"నేనొక్కడినే" సినిమా దర్శకుడి మనో"గతం" అవ"గతం" చేసుకొనే చిన్ని ప్రయత్నమే ఈ స్వ"గతం"!!
"గతం"లో నేను కూడా అందరిలాగే చాలా తెలుగు సినిమాలు చూసాను. అది నిజం. నా "గతం నిజం"! ఒక్క మాటలో, క్షమించాలి, రెండుమాటల్లో చెప్పాలంటే ఇదే ఈ సినిమా సారాంశం - "గతం నిజం"!
"నేనొక్కడినే" సినిమా చూసాను. ఇది నిజం.
కాదు అబద్ధం అంది మా ఆవిడ ఎందుకంటే తను కూడా నాతో చూసింది!
అంటే! "నేనొక్కడినే" చూసాను అన్నది నిజం! నేనొక్కడినే చూసాను అన్నది అబద్ధం!!!
ఇంతకీ నేనొక్కడినే చూసానా లేక చూసినట్టు ఊహించుకున్నానా? అంతా అయోమయం. గందరగోళం. గతంలో దుర్యోధనుడి పరిస్థితి! "ఇది మయ సభా? మాయ సభా? అయోమయ సభా? ఇది ఈ సినిమా చూసిన వాళ్ళకి మాత్రమె అర్థం అవుతుంది అన్న మాట నిజం.
సినిమా మధ్యలో ఇంటర్వల్లో బైటికి వెళ్ళాలంటే భయమేసింది. భయం ఎందుకంటే నిజంగా ఇంటర్వల్ ఇచ్చారా లేక నేను ఊహించుకున్నానా అన్నసందేహం కలిగింది. నిజంగా ఇంటర్వల్ అయితే ఫర్వాలేదు కాకపోతే మట్టుకు నేనొక్కడినే లేచి అందరి కాళ్ళు తొక్కేసి వాళ్ళ మీద పడిపోయి నానా భీభత్సం అయ్యిపొయెది :(
అయినా ఎవరో మహానుభావుడు అన్నట్టు "మనవాళ్ళు ఉత్త వెధవాయలోయ్! ఈ మధ్య మరీ చెత్త చెత్త సినిమాలు తీసి మన మీదకి వదిలేస్తున్నారు" అని సగటు ప్రేక్షకుడు, దర్శక నిర్మాతల వేపు వేలెత్తి చూపిస్తే, ఈ దర్శకుడు ఆ వేలిని "సుకుమారం"గా పట్టుకుని సగటు ప్రేక్షకుడిని ఎవ్వరికి అందనంత ఎత్తుకి తీసుకెళ్ళి అక్కడే వదిలేసి చక్కా ఇంటికెళ్ళి పోయాడేమో అన్న సందేహం కలిగింది.
అప్పుడప్పుడూ "Bourne Identity" గుర్తుకొస్తే అది మీ జ్ఞాపక శక్తికి నిదర్శనమే కాని మరొక్కటి కాదు!
ఒక సినిమా గురించి రివ్యూ రాస్తే అందులో ఒకింత కథ రాయడం పరిపాటే. కాని ఈ సినిమా విషయంలో కథ చెప్పాలనుకోవడం కొంచం దుస్సాహసo!
ఇంక కథ విషయానికొస్తే, అయినా కథ ఎవడికి కావాలి! ఒక పేజి కథని రెండు గంటల సినిమా తీసిన దాఖలాలు ఉన్నాయి. రెండు గంటల కథని నాలుగు సంవత్సరాలు టీవీ సీరియల్స్ గా తియ్యడము కూడా కద్దు. అలాంటిది ఒక్క సారి దాదాపు మూడుగంటలలో బోల్డన్ని మెలికలు, మలుపులు, కొసమెరుపులు ఉన్న చిత్రాన్ని సగటు ప్రేక్షకుడు జీర్ణం చేసుకుంటాడా అన్నది ప్రశ్నార్థకం!
కాని తెలుగు వాడిని తక్కువగా అంచనా వెయ్యకండి. ఎందుకంటే "Inception" చిత్రాన్నేఅవలీలగా అర్థం చేసుకున్నట్టు మొహం పెట్టి, బంధు మిత్రులందరినీ "ఏమిటీ మీరింకా ఆ సినిమా చూడలేదా? అద్భుతం! అమోఘం!!" అని పొగిడి వాళ్ళు చూసి వచ్చాక వాళ్లకి అర్థం కాలేదంటే వాళ్ళ పరువు పోతుందని వాళ్ళు కూడా ఇదే strategy వాడడం నా దృష్టికి వచ్చింది! అలాంటి మేధావులకి ఈ సినిమా ఒక లెఖ్ఖా?!
అన్నట్టు సినిమా మొదలవ్వక ముందు కొంతమంది వాళ్ళ మొబైల్తో "Selfie" తీసుకోవడం చూసి "అయినా ఈమధ్య ఇది బాగా ఫాషన్ అయిపోయింది" అనుకున్నాను. అది నా అమాయకత్వం అని సినిమా అయ్యాక అర్థం అయ్యింది:( ఎందుకంటే 100% వాళ్ళంతా సినిమా మొదటి సారి అర్థం కాక రెండోసారి వచ్చిన వాళ్ళే. కాని తర్వాత నిజంగా రెండోసారి చూశామా, లేక చూసినట్టు ఊహించుకున్నామా అని సందేహం వస్తే ఆ సందేహ నివృత్హికి తీసిన సాక్షాలని కొంచం ఆలస్యంగా అర్థం అయ్యింది!
ఒకరకంగా ఆలోచిస్తే ఇది ఒకరకమైన మార్కెటింగ్ ట్రిక్ ఏమో అని అనుమానం. ఎందుకంటే ఒకసారి చూసిన వాళ్ళల్లో చాలామంది రెండోసారైనా అర్థం అవుతుందేమోనని చూస్తున్నారు. కాని ఆ సంగతి ఒప్పుకోరుగా. పైకి కనిపించే నిజమేమిటంటే చాలామంది రెండోసారి చూడడం. అంతే ఇదేదో చాల అద్భుతమైన సినిమా అని చూడని వాళ్ళంతా చూడడం. చర్వితచరణం:) షరా మామూలే!
తెలుగులో Hollywood స్థాయి సినిమా చూడడం అరుదు! ఈ అవకాశం వదులుకోకండి!
PS: నేను పైన రాసిందంతా సినిమా చూసిన వాళ్ళకి మాత్రమె అర్థం అవుతుంది. కాబట్ట్టి ఇప్పటి దాక ఈ సినిమా చూడని వాళ్ళు సినిమా చూసాక మరొక్కసారి చదివి అప్పుడు మరొక్క "కామెంట్" చెయ్యండి!
PS: 2024లో గౌతం హీరోగా ఒక సినిమా సంక్రాంతి విడుదల అవుతుంది. నిస్సందేహం :)

No comments:
Post a Comment