పూర్వం పురాణాల్లో చాల కథల్లో ఎవరైనా ఋషులకికాని, దేవుళ్ళకికాని బాగా కోపం తెప్పిస్తే వెంటనే వాళ్ళు అలా కోపం తెప్పించిన వాళ్ళని శపించేవాళ్ళు! దాంతో ఆ శాపగ్రస్తులు వెంటనే వాళ్ళని క్షమాభిక్ష కోసం స్తుతిస్తే శపించినవాళ్ళు శాంతించి వెంటనే శాపవిమోచనం చెప్పేవాళ్ళు. ఇక్కడ ఒక "చమత్కారం" ఏమిటంటే ఆ శాపగ్రస్తులందరూ వాళ్ళ శాపవిమోచనం అయ్యిన వెంటనే "మోక్షం" పొందేసేవాళ్ళు! అంటే ఇక No పునరపి జననం. No పునరపి మరణం!
దీన్ని బట్టి నాకర్థం అయ్యింది ఏమిటంటే ఎవరికైనా ఇంకా బోల్డు బోల్డు జన్మలు ఎత్తకుండా సులభంగా సరాసరి మోక్షం పొందాలంటే చాల సులభమార్గం ఏమిటంటే ఎవరైనా ఋషులకికాని దేవుళ్ళకి కాని అర్జెంటుగా విపరీతమైన కోపం తెప్పించేయ్యడమే! మోక్షం తధ్యం :)
నోట్: ఇది నేను కేవలం సరదాకి రాసింది! నన్ను అపార్థం చేసుకొని ఇక్కడ ఋషులు ఎవరైనా ఉంటె వాళ్ళు నన్ని శపించవద్దని ముందస్తు మనవి! నాకింకా చాల జన్మలు ఎత్తాలని ఉంది...ఇంకా తీరని, ఈ జన్మలో తీర్చుకోలేనివి బోల్డు కోరికలున్నాయి నాకు!!!

No comments:
Post a Comment