిని ప్రొఫెషనల్ కోర్సులు చదివించారు - అక్కలిద్దరూ డాక్టర్లు. నేను ఎంబీఏ. తమ్ముడు ICWA.
ఆయనకి లలితకళలంటే చాలా ఇష్టం. కొన్నిట్లో ప్రవేశం కూడా ఉంది. 60's లోనే ఆయన పెద్ద easel చేయించుకుని నిలపడి ఆయిల్ పెయింటింగ్స్ వేసారు. వాటర్ కలర్స్ కూడా. పెన్సిల్ డ్రాయింగ్స్, గోరుతో పేపర్ మీద బొమ్మలు గీయడం చేసేవారు. ఒకసారి శిల్పాలు చెక్కడానికి రెండు పెద్ద రాళ్లు ఇంకో ఊళ్ళో కొని తెప్పించారు. ఎన్నో సంవత్సరాలు అవి మా ఇంట్లో ఉన్నాయి!
ఆయనకి ఒక అలవాటు ఉండేది. ఏదన్నా పెయింటింగ్ వేసాక మొదటిసారిగా ఏ ఫ్రెండ్ చూసి బాగుందంటే వాళ్లకి అది ఇచ్చేసేవారు! అయన పోయాక మేము వెదికి చూసుకుంటే నలుగురు పిల్లలకి కేవలం నాలుగు వాటర్ కలర్ పెయింటింగ్స్ మిగిలాయి!
నేను పుట్టకముందు నుంచీ అయన ఫోటోలు తీసేవారు. 50's లో అయన దగ్గర రెండు Roleiflex కెమెరాలు ఉండేవి. నాకు నాలుగేళ్లు ఉన్నప్పుడు రెండుసార్లు మా ఇంట్లో దొంగలుపడి ఆ కెమెరాలు పట్టుకుపోతే Voigtlander అనే ఓ 120 mm కెమెరా కొని 1975 దాకా దాంతోనే ఫోటోలు తీశారు. అప్పటినించీ నేను దాంతో ఫోటోలు తీసేవాడిని. నా దగ్గర ఆ కెమెరా ఇప్పటికీ ఉంది.
ఆయనకి ఫోటోలు తియ్యడం ఎంత పిచ్చి అంటే ఆ రోజుల్లోనే ఎలక్ట్రిసిటీ ఎక్స్టెన్షన్ బోర్డులు రెండు తలా పది మీటర్ల వైర్ తో చేయించి తన చాంబర్స్ లో ఇంటికొచ్చిన ప్రతి ఫ్రెండ్ ని కూర్చోపెట్టి మూడు టేబుల్ లైట్స్ ఏర్పాటు చేసి (సినిమా షూటింగ్ స్టైల్ లో!) ఫోటోలు తీసేవాళ్ళు. నేను అయనకి లైట్ బాయ్ గా పని చేసాను! ఇప్పటికీ మా దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. అయన ఆలా ఇంటికొచ్చిన వాళ్లకి తీసినవి. వాళ్లెవరో మాకు తెలీదు!
ఆయన దగ్గర ఇంకో కళ ఉండేది. ఏదైనా కొత్త వాయిద్యం ఆయనకి ఇస్తే ఓ పావుగంట దాన్ని ప్రయత్నించి అప శ్రుతులు లేకుండా వాయించేవారు. వేగంగా కాదు నెమ్మదిగానే అనుకోండి. సరిగమలు తో సంబంధం లేకుండా కేవలం ఆ మీటలు/ తీగలు శబ్దాన్ని పట్టి వాయించేవారు. ఆ రోజుల్లో మా ఇంట్లో వీణ, పెద్ద హార్మోనియం, వయోలిన్, మృదంగం, ఫ్లూట్ వగైరా ఉండేవి!
అన్నింటికంటే పెద్ద కళ ఆయనకి బాగా పేరు తెచ్చినది రచయితగా! 1965 లో ఆయన మా అమ్మ కలిసి కధలు రాయడం మొదలుపెట్టారు. ఇద్దరి పేర్లు కలిపి "బీనాదేవి" అని కలం పేరుతో రాయడం మొదలు పెట్టారు. బీనా అంటే బీ నరసింగరావుకి షార్ట్ ఫారం. దేవి అంటే భార్య! మా నాన్న వేపు "ఆరుద్ర" (భాగవతుల నరసింహ శాస్త్రి) దూరపు బంధువు. మా అమ్మ ఇంటి పేరు శ్రీరంగం. శ్రీశ్రీ అమ్మ తరపు దూరపు బంధువు. బహుశా వాళ్ళిద్దరికీ ఆ రాసే జీన్స్ ఆ ఇద్దరినించి వచ్చుంటాయి! వాళ నించి నాకేమో? ఆరుద్ర, శ్రీశ్రీ లని మేము ఎప్పుడూ చూడలేదు.
బీనాదేవి పేరు మీద కేవలం మా నాన్నే రాసేవాళ్ళని దాదాపుగా అందరు పాఠకులు అనుకునేవాళ్లు ఆ రోజుల్లో. మా అమ్మా నాన్నా కాదు మొర్రో అని ఎంత చెప్పినా నమ్మేవాళ్ళు కాదు! కానీ మా నాన్న 90 లో పోయినా మా అమ్మ ఇప్పటికీ రాస్తున్నారు రుజువుగా. వాళ్లిద్దరూ కలిసి వందల కధలు, కొన్ని నవలలు రాసారు.
అయన మొదట అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసి తర్వాత బావగారితో పాటు మున్సిఫ్ గా జాయిన్ అయ్యి తర్వాత సబ్ జడ్జిగా, జిల్లా జడ్జిగా ప్రమోషన్ సంపాదించారు. బహుశా గుంటూరుకి రెండు సార్లు జిల్లా జడ్జి గా పని చేసిన ఘనత మా నాన్నదేనేమో! అయన మరణించడానికి 5 రోజుల ముందు దాకా అయన ఏదో ఒక పదవిలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు 66 సంవత్సరాల దాకా! కొన్నాళ్ళు ముస్సోరి లో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ అఫ్ అడ్మినిస్ట్రేషన్ లో లా గెస్ట్ ఫ్యాకల్టీ గా పని చేసారు. ఓ సారి అక్కడినించి ఉత్తర్ ప్రదేశ్ లో సహరాన్పూర్ వెళ్లి అక్కడ సహజ మార్గ్ అనే మెడిటేషన్ నేర్చుకుని రోజూ పొద్దున్నా సాయంత్రం తలో గంటసేపు చనిపోయే రోజు దాకా మెడిటేషన్ చేశారు.
ఆయనకి ఉన్న ఉన్న స్నేహితుల్లో చాలామంది డాక్టర్లు. చాలామంది ఆయనకంటే చాలా చిన్నవాళ్లు. అయినా వాళ్లతో కలిసిపోయి కబుర్లు చెప్పేవారు. కాఫీ తర్వాత కాఫీ తాగుతూ!
నిజానికి అయన ఒక ఎన్సైక్లోపీడియా. అంటే ప్రతి విషయం గురించి ఎంతో కొంత తెలుసు. ఎక్కువ కాదు. అందుకని ఎవరితో ఏ సబ్జెక్టు మీద అయినా మాట్లాడేవారు.
+
ఆయనకి పుస్తకాల పిచ్చి! మా ఇంట్లో ఆ రోజుల్లో కొన్ని వేల పుస్తకాలుండేవి. తెలుగు. ఇంగ్లీష్. ఆయన చాలా డబ్బు వెచ్చించి చాలా పెయింటింగ్ పుస్తకాలు కూడా కొన్నారు. అవి A3 సైజు లో చాలా పెద్ద గా ఉండేవి. నాకు ఇప్పటికీ ఒక సంఘటన గుర్తుంది. నాకు పది పన్నెండేళ్ళు ఉన్నప్పుడు ఒకసారి ఓ పెద్ద పెయింటింగ్ పుస్తకం టేబుల్ మీద మొత్తం 180 డిగ్రీల్లో తెరిచి పెట్టి బొమ్మలు చూస్తున్నా! మా నాన్న ఉన్నటుంది వచ్చి నన్ను ఒక లెంపకాయ కొట్టారు. నాకర్ధం కాలేదు. బొమ్మలు చూస్తే కొట్టేస్తారు ఎందుకని. అప్పుడు చెప్పారు. అలాంటి పెద్ద పుస్తకాలు 180 డిగ్రీలు తెరిచి చదివితే కుట్లు ఊడిపోతాయి. కేవలం 30 40 డిగ్రీలు మాత్రమే తెరవాలి అని. కొట్టకుండా చెప్పుండాల్సింది!
ఆయన ఏ కొత్త వస్తువు చూసినా చిన్న పిల్లాడిలా చాలా ఎక్సైట్ అయిపోయేవారు. అయన పోయినాటికి ఇండియాలో ఇంకా శాటిలైట్ టీవీ రాలేదు. కానీ ఆయనకి నేషనల్ జియోగ్రాఫిక్ డిస్కవరీ చానెళ్ల గురించి తెలుసు. జంతుప్రేమ ఉంది కాబట్టి నేషనల్ జియోగ్రాఫిక్ పత్రిక చదివేవారు. ఆయన మరణానికి కేవలం ఒక నెల ముందు ఆ రోజుల్లో పది వేలు పోసి నేషనల్ వీసీఆర్ కొన్నారు. నన్ను నేషనల్ జియోగ్రాఫిక్ డిస్కవరీ వీడియో కాసెట్లు తెమ్మనేవారు అద్దెకి. నేను రెండు మూడు రోజులకోసారి ఓ మూడు నాలుగు కాసెట్లు తెచ్చేవాడిని. నాకు ఇప్పటికీ మిగిలిపోయిన ఒక చింత ఏమిటంటే ఆయనకి ఆ నెల్లాళ్ళు ప్రతిరోజూ కాసెట్లు ఎందుకు తేలేదు అని! కానీ ఆలా చెట్టంత మనిషి ఉన్నట్టుండి అలా హఠాత్తుగా వెళ్ళిపోతారు అనుకోముగా? మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఏదైనా తెమ్మని కానీ చెయ్యమని కానీ అడిగితె అది వాయిదా వెయ్యకుండా వెంటనే చేసేయండి దయచేసి.
ఆయనకున్న ఇంకో అతి ఇంటరెస్టింగ్ నైపుణ్యం ఏమిటంటే అయన రెండు చెవులనీ ముందుకీ వెనక్కీ కదపగలిగేవారు!
నాకు అయన దగ్గర్నించి రాయడం, ఫోటోగ్రఫీ, ఎక్కువమంది స్నేహితులు, వాళ్ళతో కబుర్లు చెప్పడం వచ్చాయి. ఈ మధ్య అచ్చు ఆయనలాగే కనిపిస్తున్నా కూడా!
నాకు తీరని ఇంకో కోరిక ఏమిటంటే ఆయన ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ సాయంత్రాలు ఆయనతో మాట్లాడుతూ కబుర్లు చెప్తూ అయన జీవితం, చిన్నప్పటి విశేషాలు తెలుసుకుంటూ గడిపుండాల్సింది అని.
One of the Best Eulogies, I read.. My tributes to him,Sir !!
ReplyDeleteThanks a lot Krishna.
DeleteGreat Write up Sir. i loved the sentence "Being a teacher he passed away on Teacher’s Day." the most.
ReplyDeleteThank you. That was a strange coincidence.
DeleteOm shanthi. I have read both english and telugu versions. Some realisation started as well. I will talk more with dad and mom.
ReplyDeleteThank you! Your decision is great. You will not regret it.
DeleteVery nice sir.... Inspiring personality
ReplyDeleteThank you
Deleteనాన్నగారితో జ్ఞాపకాలు ఎన్ని పంచుకున్న ఇంకా megele ఉంటాయి. చాల బాగా రాసారు సర్ దన్యవాదాలు🙏
ReplyDeleteThank you
DeleteAB గారు,
ReplyDeleteమీరు “బీనాదేవి” గారి కుమారుడిని తెలిసి చాలా సంతోషించాను. 1990ల decade లో ఒకసారి నా శ్రీమతి, నేను మీ ఇంటికి వచ్చాం, మీ అమ్మగారిని కలుసుకున్నాం, ఆవిడ మమ్మల్ని కూర్చోబెట్టి చాలా సేపే మాట్లాడారు. అమీరి్ పేట చర్మాస్ దగ్గరలో ఒక అపార్ట్మెంట్ లో ఉండేవారు కదా అప్పట్లో?
“బీనాదేవి” కథలకు నేను పెద్ద అభిమానిని. మీ అమ్మగారిని కలుసుకోగలగడం చాలా ఆనందం అనిపించింది.
ఇక్కడ మీరు మీ తండ్రిగారికి అద్భుతమైన నివాళి సమర్పించారు. చాలా బాగా వ్రాశారు. వారి స్మృతికి మా శ్రద్ధాంజలి కూడా 🙏.
ధన్యవాదాలు . మీకు అమీర్పేట్ లో వచ్చింది మా అక్కగారింటికి. ఇప్పుడు మా అమ్మా నాతోనే ఉంటోంది.
Deleteనేను చిన్నప్పుడు HANG ME QUICK చదివాను.వారి కొన్ని జీవిత విశేషాలు తెలుసుకోవడం సంతోషం. మీకు నా శుభాకాంక్షలు💐
ReplyDeleteThank you
DeleteThis comment has been removed by a blog administrator.
ReplyDelete���� Well written about a 'colorful' personality ����
ReplyDeleteGreat post sir.
ReplyDelete