Friday, January 23, 2015

Kids and Castor Oil in Telugu

నా చిన్నప్పుడు అంటే 60'లో చిన్న పిల్లకి, చిన్న పిల్లల్ని చేసి, మూడు నెలలకో, అర్నెల్లకొ (చిన్న పిల్లాడ్ని కదా సరిగ్గా లెక్కలు రావు, గుర్తు లేదు!) ఆముదం పట్టేవాళ్ళు. 

అదొక చిన్న ప్రహశనం లాగ జరిగేది. నన్ను చిన్న పిల్లాడ్ని కాబట్టి తేలిగ్గా మాయచేసి పట్టేవాళ్ళు. కాని రాను రాను నాకు తెలివితేటలు బాగా ఎక్కువయ్యి వాళ్ళ "ప్రయత్నాలు" పసి గట్టి వాళ్ళకి దొరక్కుండా దూరం దూరంగా తిరిగేవాడిని. ఇంక లాభం లేక వాళ్ళు నా వెనకాల ఆముదం సీసాతో పరిగెత్తే వాళ్ళు. నేను ముందు. వాళ్ళు వెనక. కాని చిన్నపిల్లలం ఎంత సేపు పరిగెడతాం. పైగా పెద్దవాళ్ళు వాళ్ళ దెబ్బలాటలు, గొడవలు అన్నీ మర్చిపోయి ఇలాంటి విషయాల్లో అందరూ ఒకటయ్యిపోయి "joint operation" చేసేవాళ్ళు. అందుకని కూడా పిల్లలు చాల తేలిగ్గా దోరికిపోయేవాళ్ళు.  దొరికిపోయాక ఇంకేముంది. అందరికీ తెలిసిన భాగోతమే.  గట్టిగా కాళ్ళు చేతులు పట్టేసుకొని ముక్కు మూసేసి నోట్లో ఆముదం పోసేసేవాళ్ళు. అంతే. ఆ తర్వాత మనం ఒక్కళ్ళమే పరిగెట్టడం. ఎక్కడికో చెప్పనఖ్ఖరలేదుగా?!. విజ్ఞులైన వయసొచ్చిన చదువరులకి విదితమే:)

ఇంతకీ ఇప్పుడు చెప్పొచ్చేదేమిటంటే, కాదు అడిగేది ఏమిటంటే, ఇలా "అంతః శుద్ది" చేసుకొని కొన్ని దశాబ్దాలు అవుతోంది. ఇవాళ్టి రోజుల్లో ఆ ఆముదానికి తగిన ప్రత్యాన్యాయం ఏమయినా ఆముదం కాకుండా ఉందా? ఏమన్నా చిట్కాలు, టాబ్లెట్స్ వగైరా!!


No comments:

Post a Comment