నా యవ్వనం వృధా అవ్వడానికి , తదుపరి ఒకింత, ఒక్కరవ్వ నా జీవితం ఇలా ఉండడానికి కారణం నా నాన్న !
నమ్మలేని నిజం ! అసలేం జరిగిందంటే .... చెప్తా . వినండి ... అదేనండి ... సదవండ్రి
నాలుగు దశాబ్దాల పై చిలుకు సంఘటన! నేను యవ్వనంలోకి , కాలేజీ లోకి అడుగు పెట్టాను . ఈ యవ్వనంలోకి అడుగు పెట్టడం అన్నది ఎవ్వరి ప్రమేయం లేకుండా ప్రకృతి సహజంగా జరిగిందనుకోండి . కానీ ఈ కాలేజీ లోకి అడుగు పెట్టడం అన్న దగ్గరే ఆదిలోనే హంసపాదు.
మా ఊళ్ళో అంటే అప్పుడు గుంటూరులో బోల్డు కాలేజీలు ఉన్నాయి. కానీ నా నాన్న నన్ను హిందూ కాలేజీ లో తీసుకెళ్లి పడేసారు! కుర్రాణ్ణి కదా ఎదురు తిరగకుండా నోరు మూసుకొని జాయిన్ అయ్యాను. అయ్యాక తీరా చూస్తే ఏముంది? తీవ్ర నిరాశ.. ఎందుకంటే హిందూ కాలేజీ కేవలం అబ్బాయిలకే. యవ్వనంలోకి అడుగుపెట్టిన అబ్బాయికి ఇంతకంటే చిత్ర హింస ఏమన్నా ఉంటుందా చెప్పండి . ఆ కాలేజీ కి కేవలం అరకిలోమీటర్ దూరంలో AC కాలేజీ కో ఎడ్యుకేషన్. బోల్డు మంది అమ్మాయిలతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది . నన్ను ఆ కాలేజీ లో జాయిన్ చేసి ఉంటె నా చదువు చట్టబండలు అయ్యేది కాదు, నా జీవితం కేవలం హై సెకండ్ క్లాస్ కి పరిమితం అయ్యేది కాదు .
ఇహ అలా బోల్డు రోజులు నిరాశ, నిస్పృహలతో బాధపడి, భారంగా నిట్టూర్చి, ముక్కు చీదేసి, కళ్ళు తుడిచేసుకుని తదుపరి ఈ సమస్యని ఎలా పరిష్కరించాలా అని అలోచించి, ఒక భారీ నిర్ణయం తీసుకున్నాను
అదేమిటంటే రోజూ మా కాలేజీకి వెళ్లి అటెండన్స్ పలికేసి ఫస్ట్ రెండు పీరియడ్స్ కి, వెంటనే నేను నా ఆప్త మిత్రుడు చెరో సైకిల్ మీద అలా తొక్కుకుంటూ, మా అవస్థని తిట్టుకుంటూ ఆ AC కాలేజీ పక్కనే మా కాలేజీ మగ విద్యార్థుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన కేవలం అమ్మాయి కాలేజీ చుట్టూ భూమి చుట్టూ శాట్లైట్ తిరిగినట్టు అలా స్లో మోషన్ లో సైకిల్ తొక్కుతూ, అప్పుడప్పుడూ తొక్కకుండా సైకిల్ ని స్టైల్ గా ఒక చేత్తో పట్టుకుని హుందాగా నడిపిస్తూ, నడుస్తూ ఆ కాలేజీ అమ్మాయిల వేపు దొంగ చూపులు చూస్తూ రోజులు వెళ్ళబుచ్చాలని!
ఇహ అప్పటినించీ అయిదు సంవత్సరాలు అదే పని. మరి హై సెకండ్ క్లాస్ వచ్చిందంటే రాదా? అదే అమ్మాయిలున్న కాలేజీ లో పడేస్తే క్లాస్ రూంలో బల్లల్లా ఎప్పుడూ అక్కడే పడుండేవాళ్ళం కదా? అలా పడున్నప్పుడు ఒకప్పుడు కాకపొతే ఒకప్పుడైనా టెక్స్ట్ పుస్తకాలు అలా క్రీగంట అయినా చూసే వాళ్ళం కదా? అలా రోజూ క్రీగంట చూస్తే సంవత్సరానికి బోల్డు గంటలు అలా పుస్తకాల వేపు చూసి చూసి కొంత అయినా మ్యాటర్ మన బుర్రలోకి ఎక్కి ఆ హై సెకండ్ క్లాస్ కాస్త జస్ట్ అత్తెసరు ఫస్ట్ క్లాస్ గా మారుండేది కదా. అప్పుడు లైఫ్ అంతా నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నోయ్ అని చెప్పుకునే వాడిని కదా? ఇన్ని "కదా"లు కేవలం "కదా"లు గానే ఉండిపోయి నా కధ మారింది .
సరే ఎలాగూ నా యవ్వనం అడవి కాచిన వెన్నల అయిన వైనం తెలిసిపోయింది కాబట్టి ఆ "మధుర రోజులు" గురించి మరిన్ని విశేషాలు..
ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. అమ్మాయిల చూట్టూ తిరగడం అన్నది కేవలం యవ్వనంలో ఉన్న అబ్బాయిల లక్షణమే కాదు, అమ్మాయిలకి కూడా అబ్బాయిలని "కసిగా" చూడాలని ఉండేది! కాకపొతే ఆ రోజుల్లో ఇప్పుడు ఉన్నంత "స్వాతంత్రం" లేదు కాబట్టి వాళ్ళు కూడా అలా వాళ్ళ కాలేజీ చూట్టూ తిరిగే శాట్లైట్ అబ్బాయిలని దొంగ చూపులు చూసేవాళ్ళు. మేము వాళ్లలో మాకు తరుచుగా కనిపించే అమ్మాయిలకి బోల్డు పేర్లు పెట్టేవాళ్ళం. ఒక్కొక్కరికి ఒక్కో ముద్దు పేరు అన్నమాట. ఒకళ్ళని "తింగరి" అని, ఇంకోళ్ళని "మిస్ ఇన్నోసెన్స్" అని అలా. మరి వాళ్ళు మాకేం నిక్ నేమ్స్ పెట్టేవాళ్ళొ చరిత్రలో మరుగున పడిపోయిన నిజం.
ఓ సారి ఓ అమ్మాయి ఒంటరిగా చేతిలో బోల్డు బుక్స్ పట్టుకుని (ఆ రోజుల్లో అమ్మాయిలు ఎడం చెయ్యి సగానికి మడిచి పుస్తకాలు పట్టుకునేవాళ్ళు) అలా, అలా వీలయ్యినంత వయ్యారంగా నడుస్తూ వెళ్తూంటే మేము వెనకాల ఓ పదడుగుల దూరంలో (సేఫ్టీ ఫస్ట్ యు నో ) సైకిల్ నడిపించుకుంటూ వెళ్తూంటే నా ఫ్రెండ్ కి ఒకింత ధైర్యం వచ్ఛేసి, ఎందుకంటే రోడ్ అంతా ఖాళీ, చిన్నగా ఓ పాట వాడి కాకి గొంతుతో పాడడం మొదలెట్టాడు. నాకు కాళ్ళు వణకడం మొదలయ్యింది. వీడేటి ఇలా రెచ్చిపోతున్నాడని. ఆ పాట "నీ అందాల చేతులు కందేను పాపం.. ఎందుకు ఆ బెడద" అంతదాకా పాడాడో లేదో ఆ అమ్మాయి సర్రున చిరంజీవి వెనకాల వస్తున్న రౌడీలని కొట్టడానికి తిరిగినట్టు అంత ఫాస్ట్ గా తిరిగింది. నాకప్పుడు చేతులు కూడా వణకడం మొదలయ్యింది. వెనక్కి తిరిగి "ఏం మోస్తావా? రా"! అంది. ఖర్మ. మా వాడు పెట్టుకోక పెట్టుకోక ఓ ఆడ రౌడీతో పెట్టుకున్నాడు. ఈ హఠాత్ సంఘటనకి ఇద్దరం ఓ రెండు సెకండ్లు షాక్ లోకి వెళ్లి, కోమాలోకి జారే లోపలే విపత్కర పరిస్థితుల్లో బుర్ర పాదరసంలా పని చేసి, వెంటనే చిరంజీవి కంటే స్పీడు గా సైకిల్ మధ్య రాడ్ ఒక చేత్తో పట్టుకొని సైకిల్ పైకెత్తి వెనక్కి తిప్పి, రెండో సెకండ్ లో మళ్ళీ చిరంజీవి గుర్రం మీదకి ఎగిరినట్టు సైకిల్ మీదకి ఎగిరి, మూడో సెకండ్ లో సైకిల్ తొక్కడం మొదలెట్టి నాలుగో సెకండ్లో ఆ వీధి చివరికి చేరి టర్నింగ్ కొట్టి ఓ రెండు కిలో మీటర్లు తొక్కి తొక్కి అప్పటికి గుండె కొట్టుకునే స్పీడ్, ఇహ తొక్కలేక మా సైకిల్ స్పీడ్ తగ్గాక ఆగి ఓ హోటల్ లోకి వెళ్లి కూలపడి ఓ వన్ బై టు స్ట్రాంగ్ కాఫీ ఆర్డర్ చేసి అదొచ్చేలోపల నా ఫ్రెండ్ ని నాకు ఆ రోజుల్లో వఛ్చిన, విన్న అన్ని బండ బూతులు ఊపిరి పీల్చకుండా తిట్టి, తర్వాత ఆ కాఫీ తాగి మామూలు మనిషిని అయ్యాను. (చిరంజీవితో పోల్చాను కానీ ఆ రోజుల్లో చిరంజీవి కూడా అప్పుడే సినిమాల్లో అడుగు పెట్టారు!)
ఆ రోజుల్లో కుంచం ధైర్యం చేసి ఎవరన్నా అమ్మాయితో స్నేహం చేద్దామని ప్రయత్నిస్తే ఆ అమ్మాయి "ఛీ ఫో" అంటే లైట్ గా తీసుకొని, దులిపేసుకొని నువ్వే ఫో అని మనసులో అనుకోని, ఈ జగదేక సుందరి కాకపొతే ఇంకో అతిలోక సుందరి అనుకోని ఇంకో అమ్మాయి వెనకాల పడేవాళ్ళం. అంతే కానీ ఇప్పటి అబ్బాయిల్లాగా అలా ఒప్పుకొని అమ్మాయిల మీద ఆసిడ్ పోయడం, వాళ్ళని పబ్లిక్ లో చంపెయ్యడం గిసుంటి "పిదప కాలం, వెధవ బుధ్ధులు, చేష్టలు" చేసే వాళ్ళం కాదు. ఏం చేసినా కేవలం సరదాకే.
ఇంకోటండోయ్! ఆ రోజుల్లో కుర్రకారు అమ్మాయిలని "కలర్" అనేవాళ్ళు! దీనిఆరిజిన్ నాకు తెలీదు. కానీ మా ముందు తరాల అబ్బాయిలని గౌరవిస్తూ మేము కూడా అలా "కలర్" సాంప్రదాయాన్ని గౌరవించాం!
ఇంతకీ మోరల్ అఫ్ ది స్టోరీ ఏమిటంటే అప్పుడప్పుడూ తెలిసీ తెలియని పిల్లల యవ్వనం, భవిష్యత్తు వాళ్ళ తల్లితండ్రులు తెలీకుండా అనుకోకుండా పాడు చేస్తారు!