Startling and shocking discovery!
(The Telugu version is at the end of the English version, for those who can read and appreciate Telugu!)
In the past 1 month two electric bulbs exploded just like in our home! Luckily no one was injured. One bulb exploded when switched on and we assumed it could be due to high voltage! But after few days another bulb exploded in the "off" position just like that! That gave us some concern and we were mystified too.
After few more days whenever we switched on the light in the balcony at the back of our home the main fuse was tripping with a big sound! Then we decided its time to call the experts and called our Asthana electrician.
He inspected the problems and diagnosed that the earthing of the home got damaged and had to be replaced. Since its an expert advice and also very dangerous if no immediate remedial action is taken we gave him the green signal to replace the earthing.
He took advance and vanished for a couple of days. Then he appeared and left the new earthing materials and said he will come back in an hour and that one hour turned out to be as usual another 2 days! All these electricians, carpenters, painters etc., first accept our assignments, immediately take advance so that we can't go to another one and to make us believe in their sincerity either leave the materials required for the job and/or their tools at our home and vanish for days! I guess these guys maintain at least half a dozen tool sets to leave in different work places!
Finally he came with 2 assistants and finished installing the new earthing in about 2 hours time. One thing I've realized is that the technology has changed and in the place of coal and rock salt which was poured in the earthing pit earlier a new "earthing powder" is being sold in small bags at Rs.150! They poured 2 bags and completed the work.
Then immediately I checked out the balcony switch but to my shock again the same problem! Big sound and tripping of the fuse! Called the electrician. He looked at it for a minute or so like the newly married couple see the "Arundhati star"! And finally declared that the earthing problem is separate from this problem!!
To solve this problem he told one of his assistants to stand on a paint box kept on a stool for height and unscrew the bulb holder! He did that and discovered that there is a "bat"!! Boss electrician said its okay.. because of the bat only the bulb is getting short circuited and anyway it would've died of the shock. He asked me for a stick to pull that bat. I complied and the second the assistant poked the stick the bat which is alive just flew on to his face which is just a foot away!!
He almost fell down with a big shout and fortunately both the boss and the other assistant held on to him firmly else he would've tumbled to the ground floor!
But to the electrician's surprise there was no sign of short circuit there like the burnt wires etc.,! He wanted to unravel the mystery and came into the kitchen and told his assistant to stand on the kitchen platform and open the wire lid. He did so and again no sign of short circuit. Boss couldn't understand head or tail of it. Then he told the assistant to pull both the wires out totally and he started pulling them like Dusshasana pulling saree! Finally both the wires came out totally and there was still no sign of short circuit. And in another instant another bat just flew out from the opening again into the face of that electrician which is just less than a foot away!
He again fell down from the platform with a big confused shout! He being scared of bats just like me pulled up his T Shirt up and covered his whole face and because he couldn't see anything started to do pradakshinams! The bat also started making fast circles around the room as it can't see in the daylight!. That guy was going around himself like the earth rotating and the bat was circling him like moon!! The electrician, his other assistant and I were standing in 3 corners of the room like other planets and watched this planetary moment with amusement!
After almost half a minute which at that time seemed to be like 5 minutes the bat somehow flew out through the door and it took another 5 minutes for the assistant to recover. He refused to do anything more with that job for obvious reasons!
Finally the electrician decided that the bats though caused the short circuit no wires were burnt and they closed the small opening just beside the bulb outside!
But its a mystery how those 2 bats haven't died of electrocution! Did I just accidentally discover the fact that bats are immune to electric shocks?!! If so how can I communicate this to the scientific community?! Will I get any prize, something below Noble, next year?!
Telugu Version:
గత నెలలో మా ఇంట్లో ఉన్నట్టుండి ఓ రెండు బల్బులు ఢాం అని పెద్ద శబ్దంతో పేలిపోయాయి . అదృష్టవశాత్తు ఎవరితల మీదా గాజు ముక్కలు పడలేదు .
ఒక బల్బ్ స్విచ్ వెయ్యగానే పేలింది! బహుశా హై వోల్టేజ్ అని ఊరుకున్నాం . ఇంకొన్నాళ్ళకి ఇంకో బల్బ్ దానంతట అదే స్విచ్ వెయ్యకుండానే తీరి కూర్చొని ఢాం అని పేలింది! ఇదేదో విపత్తుకి దారి తీస్తోంది అని ఒకింత భయం వేసింది!
తదుపరి ఇంకొన్నాళ్ళకి పెరటి వేపు బాల్కనీ లైట్ స్విచ్ వెయ్యగానే బల్బ్ వెలగకపోగా ఢాం అని శబ్దంతో ఫ్యూజ్ ట్రిప్ అయ్యింది!! ఎన్ని సార్లు ప్రయత్నించినా అలాగే జరిగింది. లాభం లేదు ఇదేదో షార్ట్ సర్క్యూట్ అవుతోందని మా ఆస్ధాన ఎలక్ట్రీషియన్ ని పిలిచాం.
అతను దాన్ని చూసాక ఇంటి ఎర్తింగ్ పోయింది, వెంటనే మార్చాలి అన్నాడు! స్పెషలిస్ట్ చెప్పాక తప్పదు కదా? అందులోనూ ఎర్తింగ్ లేకపోతే ఫ్రిడ్జ్ , AC ఇవన్నీ వాడలేము. సరే మార్చెయ్యి ఎర్తింగ్ అని ఆర్డర్ వేసేసాం!
రెండురోజుల తర్వాత కొత్త ఎర్తింగ్ కి కావాల్సిన సామాన్లు అన్నీ తెఛ్చి పడేసి ఇదిగో ఇప్పుడే ఇంకో గంటలో వస్తాం అని మాయం అయ్యి మూడు రోజుల తర్వాత ప్రత్యక్షం అయ్యాడు ఇద్దరు అసిస్టెంట్ లతో సహా! ఈ ఎలెక్ట్రిషన్లు, కార్పెంటర్లు, పైంటర్లు వీళ్ళందరూ ఒకే టైపు! ముందు పని ఒప్పుకొని వెంటనే టంచనుగా అడ్వాన్స్ తీసుకొని, పనికి కావాల్సిన సామాన్లు కొని తెచ్చికానీ లేదా వాళ్ళ పనిముట్లు మనింట్లో పడేసి హాంఫట్ అని మాయం అయిపోతారు "ఇదిగో ఇప్పుడే వస్తాం అని" ఇంక ఆ తర్వాత వాడి చెయ్యి ఖాళీ అయ్యాకే వస్తాడు. ఇలా అందరిళ్ళల్లో అడ్వాన్సులు తీసుకొని అప్పుడు పని మొదలెడతారు. అడ్వాన్స్ ఇచ్చాము కాబట్టి మనం ఇంకోడిని తేలేము. అది వాళ్ళ కుళ్ళు ఐడియా!
సరే మొత్తానికి మూడు రోజుల తర్వాత ఒక రెండు గంటలు శ్రమ పడి కొత్త ఎర్తింగ్ పని పూర్తి చేశారు. నాకు తెలిసిన కొత్త విషయం ఏమిటంటే ఇటీవలి కాలంలో ఈ ఎర్తింగ్ గుంటలో మునుపటిలా బొగ్గు, ఉప్పు వెయ్యటం లేదు! ఎర్తింగ్ పౌడర్ అని చిన్న బస్తాల్లో అమ్ముతున్నారు. ఒక్కో బస్తా 150 రూపాయలు. రెండు బస్తాలు పోశారు మా ఎర్తింగ్ గొయ్యిలో!
ఎర్తింగ్ పని పూర్తి కాగానే నేను వెంటనే బాల్కనీ స్విచ్ వేసి చూసాను. ఏముంది? షరా మామూలే! ఢాం శబ్దం. ఫ్యూజ్ ట్రిప్ అవ్వడం!! అసిస్టెంట్స్ ఇద్దర్ని పిలిచి చూపించాను. వాళ్లకి పరిస్థితి అర్ధం కాలేదు. కిందకెళ్ళి వాళ్ళ బాస్ ని పిలుచుకొచ్చారు.
బాస్ ఆ బల్బ్ ని తదేకంగా కొత్తగా పెళ్లయిన వధూవరులు అరుంధతి నక్షత్రం వేపు చూసినట్టు ఒక నిమిషం చూసాడు. చూసి ఎర్తింగ్ ప్రాబ్లెమ్ అయితే ఉంది ఈ ఇంటికి. ఇప్పుడది సరి చేసాను. కానీ ఈ బల్బ్ ప్రాబ్లెమ్ ఇంకోటి అని తీరిగా సెలవిచ్చాడు! మరయితే ఇహనేం దీని సంగతి కూడా చూడు అర్జెంటు గా అన్నా. అప్పుడప్పుడూ సర్జన్ ఒక ఆపరేషన్ మొదలెట్టి లోపల ఇంకో ప్రాబ్లెమ్ కనిపిస్తే దాని పని కూడా పట్టినట్టు!
వెంటనే ఒక అసిస్టెంట్ ని ఒక ఇనప స్టూల్ మీద ఒక పెయింట్ డబ్బా పెట్టి దాని మీదకి ఎక్కి ఆ బల్బ్ తియ్యమన్నాడు. బాల్కనీ లో సగభాగం చూరుంది. మిగతా సగంలో అంటే బాల్కనీ గోడకి ఆనించి స్టూల్ వేసి మిగతా ఇద్దరు పట్టుకుంటే వాడు పాపం సర్కస్ ఆర్టిస్ట్ లాగ కష్టపడి బల్బ్ హోల్డర్ విప్పాడు. లోపలికి చూసి "సార్! ఇందులో గబ్బిలం ఉంది!!" అని అరిచాడు. "ఉంటే ఉందిలే. షార్ట్ సర్క్యూట్ కి చచ్చిపోయి ఉంటుంది" అని వాడికి ఒక పుల్ల ఇమ్మన్నాడు బాస్ దాన్ని తియ్యడానికి. నా దగ్గర పుల్లలకేం కొదువ! పుల్లలు పెట్టేవాడిని!! ఓ నాదరుగా ఉన్న పుల్ల వెంటనే ఇచ్చా. వాడు దాన్ని పుల్ల పెట్టి కదిలించడం ఏమిటి ఆ గబ్బిలం ఒక్కసారి వాడి మొహం మీదకి ఎగిరింది! వాడు కెవ్వున కేక పెట్టి స్టూల్ మీదనించి పడినంత పని చేసి గబ్బిలంలా తలకిందులుగా అయ్యాడు! అదృష్టవశాత్తు బట్టలు ఆరేసే రెండు ఇనప వైర్ల మధ్యలో నిలపడ్డాడు కాబట్టి మేడపై నించి కిందకి పడలేదు. ఈ లోపల బాస్, రెండో అసిస్టెంట్ వాడిని పట్టుకొని మళ్ళీ నిలపెట్టారు!
అసలు అన్ని సార్లు షార్ట్ సర్క్యూట్ చేసిన ఆ గబ్బిలం ఎలా బ్రతికి ఉందొ మాకెవ్వరికీ అర్ధం కాలేదు.
కానీ ఇంకో గమ్మత్తు ఏమిటంటే ఆ బల్బ్ హోల్డర్ లోపల ఎలక్ట్రిక్ వైర్లు కాలిన సూచనలేమీ కనిపించలేదు! బాస్ ఎలక్ట్రీషియన్ కి ఈ మిస్టరీ అర్ధం కాలేదు. దానంతు చూడాలని వంటింట్లోకి వఛ్చి అసిస్టెంట్ ని అక్కడి గట్టు ఎక్కించి లోపల గోడకి ఉన్న ఎలక్ట్రిక్ పాయింట్ ఓపెన్ చెయ్యించాడు. అక్కడ కూడా వైర్లు కాలిన ఆనవాలు లేదు! ఇహ లాభం లేదని బైట బల్బ్ కి వెళ్లే రెండు వైర్లు లాగమని అసిస్టెంట్ కి పురమాయించాడు.
వాడు వెంటనే దుశ్శాసనుడి లాగా ఆ రెండు వైర్లని తెగ లాగడం మొదలెట్టాడు. ఒక రెండు మీటర్లు లాగాక వాడి డే బాగున్నట్టు లేదు ... ఆ ఎలక్ట్రిక్ వైర్లు ఉండే ప్లాస్టిక్ పైప్ పక్కనున్న కన్నంలోంచి ఇంకో గబ్బిలం మళ్ళీ వాడి మొహం మీదకి దూసుకొచ్చింది. వాడి మొహం ఆ కన్నానికి ఒక అడుగు దూరంలోనే ఉంది. ఇంకేముంది. మళ్ళీ కధ మామూలే. వాడు కెవ్వు కేక, గట్టు మీదనించి ఢాం అని పడ్డం ఒక లిప్తపాటులో జరిగాయి.
పగలు కళ్ళు కనిపించక ఆ గబ్బిలం ఆ చిన్న వంటింట్లో సర్కస్ లో గ్లోబ్ లో తిరిగే మోటార్ సైకిల్ వాడిలాగా వీర స్పీడ్ గా గిరగిరా గాల్లో తిరిగెయ్యడం మొదలెట్టింది. ఆ అసిస్టెంట్ కి నాలాగా భయం జాస్తి. వాడు వెంటనే వేసుకున్న టీ షర్ట్ మొహం మీదకి లాగేసి మొహం మొత్తం కప్పేసుకున్నాడు గబ్బిలం మొహం గుద్దినా తెలీకుండా! అంత మట్టుకు ఓకే. కానీ వాడికి భయం కంగారు కలగలిసి, టీ షర్ట్ తో మొహం కప్పేసుకున్నాడు కాబట్టి వాడికి కూడా కళ్ళు కనిపించక వాడు భూమి తన చుట్టూ తాను తిరిగినట్టు వాడు కూడా గిరగిరా ఉన్న చోటే ప్రదక్షిణాలు యమా స్పీడ్ గా చేసెయ్యడం మొదలెట్టాడు. భూమి చుట్టూ తిరిగే చంద్రుడిలా ఆ గబ్బిలం వాడి చుట్టూ వాడు ఒక ప్రదక్షిణం పూర్తి చేసేలోగా అది ఆరు రౌండ్లు వాడి చుట్టూ తిరగడం మొదలెట్టింది. పక్కనే మూడు దిక్కుల్లో వాడి బాస్, రెండో అసిస్టెంట్, ఎందుకైనా మంచిదని ఎలక్ట్రిసిటీ కి, గబ్బిలానికి కొంచం దూరంగా నేను... మేమంతా మిగతా గ్రహాల్లాగా వినోదం చూస్తూ ఉండిపోయాం! గబ్బిలాన్ని పట్టుకోలేం. ఆ ఎలక్ట్రీషియన్ ఆపి ప్రయోజనం లేదు గబ్బిలం ఉన్నంత వరకు!!
అలా దాదాపు ఒక 20, 30 సెకండ్ల పాటు వాడు గబ్బిలం తిరిగారు. దాని అదృష్టం, వాడి అదృష్టం బాగుండి దానికి తెలీకుండానే ఆ గబ్బిలం పెరటి గుమ్మంలోంచి ఎగురుకుంటూ ఇంటి బైటికి వెళ్ళిపోయింది!! హమ్మయ్య. గండం గడిచి పిండం బైట పడింది ;)
ఆ తర్వాత రెండు మూడు నిమిషాలకి కానీ ఆ అసిస్టెంట్ తేరుకోలేదు. తర్వాత నేనిక ఛస్తే మళ్ళీ ఆ కన్నం జోలికి పోనని మొరాయించాడు. ఇంక తప్పేది లేక రెండో అసిస్టెంట్ మిగతా కాగల కార్యం పూర్తి చేసాడు!
తర్వాత బైట వేపు బల్బ్ పక్కనున్న చిన్న కన్నం మూసేసారు. కానీ ఇప్పటికీ నాకు, ఆ ఎలక్ట్రీషియన్ కి అర్ధం కానిది ఏమిటంటే ఆ గబ్బిలాలకి ఎందుకు షాక్ కొట్టలేదు! అవి ఆ కన్నంలో ఎన్నాళ్ళు ఎలా ఉన్నాయి?
గబ్బిలాలకి కరెంటు షాక్ కొట్టదు అన్న విషయం నేనే ఫస్ట్ కనుక్కున్నానో ఏమిటో ? ఈ విషయం సైంటిఫిక్ కమ్యూనిటీ కి ఎలా తెలియచెయ్యాలి? ఇది కనిపెట్టినందుకు నోబెల్ ఫ్రిజ్జ్ కంటే ఒక్క రవ్వ చిన్న ప్రైజ్ వచ్ఛే సంవత్సరం నాకొచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా ?!!

And what happened to the electrical explosions ? Solved ?
ReplyDelete