NA : ఇన్నాళ్ళూ NB అన్న దాని అసలు అర్ధం తెలుసుకొనే ప్రయత్నం కూడా చెయ్యకుండా, నేనే దాని సమయ సందర్భాల్ని పట్టి NB అంటే Note Below అని డిసైడ్ అయిపోయా! ఎందుకంటే సర్వసాధారణంగా ఈ NB అనేది ఎప్పుడూ వ్యాసం, ఉత్తరం, రచనలలో చివరిలోనే చూసాను. వ్యాస ప్రారంభంలో కనీసం ఒక్కసారైనా చూసుంటే నేను అన్వయించుకున్న అర్ధం తప్పేమోనన్న అనుమానం వచ్చేది. కాని అలా ఎప్పుడూ వ్యాస, ఉత్తర, రచన ప్రారంభంలో చూడకపోవడం వళ్ళ NB ని నేనిలా అపార్ధం చేసుకొని దానికి వ్యతిరేకంగా NA కి శ్రీకారం చుట్టాను. ఇప్పుడు చదువరులకి చూచాయగా NA అంటే ఏమిటో అర్ధం అయ్యిపోయి ఉంటుంది. అలా కాని పక్షంలో NA అంటే Note Above అని తెలుసుకొన మనవి.
ఇంతకీ ఈ NA లో ఏం చెప్పదలుచుకున్నానో, NA అంటే ఏమిటో ఇంత రాసేటప్పటికి మరిచిపోయాను :(
ఒక గంట "బ్రేక్" తీసుకున్నాక గుర్తొచ్చింది! "బ్రేక్" అంటే మీ భాషలో విశ్రాంతి ఏమో .. నా భాషలో చేస్తున్న పని నించి "బ్రేక్" మాత్రమే... అంటే ఆ "బ్రేక్"లో వంటా, వార్పూ, స్నానం, ధ్యానం, సంధ్యావందనం (అతిశాయోక్తి!) కానిచ్చానని చెప్పకనే చెప్పడం ;)
ఇంతకీ అసలు NA ఏమిటి అంటే నా (ఈ కింది రచనలోనే కాకుండా) రచనల్లో "కోడిగుడ్డుకి జిల్లెట్ మాక్ 3 రేజర్ తో క్షవరం" చేసే పని చెయ్యద్దు!! అంటే "ఇదేంటి? ఇలాగ ఎక్కడన్నా అవుతుందా? మరీ ఇంత అన్నాచురల్ గానా?!!" అని అడగద్దు! సినిమాల్లో ఎంత అసందర్భం అయినా చూస్తున్నామా లేదా?! "ఎగిరేది సుమో! ఎగరగొట్టేది హీరో సుమా!!" అని ఆనందపడిపోతున్నామా లేదా? హీరో, హీరోయిన్ ప్రేమ పాటల్లో వాళ్ళిద్దరికీ సంబంధించిన అంతరంగిక ప్రేమని బహిర్గతంగా పాడి, స్టెప్పులు వేస్తూంటే వెనకాతల పంచె కట్టి పది మంది విదేశీ పురుషులు, అడ్డదిడ్డంగా చీర కట్టిన పదిమంది విదేశీ స్త్రీలు మన సంగీతానికి మన స్టెప్పులు వేస్తూంటే "ఆహా! విదేశీయుల చేత కూడా మన డాన్సులు చేయించామని ఆనందిస్తున్నామా లేదా? ఇ(అ)వన్నీ అసందర్భం కానప్పుడు, అతి సహజం అయినప్పుడు, నా రచనల్లో నేను రాసేవన్నీ కూడా సంభవాలే ;)
రచనా ప్రారంభం:
ఈ మధ్య ఒక స్టీల్ బీరువా కొన్నా. దాంతో పాటు చాలా సహజంగా ఒక జత తాళాలుసెట్ ఇచ్చాడు. ఒక తాళం తలుపుకి, ఇంకొకటి లోపల సేఫ్ కి, ఇంకోటి సేఫ్ లో పక్కకి "ఎవరికీ కనిపించకుండా" ఉన్న ఇంకో బుజ్జి సేఫ్ కి, నాలుగోది అన్ని అరలకిందా, ఇన్కమ్ టాక్స్ వాళ్లకి, దొంగలకి తెలీకుండా, కేవలం మనకి మాత్రమే తెలిసిన ఇంకో సీక్రెట్ సేఫ్ కి !! ఇలా నాలుగు తాళాలకి నాలుగు డూప్లికేట్ తాళాలు. ఇంతవరకూ బాగానే ఉంది.
ఒక తాళాల సెట్ రోజూ వాడతాం. సమస్య ఏమిటంటే రెండో సెట్ ఎక్కడ పెట్టాలి అని! ఇదేమంత పెద్ద సమస్యలాగ మీకనిపించకపోవచ్చు. నా దృష్టిలో ఇది చాలా జటిల సమస్య. మీరంతా బహుశా పోపుల డబ్బాలోనో, పరుపు కిందో, లేకపోతే హాల్లో పుస్తకాల వెనకో పెడతారేమో? మీరలా పెడితే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. దొంగోడికి పని సులువు చేసేస్తున్నారు ;) ఏ మనిషైనా, చివరికి దొంగైనా సరే, కష్టపడకుండా డబ్బు సంపాదిస్తే నాకు నచ్చదు. మనం, కిందా మీదా పడి, బోల్డు కష్టపడి సంపాదిస్తే, మనం అలా బైటికో, ఊరికో వెళ్తే, దొంగ ఇలా వచ్చి ఇంట్లో సామాన్లు చిందర, వందర చేసి తాళాలు దొరగ్గానే ఎంచక్కా ఏమి కష్టపడకుండా మొత్తం దోచుకుపోతాడు. అందుకని మనం ఈ డూప్లికేట్ తాళాల సెట్ మూడో కంటివాడికి కూడా తెలీని సీక్రెట్ ప్లేస్ లో దాచెయ్యాలి! కాని అంత సీక్రెట్ ప్లేస్ ఎక్కడ? ఎక్కడ?
పిడకల వేట: అప్పుడప్పుడూ పేపర్లో ఎవరింట్లో అయినా దొంగలు పడ్డాక పోలీసులు వెళ్లి ఆ ఇంటిని, చిందర, వందరగా పడేసిన సామానులని సునిశితంగా పరిశీలిస్తున్న ఫోటో మీరంతా చూసే ఉంటారు. నాకు అలాంటి ఫోటో చూసినప్పుడల్లా ఈ దొంగలు ఎందుకు అలాగ సామానులన్నీ చిందర వందరగా పడేస్తారు అని అనుమానం వస్తుండేది. ఒకసారి ఒక దొంగగారిని అడిగాను ఇదే ప్రశ్న. ఇప్పుడు నన్ను ఈ దొంగ ఎవరు? అతనికీ మీకు ఏమిటి సంబంధం? మీరిద్దరూ తొడుదొంగలా? కాకపోతే మాకెవ్వరికీ తెలీని, దొరకని దొంగ మీకెలా ఎదురయ్యాడు? ఇలా లక్ష, యక్ష ప్రశ్నలు వెయ్యద్దనే NA లో వాపోయా. ఈ ప్రశ్నలన్నిటికీ, లోపాయకారీగా, నా దగ్గర సమాధానాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ రాసుకుంటూ పోతే, రామాయణంలో పిడకల వేట వోకే కాని, రామాయణం అంత పిడకల వేట నాట్ వోకే! అప్పటికి నా ఓపిక కూడా అయిపోయి, అసలు విషయం రాయకుండా ముగించెయ్యాల్సి వస్తుంది. ఆ పైన మీ ఇష్టం. దొంగలతోనే ఏం ఖర్మ? ఓ చిన్న హత్య చేసిన హంతకుడు కూడా నాకు పరిచయస్తుడే!! చిన్న హత్య అంటే చంపేద్దామనుకోకుండా చిన్న కత్తితో ఏదో అలా పొడిచెయ్యడం అన్న మాట! అదింకో కథ! ఇప్పుడవన్నీ ఎందుకు లెండి?!
మీకు అన్నీ తెలిసి కూడా తెలీనట్టు అడుగుతారు! కొన్నేళ్ళ క్రితం మూడు రాష్ట్రాల పోలీసులకి, స్పెషల్ టాస్క్ ఫోర్సు కి కూడా ఎక్కడ ఉన్నాడో తెలియని "శాండల్ వుడ్ వీరప్పన్" ఇంటర్వ్యూ ఫోటో లతో సహా ఒక జర్నలిస్ట్ ప్రచురించాడా లేదా? ఇంకో విషయం కూడా "రవి కాంచని చోట కవి కాంచున్" అన్న నానుడి కూడా తవరికి విదితమే!
ఇంతకీ ఆ దొంగ ఏమి సమాధానం చెప్పాడంటే "అలా అన్నీ చిందరవందర చెయ్యడంలో ఉన్న కిక్కే వేరప్పా? ఎవరింట్లో సామాన్లు వాళ్లు అలా ఆ కిక్ కోసం పడెయ్యలేం కదా? నా ఇంట్లో సామాన్లు చిందర వందర దాక ఎందుకు, తీసిన బీరువా తలుపు ముయ్యక పోయినా, లాగిన టేబుల్ డ్రా మళ్ళీ ముయ్యకపోయినా అయిపోయానే!! అలాంటిది మా ఇంట్లో సామాన్లు అలా పడేస్తే మా ఆవిడ ఒప్పుకుంటుందా? ఊరుకుంటుందా? తనే నన్ను పోలీసులకి అప్పగించేస్తుంది. అందుకని ఇలా వృత్తి పని మీద ఇంకోళ్ళ ఇంటికొచ్చినప్పుడు ఆ రాక్షస ఆనందం పొందుతాం.. అన్నీ కిందా పైనా పడేసి, అఫ్ కోర్స్, శబ్దం రాకుండానే!! పైగా ఇలా చెయ్యకపోతే ఈ దొంగ ఎవడో ఇంటి దొంగే అని లేదా ఇంటివాళ్ళకి తెలిసిన వ్యక్తి అని పోలీసులు విపరీతమైన తెలివితేటలు ఉపయోగించి ఆ కుటుంబ సభ్యులనీ, అపార్ట్ మెంట్ అయితే వాచ్మాన్ని, వాడి కుటుంబ సభ్యులనీ ఇలా అందరినీ అనుమానించి, అవమానించి విచారణ చేసి విసిగిస్తారు. అది దొంగలమే అయినా మాకు కూడా నచ్చదు! అందుకే పోలీసులకి అసలు దొంగని పట్టుకోవడానికి "క్లూస్" ఇలా వదులుతాం! మాకు కూడా దొంగల నీతి, కోడ్ అఫ్ కండక్ట్ ఉంటాయి!" అని
పిడకల వేట సమాప్తం!
ఇంతకీ ఆ డూప్లికేట్ తాళాలు ఎక్కడ దాచాలి? ఎక్కడ?! ఎక్కడ?! ఎక్కడ?! వెంటనే ఆ మధ్య చూసిన ఒక తెలుగు సినిమా సీన్ ఒకటి గుర్తొచ్చింది. అందులో హీరోని పట్టుకోలేక విలన్, హీరో తల్లితండ్రులని పట్టుకు రమ్మంటాడు తన గ్యాంగ్ సభ్యులతో. అంతా "ఎస్ బాస్" అని నాలుగు దిక్కులకీ వెళ్ళిపోతారు. వాళ్ళెక్కడ ఉంటారో తెలీకపోయినా! అప్పుడు హీరోకి ఒక బ్రిలియంట్ ఆలోచన వస్తుంది. అదేమిటంటే తన తల్లితండ్రులని విలన్ ఇంట్లోనే దాస్తాడు! వాట్ ఏ మాస్టర్ స్ట్రోక్!! విలన్ ప్రపంచం అంతా వెదుకుతాడు కాని తన ఇంట్లో వెదకడు కదా?
అంతే నేను కూడా అదే ఫార్ములా ఫాలో అయిపోవదానికి డిసైడ్ అయ్యిపోయా! అంటే బీరువాలో సేఫ్ లో ఉన్న చిన్న సీక్రెట్ సేఫ్ లో ఆ డూప్లికేట్ తాళాలు దాచడం అన్న మాట ;) ఇది ఎంత కొండవీటి గజదొంగ అయినా ఊహిస్తాడా?! మనం బైటకి వెళ్ళినప్పుడు ఒక సెట్ తీసుకుపోతాం! రెండోది బీరువాలోనే ఉంటుంది! ఇంక ఆ దొంగ చచ్చినట్టు గాడిద కస్టాలు పడి బీరువా బద్దలు కొట్టాల్సిందే! అదేమంత వీజీ కాదు. బోల్డు శబ్దం వస్తుంది. బోల్డు పని ముట్లు తీసుకెళ్ళాలి. బోల్డు టైం పడుతుంది! ప్రొఫెషనల్ దొంగలు అంత రిస్క్ తీసుకోరు! మన సామాన్లు అన్నీ భద్రం!!
ఇలా బీరువా లోనే దాచడం లో ఇంకొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
1. మా ఇంట్లో తాళం చెవి ఉండి దానికి మాచింగ్ తాళం కప్ప లేని తాళాలు కొన్ని, కప్పలుండి చెవుల్లేని తాళాలు బోల్డు ఉన్నాయి! అవి పారేద్దాం అనుకుంటే పారేసాక వాటికి మాచింగ్ కప్పలు, చెవులు దొరుకుతాయేమో? అందుకని చాలా మంది ఇళ్ళల్లో తాళం కప్పలోనే తాళం చెవి కూడా ఉంటుంది. అలా బీరువాలోనే తాళాలు ఉంటే ఇలాంటి సమస్య తలెత్తదు!
2. తల్లీ పిల్లని వేరు చేసినంత మహా పాపం ఇంకోటి లేదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి! తాళం కప్పని, చెవిని వేరు చేసిన మహా పాపం కూడా అదే కోవకి చెందుతుంది! ఆ పాపం మనమెందుకు మూట కట్టుకోవడం? ఆలోచించండి.
#Telugu

No comments:
Post a Comment