Saturday, August 3, 2013

భాష్ప విలాపం - తెలుగోడు



భాష్ప విలాపం 

భయంకరంగా రెచ్చిపోతున్నారు. భావోద్రేకాలు రెచ్చకొడుతున్నారు
మనసులు విరిచేశారు. మనుషుల్ని విడదీసారు.  
ద్వేషాలు నాటారు. విద్వేషాలు పెంచారు.  
నాకు లేదని ఒకడి ఏడుపు. పక్కవాడికుందని ఇంకొకడి ఏడుపు.  
వేసుకున్న విస్తరి ఎగిరిపోయిందని ఒకడు. వడ్డించిన విస్తరి లాగేసుకున్నారని ఇంకొకడు.  
పక్కింటి వాడి మీద అనుమానం. పక్క వీధి వాడి మీద విద్వేషం.  
ఆరిపోతుందనుకుంటే రావణాసురుడి కాష్టం కాల్చేస్తోంది మొత్తం రాష్ట్రం. 
డెమోక్రసీనో, డెమన్ క్రసీనో అర్థం కాని గందరగోళం. 
గతంలో తప్పులు జరిగాయని కొంతమంది. వర్తమానంలో తప్పులు చేస్తున్నవాళ్లు ఇంకొంత మంది. 
మేము పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళని కొంతమంది. మీరు పట్టుకున్నది కుందేలే కాదని ఇంకొంతమంది. 
 సామాన్యుడి నిస్తేజం. మేధావుల నిశ్శబ్దం. 
ఎప్పుడో వేసిన మూడుముళ్ళు. పీటముడి అయ్యిందని ఒక వర్గం. జారుముడి కాదని ఇంకొక వర్గం 
వర్తమానం అస్తవ్యస్తం. భవిష్యత్తు అయోమయం. 
జటిల ప్రశ్నలకి కుటిల పరిష్కారాలు. 
ఎవరు వింటారు మా గోడు. అని అలమటిస్తున్నాడు తెలుగోడు. 
దేశమంటే మట్టి కాదోయ్! ఆంధ్ర ప్రదేశమంటే మనుషులోయ్!!

No comments:

Post a Comment