నేను స్కూల్లో చదివేటప్పుడు, అంటే మూగమనసులు సినిమా ఫస్ట్ సీన్లో
ముసలాయన అన్నట్టు "ఎప్పటి కథ బాబు?", 60's లో వినాయకచవితి ముందు రోజు
మధ్యాన్నం స్కూల్ సెలవిచ్చేసేవాళ్ళు. అంతే వెంటనే అబ్బాయిలందరం ఊరి మీద
పడి, కనిపించిన ప్రతి మొక్క, చెట్టు విచక్షణ లేకుండా పీకేసి, ఇంక మొయ్యలేము
అనుకున్నప్పుడు ఇంటికెళ్ళి, సంజీవిని పర్వతం పెకిలించి తీసుకొచ్చిన
హనుమంతుడి లాగ (హనుమంతుల వారు ఖచ్చితంగా మా అంత పోజు పెట్టి ఉండక పోవచ్చు!)
పెద్ద పోజు ఇచ్చేవాళ్ళం! ఆ రోజుల్లో ఇప్పటిలాగా విరివిగా కెమెరాలు లేవు
కాబట్టి ఆ "సెల్ఫీ"లు అన్నీ నా హృదయంలోనే ఉండిపోయాయి. మన మనసులో ఉన్నది
ప్రింట్ చేసే రోజు త్వరలోనే వస్తుందని నా ఊహ! ఆశ! అప్పుడు ఆ "సెల్ఫీ"
ప్రింట్ తీసి పోస్ట్ చేస్తాను.;)
ఆ తర్వాత వినాయక చవితి రోజు, ఇద్దరు అక్కలు, నేను ఒక తమ్ముడు పాలవెల్లి కట్టడం, మా చేతనైనంత దాన్ని అలంకరించడం షరా మామూలే! పిల్లలం కదా? పూజకంటే ప్రసాదం మీదే ధ్యాస ఎక్కువ ఉండేది. కాని పిల్లల్ని దేవుడు ఇలాంటి విషయాల్లో తప్పు పట్టడు. ఇలాంటి విషయాలేంటి, ఎలాంటి విషయాల్లోనూ పిల్లల్ని దేవుడు అపార్థం చేసుకోడు. ఎందుకంటే "పిల్లలూ, దేవుడూ చల్లని వారే! కల్లాకపట మెరుగని కరుణామయులే" అన్న పాట మీ అందరికీ గుర్తుండే ఉంటుంది!!
ఈ రోజుల్లో కరివేపాకు, కొత్తిమీర దగ్గర నించీ అన్నీ కొనుక్కోవడమే! ఇక వినాయకుడి పూజకి పత్రీ సంగతి చెప్పనఖ్ఖరలేదు. ఆ సరదాలు అన్నీ "హుష్ కాకి" :(
నాకందుకే అప్పుడప్పుడూ "ఏంటో గురూ? ఆ రోజులే వేరు" అని వేటగాడు సినిమాలో రాజబాబు లాగ ఒక పెద్ద నిట్టూర్పు వదలాలనిపిస్తూంటుంది:(
ఇంకా రాద్దామని ఉంది కాని ఇప్పుడు వెళ్లి రేపటి పూజకి పత్రీ కొనుక్కు రావాలి కదా? అందుకని ఇప్పటికి శెలవు!

No comments:
Post a Comment