మొన్న నేను విడుదల చేసిన టైటిల్ టీజర్ అసలు సినిమా ఇది!
మీ అందరిచేత ఆర్నెళ్ళకోసారి ఎందుకు సూటి పోటి మాటలు పడడం అని, కమిట్ అయ్యాక వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు కాబట్టి "ఆలీసం ఏదైనా విషం" కాబట్టి పిచ్చర్ వెంటనే విడుదల! 79 రోజుల్లో శాతకర్ణి తియ్యగా లేనిది (ఇక్కడ ద్వందార్ధం లేదు!) నేను రెండ్రోజుల్లో రాయలేనా? పట్టుదల!
ఇహ సినిమా ప్రారంభం!
మళ్ళీ మర్చిపోయిన మీ అందరికీ (ఎంత అస్సయ్యం వేసినా సరే.. జీవితంలో కొన్ని కొన్ని భయంకర, భయానక, జుగుప్సాకరమైనవి చూడక, చదవక తప్పదు!) మరొక్కసారి ఈ పిచ్చర్ లో బొద్దింకే ప్రధాన పాత్రధారి అని మనవి. ఏం. ఈగ పాటి చెయ్యదా? ఏనుగులు, కుక్కలు, పాములు, కోతులు వగైరా సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించాయిగా? ఇప్పుడు బొద్దింక వంతు.
ఓపెనింగ్ షాట్: పొద్దున్నే అంటే మరీ తెల్లారకుండా కాదు. దాదాపు ఎనిమిదిన్నరకి. నేను రోజూ తిట్టుకుంటూ చేసే దినచర్య. అదే.. షేవింగ్! దేవుడు మగాళ్ళకి ఇచ్చిన శాపం ఈ షేవింగ్. పోనీ గెడ్డం పెంచుకోవచ్చుగా అంటే తవరికి తెలీదా ఏమిటి? గెడ్డం అందరికీ నప్పదని. అదో అలా గెడ్డం నప్పని వాళ్ళల్లో నేను ప్రధముడిని. మరంచేత పెజానీకం సౌకర్యార్ధం అంటే ఇన్ అదర్ వర్డ్స్ లోక కళ్యాణం కోసం రోజూ షేవింగ్ చేస్తూంటాను. నా గురించి అస్సలు కాదు. ఎందుకంటే రోజులో నేను నా మొహం కేవలం 3/4 సార్లు మాత్రమే అద్దంలో చూసుకుంటాను. కాని అధమపక్షం రోజులో ఓ 14 గంటలు పెజానీకమే నా మొహం చూడాల్సింది. మరంచేత నేను గెడ్డం గీసినా, ఒకింత అందంగా కనిపించే ప్రయత్నం ... అంటే ఫెయిర్ అండ్ లవ్లీ లు వగైరా బాగా పట్టించి , ఎలక తోక తెచ్చి ఏడాది ఉతికినా సామెత గుర్తొచ్చినా ఖాతరు చెయ్యకుండా, పేస్ వాష్ లు గట్రా వాడుతున్నానంటే కేవలం పెజలకోసమేనని, కేవలం లోక కళ్యాణం కోసమేనని, ఇందులో స్వార్ధం అస్సలు లేదని మరొక్కసారి మనవి. అర్ధం చేసుకోరూ!
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో పడి ఓపెనింగ్ షాట్ దగ్గరే ఆగిపోయా. సరే పొద్దున్నే షేవింగ్ చేద్దామని నా "మంగలిపొది"
అంటే నేను నా షేవింగ్ సామగ్రి దాచుకునే ప్లాస్టిక్ డబ్బా అన్నమాట.. మూత తెరవగానే షాక్!!
ఏమయ్యింది?! అక్కడ ఏం కనిపించింది!!
ఇదే హీరో ఇంట్రో షాట్!! ఆ ప్లాస్టిక్ బాక్స్ లో పెద్దగా కనిపిస్తున్న పిల్ల బొద్దింక!కాళ్ళ దగ్గర నించి స్లో గా మొహం మీదకి పానింగ్ క్లోజ్ అప్ షాట్! క్లోజ్ అప్ షాట్ లో పిల్ల బొద్దింక అయినా పెద్దగా కనిపించింది. అసలిక్కడ ట్రాలీ షాట్ పెడదామానుకున్నా కానీ, బొద్దింక ఎంత పెద్దగా చూపించినా డైనోసారస్ అంత పెద్దగా చూపిస్తే బాగోదని ఆ ఐడియా డ్రాప్ చేశా!
పిల్ల బొద్దింక అంటే టీన్ఏజ్ అన్నమాట. పిల్ల కాబట్టి పిల్ల చేష్టలు. చెడు తిరుగుళ్ళు. లేకపోతే అడిగేవాడు లేక కాని నా మంగలిపొదిలో ఏముంటుంది తినడానికి? బాడ్ అప్బ్రింగింగ్.
దానికి ఉన్నది... ఇప్పుడిప్పుడే వస్తున్నవి లింగు లిటుకూ మంటూ రెండు ఓ మోస్తరు మీసాల్లాంటి వెంట్రుకలు! అవి కాస్త అది నా మంగలిపోదిలో "రగులుతోంది మొగలిపొద" టైపు లో భరత, కూచిపూడి, కథక్ లు, ఒకింత మోడరన్ బొద్దింక అయితే పేరు పెట్టలేని, వర్ణించలేని అప్పుడప్పుడూ మనం కూడా వెయ్యలేని సినిమా పాటల స్టెప్పులు వేసిందంటే ఏ రేజర్ బ్లేడో తగిలి ఆ వస్తున్న మీసాలు తెగిపోయి, లేదా ఎలక్ట్రిక్ రేజర్ ఆన్ అయ్యి దాని రెక్కలు ముక్కలు ముక్కలు అయిపోయి, దాని బ్రతుకు దుర్భరం అయిపోయే ప్రమాదం ఉందన్న విషయం దానికి ఎవరు చెప్తారు? ఎవరు చెప్పాలి? ఎవరు? ఎవరు?
ఆ విషయం కాసీపు పక్కన పెడితే నాకు వెంటనే వచ్చిన సందేహం మొన్న మిమ్మల్నందర్నీ అడిగినదే.
"బొద్దింక ఆహారం ఏమిటి?"
ఎందుకంటే ఈ విషయం ఒకింత లోతుగా చర్చించి, విస్తృతంగా శోదించి దాని తిండి వ్యవహారం లో నా షేవింగ్ సెట్ లో పదార్ధాలు ఏమన్నా ఉన్నాయంటే నేను అర్జెంటుగా మూత గట్టిగా పట్టే డబ్బా సంపాదించాలి. మార్గదర్శిలో చేరైనా!
ఈ లోపల బొద్దింక ని అంత క్లోజ్ అప్ లో చూడగానే వెంటనే ఫ్లాష్ బ్యాక్ !! అంటే నా టీన్ ఏజ్ రోజుల్లోకి అలా గిరగిరా తిరుగుతూ వెళ్ళిపోయా!! నా టీనేజ్ లో బొద్దింక ఒక చిన్ని పాత్ర వహించింది. పాత్ర చిన్నదే కాని ఎఫెక్ట్ పెద్దది!
టెన్త్ పాస్ అయ్యి ఇంటర్లో జాయిన్ అవ్వాలి. అప్పటి తల్లితండ్రులకి ఇప్పటి వాళ్లకి ఏమి తేడా లేదు. ఇప్పుడు ప్రతి వాళ్ళు వాళ్ళ పిల్లలని ఇంజనీరింగ్ లో ఎలా బలవంతంగా ఇరికించేస్తున్నారో ఆ రోజుల్లో నా నాన్న కూడా నన్ను అదే కోవలో మెడిసిన్ చదివించేద్దామనే ఒక బలీయమైన కోరికతో నన్ను బలి చేసారు. అంతే అభం శుభం తెలీని నేను ఇంటర్ లో బైపిసి లో జాయిన్ అయ్యా...జాయిన్ చేసారు.
ఇహ చూస్కోండి. జువాలజీ ప్రాక్టికల్ కోసం ఒక రోజు వానపాము, ఇంకోరోజు ఓ పెద్ద బావురుకప్ప, ఈ రెండూ దొరక్క పోతే తేరగా దొరికిందని, దొరుకుతుందని బొద్దింక ఇలా రకరకాల జంతువులని మా చిన్ని చిన్ని చేతులతో, మా చిన్నారి మనసులు ఎంత అస్సయ్యమైన భయం, జుగుప్సలతో బాధపడుతున్నా ఖాతరు చెయ్యకుండా వాటిని డిసేక్ట్ చెయ్యించేవాళ్ళు. వాటిని వెల్లకిలా పడేసి ఓ చెక్క ముక్కకి మేకులతో బంధించి (చచ్చినవి ఎలా పారిపోతాయో కాని వాటిని బంధించడం మట్టుకు తప్పనిసరి!) ఆ తర్వాత వాటిని అడ్డంగా అదే నిలువునా చీల్చి చెండాడి లోపల కనిపించి మన స్కాల్పెల్ కి కట్ అవ్వకుండా మిగిలిన వాటి అవయవాలు అన్నీ తీసి బైట పడేసి, అందులో బాగా నదరుగా ఉన్నదాన్ని అన్న వాహిక అని డిస్ప్లే చేసి పారేసేవాడిని. ఈ సాహసచర్యలకి బోల్డు మార్కులు వస్తాయనుకున్నా కాని అందరు విద్యార్ధుల అంచనాల్లాగా నాది కూడా తారుమారు అయ్యి చివరాఖరికి అత్తెసరు మార్కులతో గట్టెక్కా. అంతా మన మంచికే అంటారు. ఇలా జంతువుల దేహాలతో ఆడుకున్నాక ఒక్క విషయం నాకు సందేహం లేకుండా క్లియర్ గా అర్ధం అయ్యింది. అదేమిటంటే నేను జీవితంలో మంచి పేషెంట్ అవ్వడం బెటర్ బాడ్ డాక్టర్ కంటే అని. అదే చేశా. ఏ మాటకా మాటే చెప్పుకోవాలి డాక్టర్ అవ్వకుండా ఉండడానికి చాల కృషి చేసి మళ్ళీ లోక కల్యాణానికి చిన్న వాడిని, చితక వాడిని అయినా నా వంతు కృషి అంత నూనూగు మీసాల ప్రాయంలోనే చేశా. ఈ విషయం గురించి మరోసారి, వీలు చేసుకొని సవివరంగా వినిపిస్తా. అదే వివరిస్తా.
ఇక్కడ ఇంకో విషయం. ఇలా ఆ జంతువులలో (బొద్దింక క్రిమా?) ఉన్న పార్టులు అన్నీ పీకించే వాళ్ళు కాని అవి బ్రతికి ఉన్నప్పుడు ఏం తిండి తిని చస్తాయో చెప్పి చావలేదు! మరందుకే ఇప్పుడు నాకీ సందేహం. అప్పుడు అవుట్ అఫ్ సిలబస్ ఈ మేటర్!
ఇక్కడ కొంచం డైవర్ట్ అయ్యి ఇంకో మేటర్ డిస్కస్ చెయ్యాలి. సందర్భం వచ్చింది కాబట్టి. అదేమిటంటే మన హిందూ కర్మ సిద్ధాంతం ప్రకారం ఇలా ఆ జంతువులని డిసేక్ట్ చేసిన పాపం మాలాంటి అమాయకులకి చుట్టుకుంటుందా? అఫ్ కోర్స్ వాటిని మేము చంపలేదు కానీ వాటిని ఇంకెవరో చంపడానికి మేమే కదా కారణం? ఎవరూ ఇలా బైపిసి గ్రూప్ లో చేరకపోతే పాపం ఆ వానపాములు, కప్పలు, బొద్దింకలు ఎంచక్కా బ్రతికే ఉండేవి కదా? ఎవరైనా కర్మ ఎక్స్పర్ట్ లు ఈ సందేహం తీర్చ ప్రార్ధన. ఒకవేళ అలాంటి చిరు పాపం చుట్టుకుంటే కంచిలో బంగారు బల్లిని పట్టుకుంటే పాప విముక్తి కలిగినట్టు ఈ సదరు జంతువులకి కూడా ఏమన్నా పా(శా)ప విమోచనాలు ఏమన్నా శాస్త్రాల్లో పేర్కొన్నారా?
మళ్ళీ కధలోకొస్తే ఇంతకీ ఆ బొద్దింక నా షేవింగ్ సెట్ రోజూ వాయిదా పద్ధతిలో తినేసే ప్రమాదం, ఆస్కారం ఉన్నాయా? ఉంటే, గింటే (గింటే అంటే అర్ధం ఏమిటో?!) నేను తీసుకోవాల్సిన తక్షణ చర్యల గురించి ఇప్పుడు అర్జెంటు గా ఆలోచించాలి.
మరంచేత సశేషం!!!
కధ కంచికి. బల్లి హీరో కాకపోయినా!!

No comments:
Post a Comment