Monday, September 21, 2015

Money Plant!!!

టమాటో మొక్కలకి టమాటోలు, బెండ మొక్కకి బెండకాయలు, వంకాయ మొక్కకి వంకాయలు కాసినట్టే మనీ ప్లాంట్ కి డబ్బులు  కాస్తాయని నమ్మాను. ఎందుకంటే నేను తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్ళు అని నమ్మే టైపు! ఘోరంగా మోసపోయాను. రోజూ బోల్డు నీళ్ళు పోసి (అది కూడా డబ్బు పోసి కొన్న నీళ్ళు! ఎలాగో రేపో ఎల్లుండో డబ్బులు కాస్తాయి కదా గుబురు గుబురుగా అని పెట్టుబడి పెట్టాను!) ఎంతో ప్రేమగా పెంచాను. విస్తరాకులంత ఆకులు పెరుగుతూంటే, కాయబోయే డబ్బులకి విస్తరేసుకొని కూర్చున్నాను.

అంతా వృధా! మహాకవి శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పారు "ముందు దగా వెనక దగా! కుడి ఎడమల దగా దగా!!" అని. పెద్దల మాటలు వినకపోతే ఏమవుతుందో మరొక్కసారి తెలిసింది.  ఆ మనీ ప్లాంట్ పీకి బైట పారేసాను. అదృష్ట వశాత్తు నాకేమి ఆకాశవాణి "మొక్కే కదా అని పీకితే....  .."  అని ఏమీ వినిపించలేదు ;) లేకపోతే డబ్బూ పాయె, శని పట్టే అన్నట్టయ్యేది నా పరిస్థితి! బ్రతికిపోయాను.

చేతికి అంది వస్తుందనుకున్నది చెయ్యి జారి పోతే నేనయితే ఈ మనస్తాపం తట్టుకున్నాను కాని ఇంకెవరయినా అయితే?!

No comments:

Post a Comment