మొన్నీ మధ్య మన కోస్తా ఫుడ్స్ వాళ్ళ కొత్తావకాయ తెప్పించా. ఈ వయసులో తినడమే కానీ ఆవకాయ పెట్టె ఓపిక లేదు కదా .
చాలా రోజులనించీ అనుకుంటున్నా, నిన్న తీరిక దొరికి నా స్వహస్తాలతో నువ్వులపొడి చేశా.. మా విసాపట్నం వాళ్ళం నూలుగుండ/ నువ్వులగుండ అంటాం దీన్ని
ఇవాళ ఆదోరం కదా కాస్త తీరిగ్గా భోంచేస్తూ కొత్తావకాయ, నూలుగుండ రెండూ కలిపి అన్నంలో కలిపి ఒక్క రవ్వ (నిజం చెప్పాలంటే రెండు మూడు రవ్వలు ) ఆవు నెయ్యి తగిలించి తిన్నా. అయినా మీ పిచ్చి కానీ అలా ఆవకాయా, నూలుగుండా కలిపి తింటారా ఎవరైనా హవ్వ అని బుగ్గలు నొక్కుకోకండి. నా బోంట్లుండబట్టే మీ బోంట్లకి పెసరట్టుప్మా, పెరుగు వడా వగైరా వగైరా మహాద్భుతాలు తెలిసాయి. అయినా సిరివెన్నెలగారన్నారుగా "ఎవరో ఒకరు. ఎపుడో అపుడు. తినరా ముందుగా అదీ ఇదీ కలియగలిపి" అని. మీరసలు నాకు బోల్డు థాంక్స్ చెప్పాలి. ఇలాంటి స్వర్గ రహస్యాలు మీకింత వీజీగా చెప్పేస్తునందుకు
నిజం చెప్పాలంటే గిసుంటి సీక్రెట్స్ నాకాన శానా ఉన్నాయ్ . అల్లం పచ్చడి , గోంగూర పచ్చడి (అంగూర!), గోంగూర, చింతకాయల (గోచి!) చింతకాయ టమాటో (చిమాటో)... హిలా చాలా డెడ్లీ కాంబోస్. ఇంకా ఉన్నాయి కానీ నన్ను మంచి చేసుకుంటేనే చెప్తా
ఇంకేముంది అందరూ అంటూంటారే స్వర్గానికి బెత్తెడు దూరం అని.... బెత్తెడు లేదు. జాన లేదు. ఆ రెండూ కలిపి తింటే డైరెక్ట్ గా స్వర్గం తలుపుల దగ్గర తేలా. తేరిపార చూస్తే తలుపులు మూసేసున్నాయి. అటూ ఇటూ చూస్తే ఓ గుళ్లో గంటలాంటిది కనిపించింది. అది కాలింగ్ బెల్ అనుకుంటా! అనుకోవడం అలీసం మరిహనేం. గణగణమని వాయించి పారేసా. ఎలాగు ఇంతదూరం వచ్చాం కదా స్వర్గంలో ఓ రెండు గంటలు ఏమన్నా కండెక్టడ్ టూర్ ఉంటె ఓ లుక్కేసి పొతే ఓ పనయ్యిపోతుంది. ఇంతింత దూరం రోజూ రాలేం కదా?
ఓ రెణ్ణిమిషాలకి ఓ పొడుగాటి మడిసి తలుపు తీసి 1 టు 2 లంచవర్! ఓ గంటాగాలి అన్నాడు. వార్నీ. ఏదో పోన్లే పాపం ఇంత దూరం వచ్చా కదా అసలీ స్వర్గం అనేది మనం పోయాక వర్త్ గోయింగా అని సూద్దారంటే గంటాగమంటాడేటి? వాళ్లకయితే ఈ స్వర్గంలో బొత్తిగా పనులుండవు. మనకలాక్కాదే. బోల్డు యవ్వారాలాయె. సర్లే ఇంకోపాలి ఇటొచ్చినప్పుడు సూద్దారని ఎల్లిపొచ్చేసా
సో ఫైనలాఖరికి నే సెప్పేదేటంటే మీరు కూడా స్వర్గం చూడాలనుకుంటే కొత్తావకాయ+నూలుగుండ డెడ్లీ కాంబో తినండి. ముందస్తు వార్నింగ్. కాస్త ఎర్లీ గా భోంచేస్తే లంచ్ అవర్ కంటే ముందెళ్తే నాలాక్కాకుండా మీరు స్వర్గం ఫ్రీగా చూసొచ్చేయచ్చు. అక్కడి విశేషాలు ఇక్కడ పోస్ట్ చేయడం మర్చిపోకండి.
NB: ఆవకాయ ఫోటో కోస్తా ఫుడ్స్ వారి పేజీ నించి తస్కరించడమైనది. నువ్వులపొడి నేను చేసిందే

వీలైనంత త్వరలో నా స్వర్గ ప్రయాణ విశేషాలు చెప్తాను గురూజీ
ReplyDeleteReally ,,,😋
ReplyDelete