కొరోనా సైడ్ ఎఫెక్ట్: గత మూడు నాలుగు నెలలుగా ముందస్తుగా బైటికి వెళ్లడం బాగా తగ్గించి, ఇంకా తగ్గించి ఇప్పుడు గత నెల్లాళ్లుగా కనీసం ఇంటి గేట్ దాటి బైటికి ఒక్క అడుగు కూడా వెయ్యకుండా కాలం గడిపేస్తూంటే ..... ఏమయ్యిందో తెలియాలంటే చదవండి
మూడు రోజుల క్రితం కాళ్ళు నీరసంగా అనిపించాయి ! ఇదేటిది ఒక్కో శరీరంలో ఒక్కో భాగం నీరసంగా కూడా ఉంటుందా అంటే ఉంటుంది. ఏం ఒక్కో భాగం నొప్పెట్టటం లేదా... తల నొప్పి, కడుపు నొప్పి, గుండె నొప్పి! అలా ఒక్కో భాగం కూడా నీరసంగా ఉంటుంది. మీరు గ్రహిస్తే! నేను సూక్ష్మగ్రాహిని కాబట్టి ఇట్టే పసికట్టేసా. కేవలం కాళ్లే నీరసంగా ఉన్నాయని.
వెంటనే మనమందరం పెద్ద విశ్లేషకులం కదా? నా వంతు మానవ ప్రయత్నంగా భారీ ఎనాలిసిస్ చేసేసా ఇలా ఒక్క కాళ్లే ఎందుకు నీరసంగా ఉన్నాయని. నా ఎనాలిసిస్లో బైట పడింది ఏమిటంటే నేను ప్రతి రోజూ ఓ గంట నడుస్తాను. ఒకప్పుడు ఆదివారం సెలవిచ్చేవాడిని. తరుచుగా వారం మధ్యలో ఇంకో రోజు కూడా ఏదో ఒక వంకతో! కానీ ఈ హౌస్ అరెస్ట్ తో ఏమి తోచక నెలలో అధమపక్షం 29 రోజులు విపరీతంగా నడిచేస్తున్నా.
ఇంకో కారణం: ఇంతముందు మూడ్ వచ్చినప్పుడు వంట చేసేవాడిని. ఈ అయిదు నెలలుగా ఏమి తోచక దాదాపు నెలలో 28 రోజులు వంట చేసి పారేస్తున్నా. దానికి నీరసానికి ఏమిటి లింక్ అంటే వస్తున్నా ...
నేను అసలే భోజన ప్రియుడిని. మరిహ నాకు వచ్చినవి నచ్చినవి మొదట రెండు నెలలు అతిగా అమితంగా తిన్నా! తరువాత్తరువాత ఏమయ్యిందంటే వంట చేయడంలో ఉన్న ప్రేమ తినడంలో తగ్గడం మొదలయ్యింది. ఎందుకంటే రోజులో కనీసం రెండు మూడు గంటలు వంటింట్లో తిండి (తయారీ) మధ్య గడపడంతో తిండి మీద వ్యామోహం తగ్గింది. అందుకని ఒక రెండు నెలలుగా తిండి చాలా చాలా తగ్గించేసాను.
ఈ రెండు కారణాలుగా కాళ్ళకి నీరసం మొదలయ్యింది. మొదటిరోజు పట్టించుకోలేదు. రెండు రోజుల క్రితం నీరసం ఇంకొన్ని భాగాలకు పాకింది! ఊహూ. అప్పుడూ పట్టించుకోలేదు. కానీ నిన్న మొత్తం ఒళ్ళంతా నీరసమే! రోజంతా! అయినా నడక, వంట వగైరా కార్యక్రమాలు మానలేదు. పైపెచ్చు అప్పుడప్పుడూ నాక్కూడా కుంచం బిజినెస్ పనులుంటాయి. నా దురదృష్టం నిన్న అవి చాలా ఎక్కువ చేయాల్సి వచ్చింది. ఇది అగ్నికి ఆజ్యం పోసినట్టయింది.
కానీ నా ఎనాలిసిస్ అంతటితో ఆపలేదు. ఎందుకంటే నేను క్రిటికల్ థింకింగ్, డీప్ థింకింగ్ కి అలవాటు పడ్డవాడిని. ఆ రెండింటికీ తేడా అడక్కండి. అడిగితె నేనిప్పుడు చాలా డీప్ గా క్రిటికల్ గా థింకాలి!
సరే అలవాటు ప్రకారం ఒకింత ముందుకి అంటే ఒకింత లోతుగా ఆలోచించా. నాదసలే స్ట్రాంగ్ బాడీ కదా? ఇలా నడక, వంట, వ్యాపారాలకి నీరసపడిపోడానికి వీళ్ళేదే? ఎక్కడుంది లోపం? అని ఆలోచించగా, చించగా తట్టింది. స్ట్రాంగ్ బాడీనే కాదు స్ట్రాంగ్ మైండ్ కూడా కదా?
అదేమిటంటే ఈ గృహనిర్బంధానికి అస్సలు ఎండ కన్నెరగకుండా రాజకుమారిలా అంతఃపురానికే అంకితం అయిపోయా కాబట్టి సూర్యరశ్మి సోకక డి విటమిన్ భారీ ఎత్తున తగ్గిపోయింది జీవితంలో మొట్టమొదటిసారిగా!
ఇలా డి విటమిన్ లోపిస్తుంది ఇళ్లకే పరిమితమైతే కూసింత ఎండలో అమెరికా వాళ్ళలాగా రోజూ కాసేపు సన్ బాత్ చేయండని ఒక్కడంటే ఒక్కడు కనీసం ఆ ఆరోగ్య సంస్థ కూడా చెప్పలేదు. చెప్పినా నా చెవిన పడలేదు. ఇన్ని వాట్సాప్ ఫార్వార్డులు వచ్చినా!
మరంచేత ఇవాళ్టినించి రోజూ సాయంత్రం ఓ పది నిమిషాలు ఎండలో ఎండుదామని నిర్ణయించాను.
ఫుట్ నోట్: మీలో ఎవరికైనా కూడా ఇలాంటి అనుభవం ఎదురయ్యిందా? అంటే ఇంట్లో ఉన్నా నీరసపడిపోవడం. ఉంటే చెప్పండి. ఎందుకడుగుతున్నానంటే మీకు తెలీనిదేముంది? మనింట్లో కరెంటు పోయిన వెంటనే పక్కింట్లో కూడా పోయిందో లేదో చూస్తాం కదా? వాళ్ళక్కూడా పోతే అదో (పైశాచిక) ఆనందం! తుత్తి! అందుకనన్న మాట!
ఫుట్ నోట్ 2: ఎండలో ఉండడానికి నిర్ణయించా కానీ నడక, వంట వగైరా మానలేదు. ఇప్పుడే అవన్నీ ముగించి ఎంత నీరసంగా ఉన్నా కూడా ఇది రాస్తున్నా. ఎందుకు మాస్టారూ హాయిగా రెస్ట్ తీసుకోక అనకండి. ఎందుకంటే రెండు కారణాలు
అ: నేను పుట్టిందే లోకకల్యాణం కోసం. ఇలా నీరసంగా ఉందని విశ్రాంతి తీసుకుంటే బోల్డు కల్యాణాలు ఆగిపోతాయి పీటలమీదే!
ఆ: ఇంకో లోపాయికారీ విషయం. ఎప్పటికైనా ఎవరైనా నా జీవిత చరిత్ర రాసే అవకాశాలు భారీ ఎత్తున కనిపిస్తున్నాయి. ఒక వేళ అలా రాయని పక్షంలో నేనే రాసేసుకుంటా స్వీయ చరిత్ర! లేపోతే ఇంకోడెవడిదైనా కలం పేరు పెట్టేస్తా. జీవిత చరిత్రకి ఇప్పటి నీరసానికి ఏమిటి లింకని మీరడిగేలోపలే నేనే చెప్పేస్తా సమాధానం
ఇలా జీవిత చరిత్ర పుస్తకాల్లో ప్రతి అధ్యాయం చివర మిగిలిపోయిన ఖాళీలో, లేదా ఖాళీ చేసి ఓ బాక్స్ లో చిన్ని చిన్ని సంఘటనలు రాస్తూంటారు కదా? అంటే అనిల్ కుంబ్లే కి దవడ ఫ్రాక్చర్ అయినా కట్టు కట్టుకుని టెస్ట్ మ్యాచ్ ఆడాడని, సచిన్ బోల్డు జ్వరంతో ఆడాడని. అలా. నేను కూడా భారీ నీరసంతో కూడా లోక కళ్యాణం కోసం రెస్ట్ తీసుకోకుండా భారీగా పనులు చేశానని అలా అధ్యాయాల చివర రాయడం కోసం బోల్డు సంఘటనలు సృష్టిస్తున్నా! ఇప్పటికే సృష్టించా కూడా! ఇహ అధ్యయాలు తయారవడమే బాకీ