హమ్మయ్య! నిన్నటితో కార్తీకమాసం వెళ్ళిపోయింది... ఇంక ఉపవాసాల బాధ తప్పింది. అంటే నేనేదో కార్తీకమాసమంతా విపరీతంగా ఉపవాసాలు చేసేసి శుష్కించి పోయానేమోనని భయపడకండి. నా బాధ కార్తీకమాసంలో కనీసం ఒక్క రోజైన ఉపవాసం ఉండలేదే అని!!
ఈ కార్తీకమాసమంతా అద్దంలో మొహం చూసుకోవాలంటే భయపడాల్సి వచ్చింది. నేను అద్దంలో ఇలా చూడడం ఆలస్యం అందులోంచి అంతరాత్మ ప్రశ్నల వర్షం కురిపించేది. అదెలా సాధ్యం అనే వాళ్ళంతా పాత సినిమాలు చూడ ప్రార్థన! ఆ ప్రశ్నలు ఇలా సాగేవి
ఈ నెలలో వారానికి కనీసం ఒక్క రోజు ఉపవాసం ఉండలేవా?
ఒక్క రోజు ఉండలేకపోతే అధమపక్షం ఒక్క పూట తినకుండా ఉండలేవా?
కనీసంలో కనీసం నెల మొత్తంలో ఒక్క రోజు లేక ఒక్క పూట ఉపవాసం ఉండలేవా?
ఏమయ్యింది నీ భారతీయ సంప్రదాయం?
మర్చిపోతున్నావా ఆచారం?
ఇన్ని ప్రశ్నలకి నాది ఒక్కటే సమాధానం. మౌనం! ఏమన్నా జవాబు చెప్తే మళ్ళీ సప్లిమెంటరీ ప్రశ్నలు వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకొచ్చిన గొడవ. నా అంతరాత్మేగా. కొన్నాళ్ళు అద్దంలో దాని (నా) మొహం చూడడం మానేస్తే సరి.
లోపాయికారి నేను ఉపవాసం ఉండక పోవడానికొక బలీయమైన కారణం ఉంది! అదేమిటంటే ఇటీవల ఎక్కడో చదివాను. మనం ఎప్పుడైనా ఉపవాసం ఉంటే మన మెదడుకి బోల్డు సందేహాలు వస్తాయిట. ఏమనంటే వీడు కావాలని తినలేదా లేక తిండి దొరక్క తినలేదా అని? కాని దానికి ఆ సందేహ నివృత్తి ఎలా అవుతుంది. అవ్వదు. అందుకని అదేం చేస్తుందంటే మనం తర్వాత ఎప్పుడు ఏం తిన్నా దాంట్లో అతి ఎక్కువ శాతాన్ని కొవ్వుకింద మార్చేస్తుందిట! ఎందుకంటే దానికి అనుమానం మనమీద. మనం మళ్ళీ ఇంత తొందరలో ఎమన్నా తింటామా తినమా అని? ఏమో ఇంకొన్నాళ్ళు ఏమీ తినకపోతే? అప్పుడు మనకి శక్తి ఇచ్చే బాధ్యత దానిదే అని దాని ఫీలింగ్. అందుకే ఈ ముందస్తు జాగ్రత్త పనులు. ఇంగ్లీష్ వాడు చెప్పినట్టు "సేవింగ్ ఫర్ ఏ రైనీ డే"! కాని ఆచారం, సాంప్రదాయం, భక్తి ఇవన్నీ పక్కన పెడితే ఉపవాసం చెయ్యడానికి నాకున్న మరీ ముఖ్య కారణం కనీసం ఒక 100 గ్రాములైన బరువు తగ్గుదామని. కాని ఇలా మన మెదడు తర్వాత తిన్నదాన్నంతా కొవ్వుకింద మార్చేస్తే బరువు తగ్గకపోగా బలుపు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది కదా?
కాని ఇదంతా ఆ అద్దంలో అంతరాత్మకి చెప్పాలంటే కష్టం. ఎందుకంటే నేను అలా అద్దంలో చాలాసేపు మాట్లాదేస్తూంటే చుట్టూ ఉన్న వాళ్ళకి పిచ్చి ఎక్కిపోయి నాకు పిచ్చి పట్టింది అని ఒక తప్పుడు నిర్ణయానికి వచ్చే అవకాశాలు భారీ ఎత్తున కనిపించాయి. అందుకని ఉపవాసం చేసే సంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చేసా!
కాబట్టి కాగాపోగా ఇవాళ్టి నుంచీ అద్దంలో అంతరాత్మ అదృశ్యం :) ఎంచక్కా నా ముఖారవిందం అద్దంలో నేను హాయిగా చూసుకోవచ్చు!!