I had an interesting dream about 3 years ago! In that dream I was all alone in the inner sanctum sanctorum of Tirumala temple and there was just one Poojari. I recognized him as he is the Poojari in a temple I frequent in Hyderabad! He told me “Since you are the only one now, you can stay as long as you want” and then he went out! I had the uninterrupted “Special Darshan” of Sri Venkateswara Swamy for at least half an hour and then came out.
In the morning I told about the dream to my wife as well as a close friend. Both of them were unanimous in their interpretation of the dream! They said that the Lord is calling me to Tirumala! I kinda specialize in what can be loosely termed as “vitanda vada”!! So I replied to them “Why should I visit Tirumala when He gave me a long special darshan?!” And both of them kept quiet as they know better ;) Interestingly even after I woke up I could still “see” that dream very very vividly and in fact was kind of flummoxed as I couldn't figure out the temple where I saw that Poojari!! Soon I forgot about that dream. And you too for the moment!
(Somehow I never thought of submitting my "minimum list of demands/wishes to HIM during that long Darshan!!)
After many months I went to a close friend's house at 11 AM very unexpectedly. We went on chatting for some time when he suddenly asked me what I know about the Chilkur temple! Frankly I was surprised (rather shocked was the more appropriate word!) as I've never seen him talking about Gods or temples and I never thought he was a devotee! But keeping aside my surprise feelings I told him what I know about that temple; that one should make 11 pradakshinas of the temple and make a vow. And once the wish is fulfilled then they come back and do 108 pradakshinas!
Here I've added my own theory! I told him that devotees seeking fulfillment of wishes and offering something like tonsuring of head, climbing Tirumala hills on foot, offering money or 108 coconuts AFTER their wish is fulfilled is like the villains in movies who offer a certain amount to hired goondas to kill the hero or heroine and give them a token advance promising to pay the balance AFTER they finish their part of killing! They do so because they don't exactly have 100% faith/belief in those goondas that they will deliver! Devotees offering the God AFTER their wish is fulfilled means even they don't have 100% faith in Him!! And so I told him according to me, if one were to visit Chilkur temple with a wish then they should make 108 pradakshinas in the first visit itself and NOT after their wish is fulfilled! My friend agreed to my theory!
Then I offered to accompany him if he wants to go there on the coming Saturday but he immediately asked me “How about going right now?!” I was surprised again but then decided to go along as I didn't have any pressing work that day. I called my wife and told her that I'm going to Chilkur temple and she immediately gave me the green signal.
So off we went to Chilkur with a pit stop in a restaurant at Banjara Hills where we had a lavish buffet lunch ;) I told my friend that leave alone 108 he can't even do 11 pradakshinas if he were to eat so heavily! But he said he will manage and we both had a heavy lunch and reached Chilkur around 3 PM. It was very cloudy and was threatening to rain any moment. Surprisingly there were just 2/3 cars and about 30 bikes there which is a rare thing!
We both went inside and found that there were hardly about 100 -150 devotees in the temple and they were all doing the pradakshinas and as usual all of them were almost running!! My friend started his rounds and I wanted to give him company for few rounds but after the 3rd round I had terrible pain in my foot. In fact a week before I had that pain and stopped my usual morning walks in the evenings! And so I sat in the veranda watching all the devotees.
After 5 minutes I heard an announcement in the PA system that they need volunteers to give prasadam to devotees etc., I instantly jumped up and went to the place where they give prasadam. A 25 years old man was there and when I told him I want to do the volunteer work he told me to give the prasadam to the devotees after they come out of the inner shrine and also try to sell the Vak magazine to any interested devotees. He said he wants rest for an hour or so. I agreed and stood there. But as I've mentioned since there were very few devotees I was just standing there without any devotee coming out for many minutes. Then a thought struck me and I went inside the shrine and stayed there staring at the main idol of Sri Venkateswara Swamy till a batch of devotees came in. Then I came out and resumed my duties of offering prasadam. Once that batch went off again there was a gap with no one entering the temple. So again I went inside and this went on for about 45 minutes!!
(Incidentally I sold lots of Vak magazine in that short period as I was from sales!!)
That day happened to be some auspicious day and the idol was well decorated. And that's how I ended up having a long darshan of more than half an hour!
I returned home and told my wife about this interesting incident and then she reminded me of my Tirumala darshan dream! Till then I forgot about it totally! I was very happy that the impossible dream of special darshan in His Head Office came true in His branch office :)
Then after few weeks I went to Tadbund Hanuman temple and after darshan came out to the area where the vehicle poojas are performed. When I saw the old Poojari who does the vehicle pooja I instantly recognized him as the one who appeared in my Tirumala dream! I immediately told him about it. He was shocked and said that “Its Lord Hanuman himself who appeared in your dream as me! He never appears as Himself to any one”! It was another pleasant surprise to me. He then asked me whether I “owe” anything to Sri Venkateswara Swamy! I told him I “owe” him a lot but can't repay them all now :( Then he said in that case perform archana/seva in any of his temples and I did that.
That's how my dream came true!! And its just that! Please don't read more into it.
PS: Don't even presume that I'm privileged or close to God!! Far from the truth! My one wish in about dozen visits to Chilkur temple remains unfulfilled :(
On many occasions temple doors were closed when I visited some temples :(
And here under is the #Telugu version for those of you who prefer it!
మూడు, రెండు సంవత్సరాల కిందటి సంగతి! సాధారణంగా రెండు, మూడు సంవత్సరాల కిందట అని మొదలు పెడతారు/చెప్తారు, కాని మీరేంటి రివర్స్ లో చెప్పారు అంటే దానికొక కారణం ఉంది. కొన్నేళ్ళ క్రితం జరిగిన సంఘటనలు సాధారణంగా కరెక్ట్ గా ఎప్పుడు జరిగాయో గుర్తుండవు. అందుకని సుమారుగా రెండు, మూడు సంవత్సరాలు అంటారు, ఒక్క సంఘటన గురించి చెప్తున్నా. కాని ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక్క సంఘటన గురించి కాదు! రెండు సంఘటనల గురించి. అందులో ఒకటి మూడు సంవత్సరాల క్రితం, రెండోది రెండు సంవత్సరాల క్రితం జరిగినవి. అందుకే అలా రాసాను. ఆ రెండింటికీ లింక్ ఉంది!
మొదటగా మూడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఒక రాత్రి కల వచ్చింది. పగటి కల కాదు!! ఈ మధ్య కలల గురించి రాస్తున్నారు అని అనుకుంటారేమో? అందుకే ఇది జరిగిన చాల ఏళ్ళకి రాస్తున్నాను. ఇంతకీ ఆ కల ఏంటంటే నేనొక్కడినే తిరుమల గుడి గర్భగుడిలో ఉన్నాను. అక్కడ ఒకే ఒక్క పూజారి ఉన్నారు. గమ్మతేమిటంటే ఆ పూజారి నేను హైదరాబాద్ లో వెళ్ళే ఒక గుళ్ళో పూజారి!! కాని కలలో ఆయన్ని గుర్తుపట్టాను కాని ఇదేంటి తిరుమలలో ఉన్నారు అన్న సందేహం రాలేదు (కల్లో). అప్పుడు ఆ పూజారి "మీరొక్కరే ఉన్నారు కాబట్టి మీ ఇష్టం వచ్చినంత సేపు ఉండండి అని ఆయన గర్భగుడి బైటికి వెళ్ళిపోయారు. నేను దాదాపు ఒక అరగంట అలా వేంకటేశ్వర స్వామి వారిని చూస్తూ ఉండి పోయాను. తర్వాత ఇంక బాగోదని బైటికి వచ్చేసాను.
పొద్దున్నే మా ఆవిడతో, ఇంకో స్నేహితుడితో చెప్పాను. వాళ్ళిద్దరూ అందరూ అనుకోనేదే చెప్పారు. మిమ్మల్ని తిరుమల రమ్మని పిలుపు అని! నేను వెంటనే నా వితండ వాదం ప్రవేశపెట్టాను. "రాత్రి నాకు కలలో స్వామి వారు ప్రత్యెక దర్శనం ఇచ్చాక ఇంక మళ్ళీ తిరుమల ఎందుకు వెళ్ళడం? నేనేం వెళ్ళను" అని ఖరాఖండి గా చెప్పేసాను. పొద్దున్నకి కూడా ఆ కలలో కనిపించిన పూజారి మొహం కళ్ళకి కట్టినట్టు కనిపిస్తూ ఉంది కాని ఆయన్ని ఏ గుళ్ళో చూసానో ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు. కాలక్రమంలో ఆ కలగురించి మర్చిపోయాను. మీరు కూడా ఈ కల సంగతి ప్రస్తుతానికి మర్చిపోండి!
ఫుట్ నోట్ : పొద్దున్న కాని తట్ట లేదు నాకు, రాత్రి అంతసేపు ఏకాంతసేవ దర్శనం సమయంలో నా "కనీస కోరికలు" కానీ, కస్టాలు కాని తీర్చమని ఎందుకు కోరుకోలేదు?!! నాకిప్పటికీ అర్థం కాని విషయం ఇది :(
తర్వాత సీన్ కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత ఒకరోజు అనుకోకుండా ఒక ఫ్రెండ్ ఇంటికి పొద్దున్న 11 గంటలకి వెళ్లాను. కాసీపు ఆ కబురు, ఈ కబురు చెప్పుకున్నాక, ఆ ఫ్రెండ్ నన్ను హటాత్తుగా "నీకు చిలుకూరు గుడి గురించి తెలుసా" అని అడిగాడు. నేను ఒకింత షాక్ అయ్యాను. ఎందుకంటే నాకు తెలిసి ఆయన ఎప్పుడూ, దేవుడు, గుళ్ళూ విషయాలు చర్చించలేదు. పెద్ద దైవభక్తి ఉన్న మనిషిలా కూడా అ(క)నిపించలేదు నాకు అప్పటిదాకా.
సరే చిలుకూరు గుడి గురించి నాకు తెలిసినది, నా పైత్యం కొంత కలిపి చెప్పాను. అక్కడ ముందస్తుగా 11 ప్రదక్షిణాలు చేసి మనసులో ఉన్న ఒక్క కోరిక కోరుకుని, అది తీరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చెయ్యాలి అని! ఇక్కడ కొంచం అప్రస్తుత ప్రసంగంలా అనిపించినా నా అభిప్రాయం ఒకటి ఇలా కోరికలు కోరుకోవడం, అవి తీరితే ఏదో చేస్తాను, ఇస్తాను అని మొక్కుకోవడం మీద నాకు నాదైన అభిప్రాయం ఒకటుంది. అదేమిటంటే ఇలా "నాకు ఎంసెట్ లో పెద్ద రాంక్ వస్తే గుండు గియ్యించుకుంటాను", "మా అమ్మాయి పెళ్లి కుదిరితే 108 కొబ్బరికాయలు కొడతాను", "నాకు ఉద్యోగం వస్తే తిరుమల కొండ నడిచి ఎక్కుతాను" అని అడగడం నాకెలాగ అనిపిస్తుందంటే, సినిమాల్లో విలన్ ఒక కిరాయి రౌడీ ని పిలిచి "హీరోని చంపితే పది లక్షలు ఇస్తాను. ఇదిగో 5 లక్షలు అడ్వాన్సు, మిగతాది పని పూర్తి అయ్యాక" అంటాడు చూసారా, అలా అనిపిస్తుంది. ఆ విలన్ అలా సగం పనయ్యాక ఇస్తాను అని ఎందుకు అంటాడంటే, ఆ సదరు కిరాయి రౌడీ మీద పూర్తి నమ్మకం లేక!! ఇదిగో మరి భక్తులు కూడా ఇలా "నాకీ పని చేసిపెట్టు! చేసాక ఇదిస్తాను. అది చేస్తాను" అని అనడంలో వాళ్లకి తమ కోరికలు తీర్చే విషయంలో దేవుడి మీద పెద్ద నమ్మకం ఉన్నట్టు అనిపించదు. నిజంగా దేవుడి మీద గట్టి నమ్మకం (తన కోరిక తీరుస్తాడు అని) ఉంటే, ఆ చేస్తాను, ఇస్తాను అన్నవి ముందే చెయ్యాలి, ఇవ్వాలి! ఇది నా థియరీ!!
అలా నా ఫ్రెండ్ కి ఆ గుడి సాంప్రదాయం తో పాటు నా థియరీ కూడా చెప్పాను. నేనయితే 108 ప్రదక్షిణాలు ముందే చేస్తాను! అని. నా ఫ్రెండ్ కూడా నా థియరీ ఒప్పుకోని తను కూడా 108 ప్రదక్షిణాలు ముందే చేస్తాను అన్నాడు! నేనయితే వాకే! అన్నా. వచ్చే శనివారం అయితే నేను కూడా కంపెనీ ఇస్తాను అన్నా. నా ఫ్రెండ్ "మనం ఇప్పుడే ఎందుకు వెళ్ళకూడదు" అన్నాడు. నేను అయితే చలో. నాకు పెద్దగా పనేం లేదు ఇవాళ. పద వెళ్దాం అని మా ఆవిడకి ఫోన్ చేసి చెప్పాను. " ఇలా నా ఫ్రెండ్ తో చిలుకూరు వెళ్తున్నా" అని. ఏ బార్ కో అయితే మా ఆవిడ భారీ అభ్యంతరం చెప్పేదేమో కాని గుడికి అంటే ఎప్పుడైనా గ్రీన్ సిగ్నల్ ;)
అంతే ఒంటిగంటకి బయల్దేరాం. మధ్యలో నా ఫ్రెండ్ బంజారా హిల్స్ లో ఒక రెస్టారెంట్ లో భారీ బఫెట్ భోజనం పెట్టించాడు! ఇంత తింటే 108 కాదు కదా కనీసం ఆ 11 ప్రదక్షిణాలు కూడా చెయ్యలేవని నేను మొత్తుకుంటున్నా వినకుండా భారీగా లాగించేసాడు. భోజనం అయ్యాక వెంటనే నా ఫ్రెండ్ కారులో చిలుకూరు మధ్యాన్నం 3 గంటలకి చేరాము.
బాగా మబ్బులు కమ్మి ఏ క్షణం అయినా వాన పడేట్టుగా ఉంది వాతావరణం. విచిత్రంగా రెండే రెండు కార్లు, ఒక ఇరవై, ముప్ఫై బైకులు మాత్రమే ఉన్నాయి. నాకు బోల్డు హాశ్చర్యం వేసేసింది. నేనెప్పుడు చిలుకూరు వెళ్ళినా చాలామంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. కాని ఇవాళ మా అదృష్టం చాలా తక్కువ మంది ఉన్నారు. సరే గుళ్ళోకి వెళ్లి చూసినా అదే పరిస్తితి. ఒక వంద, లేక నూట యాభైమంది ఉంటారేమో. అందరూ యధావిధిగా ఎవరో తరుముతున్నట్టు ప్రదక్షిణాలు పరిగెడుతూ చేస్తున్నారు. నా ఫ్రెండ్ వెంటనే ప్రదక్షిణాలు మొదలెట్టాడు. నేను కేవలం మూడు ప్రదక్షిణాలు చేసాక పాదం నొప్పి మొదలయ్యింది. అంతకు ముందు వారం నించి ఉంది ఆ నొప్పి! ఇక చేసేది లేక సైడ్ ఉన్న వసారాలో కూర్చున్నాను. భక్తుల పరుగుపందెం చూస్తూ!
ఒక అయిదు నిమిషాలకి ఒక అనౌన్స్మెంట్ వినిపించింది. ప్రసాదం భక్తులకి ఇవ్వడానికి ఎవరైనా వాలంటీర్స్ కావాలని.. నేను వెంటనే చెంగున ఒక్క గెంతులో ప్రసాదం దగ్గరకి వెళ్లాను. అక్కడ ఒక పాతికేళ్ళ అబ్బాయి ఉన్నాడు. నేను వాలంటీర్‌గా ఉంటానన్నాను. అతను ఒక అరగంట ఉంటె చాలు సార్! నేను పొద్దుటినించీ ఉన్నాను. రాత్రి దాక ఉంటాను. కాస్త బ్రేక్ కావాలి అన్నాడు. నేను "దానికేం భాగ్యం! హాయిగా రెస్త్ తీసుకోండి. నేను గంట అయినా ఉంటాను" అని చెప్పాను.
అతను నాకు ఆ పటికబెల్లం ప్రసాదం, వాక్ మాసపత్రిక కాపీలు (అమ్మడానికి!) అప్పచెప్పి వెళ్ళిపోయాడు. నేను అక్కడ నిలబడి భక్తుల రాక కోసం చూస్తూ ఉండిపోయాను. ఎక్కువ మంది లేరని చెప్పానుగా, అందుకని అప్పుడప్పుడూ ఒకరిద్దరు లోపల దర్శనం చేసుకొని రావడం, నేను ప్రసాదం భారీగా ఇవ్వడం, వీలుంటే, వాళ్ళు కావాలంటే వాక్ పుస్తకం అమ్మడం చెయ్యడం మొదలెట్టా. కాసీపయ్యాక నాకు ఒక ఐడియా వచ్చింది. ఇలా భక్తులకి, భక్తులకి మధ్య చాల సమయం ఉంటోంది కదా నేనిక్కడ ఎందుకు అనవసరంగా నిలపడడం! అని. వెంటనే గర్భగుడిలోకి వెళ్ళిపోయి స్వామి వారిని చూస్తూ అక్కడే నిలపడిపోయాను. కాస్సేపయ్యాక ఇంకో భక్తబృందం లోపలి రాగానే నేను మళ్ళీ నా యధాస్థానం దగ్గరకి వెళ్లి నిలపడడం, వాళ్ళు బైటికి రాగానే ప్రసాదం ఇచ్చేసి, మళ్ళీ తుర్రుమని గర్భగుడిలోకి దూసుకు పోవడం!! ఇలా దాదాపుగా ఒక 45 నిమిషాలు ఈ నా "ప్రత్యేక దర్శనం" కార్యక్రమం జరిగింది. ఆ రోజు ఏదో ప్రత్యెక దినం కూడా అందుకని స్వామి వారిని బాగా అలంకరించారు! ఇక చూడండి నా ఆనందం! అలా అనుకోకుండా ఒక అరగంట నాకు దర్శనం దొరికింది.
(నేనొకప్పుడు సేల్స్ ఉద్యోగాలు చేసాను కాబట్టి ఆ కాస్త సమయంలో, పాత రోజులు గుర్తుతెచ్చుకుని, రెట్టించిన ఉత్సాహంతో చాల వాక్ మాసపత్రికలు అమ్మాను!!)
నేను ఇంటికొచ్చాక నా భార్యతో ఈ విషయం చెప్పగానే తను వెంటనే నాకు ఇంతకుముందు వచ్చిన "తిరుమల ప్రత్యెక దర్శనం" కల గుర్తు చేసింది. బహుశా నమ్మ శక్యం కాక పోవచ్చు కాని ఆమె చెప్పేదాక నాకు ఆ కల గుర్తురాలేదు!! వెంటనే నాకు మరొక్క సారి వర్ణనాతీతమైన ఆనందం, అనుభూతి కలిగాయి. ఆ విధంగా హెడ్ ఆఫీసు (తిరుమల) ప్రత్యెక దర్శనం కల బ్రాంచ్ ఆఫీసు (చిల్కూర్) లో తీరింది. నా కల నిజమయ్యింది ;)
ఇలా కల నిజమవ్వడానికి ముందో, తర్వాతో గుర్తు లేదు కాని, ఒకసారి తాడ్‌బండ్ ఆంజనేయ స్వామి గుడికి వెళ్లాను. అక్కడ దర్శనం అయ్యాక గుడి వెనక వేపు ద్వారం గుండా బైటికి వచ్చి, అక్కడ ఇచ్చే తీర్థ ప్రసాదాలు తీసుకొని గుడి పక్క కాంపౌండ్ లో వాహన పూజలు చేసే చోట నిలపడి ప్రసాదం తినడం మొదలెట్టాను. ఆ వాహన పూజకి వచ్చిన కొత్త, పాత కార్లు చూస్తూ. ఇంతలో సడన్ గా ఆ వాహన పూజలు చేసే పూజారిని చూడగానే నాకు వెంటనే ఆనందం వేసింది. ఎందుకంటే నా కలలో తిరుమల గుడిలో ఉన్న పూజారి ఈయనే!! నేను వెంటనే ఆయన చెట్టు కింద కూర్చొని ఇంకా వచ్చే కార్లకోసం ఎదురు చూస్తూంటే వెళ్లి వెంటనే నాకొచ్చిన కల సంగతి చెప్పాను. ఆయన వెంటనే అలా మీకు కలలో కనిపించింది నేను కాదు. నా రూపంలో హనుమంతులవారు! ఆ స్వామి వారు ఎవరికీ తన నిజస్వరూపంలో కలలో నైనా కనిపించరు. ఎవరో ఒకరి రూపంలో దర్శనం ఇస్తారు అని చెప్పారు. ఇది ఇంకో అద్భుతం! ఆయన వెంటనే మీకేమైనా వేంకటేశ్వర స్వామి వారికి బకాయీలు, మొక్కులు ఉంటే అవి తీర్చేయ్యండి అని ఒక సలహా ఇచ్చారు. బాకీలు అయితే బాగానే ఉన్నాయి కాని ఇప్పుడు తీర్చగలిగే పరిస్తితి లేదని ఒక వెర్రి నవ్వు నవ్వాను. ఆ పూజారి అయితే కనీసం ఏదైనా గుళ్ళో స్వామి వారి కళ్యాణం, అర్చన ఏదో ఒక సేవ చేయించండి అని చెప్ప్పారు. అలాగే చేసాను.
ఫుట్‌నోట్: ఇలా నా కల నిజమయ్యిందని నేనేదో దేవుడికి బాగా దగ్గర అని పొరపాటు పడకండి !!1998 లో అనుకుంటా చిలుకూరు గుడికి మొదటిసారి వెళ్ళాను. అప్పటినుంచి బహుశా ఒక డజన్ సార్లు వెళ్ళాను. అన్ని సార్లు ఒకటే కోరిక కోరుకున్నా! కాని ఇప్పటిదాక తీరలేదు :(
చాలాసార్లు నేను ఏ గుడికైనా వెళ్తే ఆ గుడి తలుపులు మూసేసిన సందర్భాలు కోకొల్లలు! నిన్న కూడా అదే అయ్యింది. ఒక 35 కిలోమీటర్స్ వెళ్ళాను. కాని 11-30 కే గుడి మూసేసారు:(
నా భక్తి లోపం అని మీరంటారని నాకు తెలుసు ;)