ఇవాళ పొద్దున్నే నా ఉద్యానవనంలో (!) వాకింగ్ (వాకింగ్ కాదు అలా వయ్యారంగా, ఎక్కడ భూమి కందిపోతోవుందేమోనన్నట్టు నడిస్తే దాన్ని వాహ్యాళి అంటారని నేనంటే కిట్టని వాళ్ళు అంటారు. వాళ్ళు కిట్టనివాళ్ళు కాబట్టి నేను వాళ్ళ మాటలు పట్టించుకోను. మీరు కూడా పట్టించుకోకండి) చేస్తూంటే ఇదిగో ఈ బుజ్జిముండ సర్కస్ లో గ్లోబ్ లో మోటార్ సైకిల్ లాగ, గానుగెద్దులాగా, నా ఉద్యానవనంలో నా వాకింగ్ లాగ అటూ ఇటూ గాభరా గాభరాగా తిరిగేస్తోంది. చుట్టూ ఓ పది మీటర్ల వ్యాసంలో ఎంత వెతికినా దాని బంధు, మిత్ర వర్గంలో ఒక్కళ్ళు కూడా కనిపించలేదు.
నాకు వెంటనే నేను పుట్టిందే లోకకల్యాణం కోసమని గుర్తొచ్చి వెంటనే పాపం ఆ అనాధ పురుగుని పెంచుకోడానికి నిర్ణయించాను. అంతవరకు బాగుంది.
నేను చాలా దశాబ్దాల క్రితం ఇంటర్మీడియట్ లో మా నాన్నకి ఎదురు చెప్పలేక బై పి సి గ్రూప్ తీసుకున్నా కానీ ఆ రెండేళ్లు కేవలం బొద్దింకలు, వానపాములు, కప్పలు వగైరా డిసెక్షన్ చేసి పారేసా కానీ ఇలాంటి పురుగువర్గం అప్పుడు ఇప్పుడు కూడా అవుట్ అఫ్ సిలబస్. మరంచేత ఇప్పుడు బోల్డు ప్రశ్నలు. అవేమిటంటే
1. ఈ పురుగు ఆడా, మగా ? ఆ విషయం నీకెందుకు అని అడక్కండి
2. ఈ పురుగు శాకాహారా? మాంసాహారా? మాంసాహారి అయితే నేను నా నిర్ణయాన్ని వాకింగ్ పూర్తయ్యేలోపు రివర్స్ చేసే అవకాశం ఉంది!
3. శాకాహారి అయితే మనలా కాయగూరలు తింటుందా, ఆకులు, అలములునా?
4. ఆకులు, అలములు తినెట్టయితే మా ఇంట్లో అసలే మొక్కలు తక్కువ. దీనికి నాలాగే భయంకరమైన ఆకలి అయితే పురుగుని పెంచి ఇప్పటిదాకా ప్రేమతో పెంచుకుంటున్న మొక్కలని దీనికి బలివ్వడమా?
5. ఇది నేను తీరా బోల్డు రోజులు పెంచుకుని, దానిమీద అభిమానం పెంచుకున్నాక అది డింగుడింగుమంటూ పాక్కుంటూ నన్నొదిలేసి వెళ్లిపోకుండా చిలకని పంజరంలో పెట్టినట్టు దేన్నీ ఎలా బంధించాలి?
6. దీనికి ఓ మాంఛి పేరు కూడా చెప్పండి. ఏ భాషలో నైనా ఫర్వాలేదు. ఏ భాషకీ చెందని సరికొత్త పదమైనా ఫర్వాలేదు. దాని భాష మనకి రాదు కాబట్టి.
7. అలా పెట్టిన పేరు దానికి ఎలా చెప్పాలి? అంటే నేను బైటినించి ఇంటికొచ్చాక దాన్ని దాని పేరుతొ పిలిస్తే ఎక్కడున్నా డింగుడింగుమంటూ అది వచ్చి నాకు స్వాగతం చెప్పాలి.
8. మీలో ఎవరికైనా ఇలా పురుగుల్ని పెంచుకున్న అనుభవం ఉందా? ఉంటె నాకు తెలీని, నేను తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకేవన్నా ఉంటె చెప్పండి.
9. ఇది ఇదే సైజు లో ఉంటుందా లేక తినితిని వానపామంత అవుతుందా?
10. భారత వన్య ప్రాణి చట్టం కింద ఇలాంటి పురుగుల్ని పెంచడం నేరమా?
#తెలుగు #Telugu

No comments:
Post a Comment