Saturday, December 20, 2014

Sanyas in Himalayas abandoned !!

వయసు మీద ఉన్నప్పుడు తక్కువ నిద్ర పోయేవాడిని. వయసు మీద పడ్డాక తక్కువ నిద్ర పడుతోంది. అందుకని ఇవాళ పొద్దున్నే 4 గంటలకి లెచిపొయాను. ఎవరితోనూ కాదు ;) నిద్ర! ఇంత పొద్దున్నే లేచి చెయ్యాల్సిన రాచకార్యాలు ఏమిలేవు కాబట్టి 5 గంటలకి మంచం దిగి  "చ్చల్లటి" నీళ్ళతో పళ్ళు తోముకున్నాను. అంతే తర్వాత అరగంటదాక కుడిచెయ్యి స్పర్శ కోల్పోయింది.

కాఫీ కలుపుకోవడం బాయేహాత్ కా ఖేల్ కాబట్టి ఎడం చేత్తోనే కాఫీ కలుపుకోని తాగేసి ఇంకేం చేద్దామని ఆలోచించాక కుడి చెయ్యి కాస్త కదలడం మొదలెట్టింది! 

ఇలా స్పర్శ జ్ఞానం వచ్చాక జ్ఞాననేత్రం కూడా తెరుచుకుంది. ఆ మధ్య చాగంటి వారి ప్రవచనాలు చాల విన్నాక తొందరలో ఈ తుచ్చమైన సంసారం వదిలేసి సన్యాసం తీసుకోని హిమాలయాలకి వెళ్ళిపోదామని ఒక దృఢనిశ్చయానికి వచ్చాను. కాని అంత ధృఢనిర్ణయం మీద ఇప్పుడు చన్నీళ్ళు పోసినట్టయింది! వెంటనే ఇంకో నిర్ణయం తీసుకున్నాను. సన్యాసం వరకు ఓకే కాని హిమాలయాలు కాన్సిల్!

బొందితో కైలాసం వెళ్ళే (దురా)ఆలోచన లేదు నాకు ;)

No comments:

Post a Comment