హైదరాబాద్లో సూర్యుడు గత మూడు రోజులుగా ఎందుకు ఉదయించటం లేదు?!!
ఈ విషయం మీద చాల సోధించి, పరిశోధించి, అలోచించి, విశ్లేషించగా నాకు అర్థం అయ్యిన విషయం! ఇంక ఆలశ్యం ఎందుకు? చదవండి
పురాణాల కాలంలోనే కాదు ఈ రోజుల్లో కూడా ఎవరో ఒక దేవుడు ఎవరో ఒక మహా భక్తుడికి లేదా మహా పతివ్రతకి ప్రత్యక్షం అవుతూనే ఉంటాడు! అలా మా ఉళ్ళో, అనగా హైదరాబాద్లో, బహుశా ఒకానొక పతివ్రతకి దేవుడు రెండు మూడు రోజుల క్రితం ప్రత్యక్షం అయ్యి "ఓ నారీ శిరోమణి! నీ భక్తికి, పతి భక్తికి మెచ్చాను. కాని కొన్ని కొన్ని సందర్భాలల్లో మేము కూడా నిస్సహాయులం! ఒక వ్యక్తి ఆయుష్షు పెంచడం మాకు కూడా కుదరదు. నువ్వు మహా పతివ్రతవ్వి కాబట్టి నీకు నేను చెయ్యగలిగే సహాయం ఒకటే! నీకు ముందస్తు సమాచారం ఇవ్వడం.. అదేమిటంటే రేపు సూర్యుడు ఉదయించడం, మీ ఆయన అస్తమించడం ఒక్కసారే జరుగుతాయి! కాబట్టి ఆయనతో ఏమైనా లావాదేవీలు, రాతకోతలు గట్రా ఉంటె ఇవాళ రాత్రికల్లా ముగించేయ్యి. ఆనక బాధ పడి లాభం లేదు" అని చెప్పి అదృశ్యం అయిపోయాడు!
"ఇంకేముంది. అంతా అయ్యిపోయింది. నాకింక రేపటినించి ఎవరు దిక్కు?" అని ఆ సదరు నారీమణి భోరుభోరున ఏడుస్తూ సమయం వృధా చెయ్యలేదు ఎందుకంటే ఆమె "నేటి మేటి మహిళ"! ఒకింత "Out of Box thinking"కి కూడా అలవాటు పడ్డ వ్యక్తి!
అంతే!! ఒక గంట తీవ్రంగా ఆలోచించింది. తెల్లారితే తన బ్రతుకు తెల్లారుతుంది. అయినా దేవుడు ఏమిటి చెప్పాడు? "రేపు సూర్యుడు ఉదయించడం, మీ ఆయన అస్తమించడం ఒక్కసారే జరుగుతాయి!" అని కదా! కాబట్టి రేపు అసలు సూర్యుడు ఉదయించకుండా చేస్తే సరిపోతుంది కదా! Simple solutions to complex problems:)
ఆ ఆలోచన రావడం ఆలస్యం! "ఓ సూర్యుడా! రేపు ఉదయించకు! ఉదయించకు!" అని ఒక ఆర్డినన్స్ జారీ చేసింది! ఈవిడగారు మహా పతివ్రత కదా. మరింక సూర్యుడు ఎలా ఉదయిస్తాడు?
అదండీ జరిగిన సంగతి! ఇదే పురాణాల కాలంలో అయితే దేవతలకి, ఋషులకి ఈ విషయం దివ్య దృష్తితో తెలిసిపోయి లోక కళ్యాణార్ధం అందరు ఒక Delegation లాగ ఆ సదరు పతివ్రతా శిరోమణి దగ్గరకి వెళ్లి "అమ్మా! మీ ఆజ్ఞ మూలంగా సూర్యుడు ఉదయించక ముల్లోకాలు అల్లాడి, తల్లడిల్లి పోతున్నాయి. కాబట్టి నీ ఆజ్ఞని దయచేసి ఉపసంహరించు" అని వేడుకోనేవాళ్ళు! మరి ఇప్పుడు ఆ సౌకర్యం ఉందొ లేదో రేపు, ఎల్లుండి సూర్యుడు ఉదయిస్తే కాని మనలాంటి సామాన్య ప్రజలకి తెలీదు!
కాబట్టి వేచి చూడండి! మీ అదృష్టం!!