ఎనిమిదవుతోంది. లేవవే తల్లీ. నాకు వంట సాయం సంగతి దేవుడెరుగు. కనీసం తొందరగా స్నానం చేసి వినాయకుడి పూజకి పాలవెల్లి గట్రా కట్టచ్చుగా
అబ్బా లేస్తానుండవే
ఉంటానే ఉంటాను. అయినా నిన్ను కాదు అదిగో మీ నాన్నననాలి! నా బుజ్జి తల్లి. నా బంగారు కొండ అని నిన్ను చిన్నప్పటినుంచి ముద్దు చేసి గారాబం చేశారు చూడు. ఆయనదే తప్పు. నువ్ పడుకో తల్లీ. నేనున్నానుగా. గుమ్మటంలా. నే చేసుకుంటాలే. నువ్వు హాయిగా బజ్జో పదింటిదాకా.
దాన్ని వదిలెయ్యవే. శుభ్రంగా ఉద్యోగం చేస్తోంది. రేపు ఎలాగూ పెళ్లయ్యాక నీకంటే ఎక్కువే పని చేసుకోవాలి. ఇప్పుడయినా సుఖపడనియ్.
అట్లాగే వెనకేసుకు రండి. ఏం నేనేమన్నాఉద్యోగం చేయనిస్తే చెయ్యనన్నానా? నేను పాస్ అయ్యా ఎమ్ కామ్. ఏం సుఖం ఇలా ఇంట్లో కామ్ గా పడుండాల్సి వచ్చింది. నాకేమన్నా ఛాయిస్సా. వాయిస్సా.
ఒరిస్సా వేపు వెళ్తున్న వాయుగుండం గబుక్కున 180 డిగ్రీలు వెనక్కి తిరిగి కేరళ వేపు వచ్చినట్టు కూతురునుంచి తన మీదకి ఇలా బోఫోర్స్ గన్ ఎక్కు పెట్టింది ఏమిటని పాపం ఆ మొగుడుగారు విలవిలా విలపించింగ్!
అమ్మా కాఫీ!
లేచావా తల్లీ. రా. కాఫీ తాగాక మళ్ళీ ఆ వెధవ ఫోన్ పట్టుకు కూర్చోకుండా వెంటనే తలంటు పోసుకుంటే బాగుంటుంది. అసలే ఇంకో గంటలో దుర్ముహూర్తం వచ్చేస్తోంది.
నన్ను కాఫీ తాగనిస్తావా ప్రశాంతంగా? స్నానం ఎంతసేపు. చిటికెలో చేసొచ్చేస్తా. నువ్వేం వర్రీ అవ్వకు.
వర్రీ నేనెందుకు అవుతా. రేప్పొద్దున్న నిన్ను కట్టుకునే వాడు అవ్వాలి వర్రీ.
అబ్బా ఆలూ లేదూ చూలూ లేదూ . ఎప్పుడో అయ్యే పెళ్లి తర్వాత నా మొగుడు వర్రీ అవుతాడని నువ్వు ఇప్పటినించీ వర్రీ అవడం ఏమిటి. మా తిప్పలు మేం పడతాంలే. నువ్వు ముందు ఆ మహా నైవేద్యం సంగతి చూడు. అన్నీ చేస్తే కానీ పూజ మొదలెట్టనివ్వవు. దేవుడికి ముందు ఒక ప్రసాదం చేసేసి పూజయ్యాక చేసుకోవచ్చుగా మిగతా వంట.
ఇదిగో చూడు. మీ తరానికయితే పూజ పునస్కారాలు నామ్ కె వాస్తే. నన్ను ఇలా వదిలేయి. ఇన్నేళ్ళుగా చేసుకుంటున్నా. ఇప్పుడు చెయ్యలేనా ఏమిటి.
అన్నట్టు స్నానం అయ్యాక నీ బట్టలన్నీ అలా బెడ్ రూంలో నేలమీద పడెయ్యకు రోజూలా. తీసుకెళ్లి బైట బాల్కనీ లో పడేయ్. అలాగే నీ తమ్ములుంగారి బట్టలు కూడా. వాడు ఓ రాజకుమారుడిలాగా అన్నీ ఎక్కడ పడితే అక్కడే పడేయడం. వాడి పెళ్లయ్యాక వాడి పెళ్ళాం ఎలా భరిస్తుందో చూడాలి.
నా మొగుడి సంగతయ్యింది. ఇప్పుడు వాడి రాబోయే పెళ్ళాం సంగతి అవసరమా. అయినా మీ పెద్దోళ్లున్నారే మాటిమాటికీ మా పెళ్లి ఊసే ఇంకో మేటర్ ఏమీ లేనట్టు.
ఏ వయసులో ముచ్చట ఆ వయసులో అన్నారు. నీ వయసుకి నాకు మీ ఇద్దరూ పుట్టారు తెలుసా?
ఎందుకు తెలీదు. శుభ్రంగా తెలుసు. పాతికేళ్ళు రాకుండానే ఇద్దరినీ కనేసి హాయిగా ఇంటికే అంకితం అయిపోయావ్.
శిష్యా! ఈ ఇంటింటి రామాయణం అనంతంగా ఇలా సాగుతూనే ఉంటుంది

No comments:
Post a Comment