Thursday, October 11, 2012

Balli Episode!

Mundu Maata: Telugulo raasthu ee English lipilo enduku rasthunnano manavi chesthaanu.  kinda Telugu scriptlo kooda raasanu. meeku edi sulabhamgaa unte adi chaduvukondi!

Naaku moodu rakaala manushulu thelusu.

1. Telugu subhramgaa chaduvanu, raayanu maatladadamu vachchina vaallu

2. Telugu vaare kaani Telugu chadavadam raayadam raanivaallu. Kaani Telugu Brahmandamgaa maatladutharu

3. Telugethara vyakthulu...para bhasha maatru bhashagaa undi Telugu vaaritho daggara saanihityam undadam valla Telugu brahmandamgaa maatladuthaaru...kaani pai tharagathi vaari laaga chadavadam raayadam raadu.

Kaabatti naa rachanalu ashesha prajadarana pondaali ane oka swaartha pooritha prayojanam kosam Teluguni Englishlo raasthunnanu!

Aggipulla, Kukkapilla, Sabbubilla, Ballipilla kaadedi Kathaanikakanarham:)

Inka "Balli Episode" prarambham!

Ivaala poddunne lechaanu...emito eemadhya poddunne levadam oka bad habit ayyipoyindi:( Sare poddunne levagaane coffee padaka pothe manishini kaadu. Ventane vantintloki velli decoction pettadaanii filter kadugudaamani choosthe wash basinlo oka balli pilla bhayam bhayamgaa o moola undi.

Naaku ballulante bhayam ledu kaani juguptsa:( Danni elaga baita padeyyalani thega alochinchaanu. Eelopala inkevaraina kooda naalaage poddunne lechi untaaremo vaalla salaha kooda theesukundamani Facebooklonu, Twitterlonu kooda post chesaanu...salaha cheppandaho ani!

Eelopala naa prayatnaalu nenu cheyyadam modalu pettanu..."Balli Balli...naa thallivi kadooo koncham baitiki
ra amma" ani bujjagimpuga adigaanu. Kaani problem emiti ante naaku balli bhasha, balliki Telugu raavu:( Adi ala bhayamgaa choosthoone undi. Deenni maa avida leche logaa baita padeyyali ani oka pulla wash basinlo pettanu..adi ekki rammani naa alochana...kaani balliki andulonu balli pillaki chaala chinna brain untundi kadaa adi ee "Pullalu pettadam" veregaa artham chesukundi. Bahusha valla mummy daaniki cheppuntundi "Pullalu pettevallaki koncham dooramga undu" ani.  Eppatiki ekkade. Paiga atoo itoo thirigeyyadam modalu pettindi.

Sare idi naa manchike anukunna..ratri eppudo padi untundi...ninna eppudu tindi tindo ratri antha ee wash basinlo baavilo kappa laaga thega thirigi thirigi shosha vachchi padipothe appudu nene elago baita padeyyatchchu kadaa.

Kaani choodadaniki pille kaani chaala energeticgaa undi. Circuslo globelo motor cycle laagaa non stop thiruguthondi kaani alisi poye soochanalu emi kanipinchatamledu.

Oka pakka cinemallo choopinchinattu naa chevilo oka akashavaani maatalu pade pade vinipinchadam modalu pettayi.."Anduke nenu eppudu chepthuntaanu...vantintlo anninti meeda moothalu pettali" ani. Ee akashavaani evaro vijnulayina chaduvarulu eepatiki gurthinchi untaaru! Ayina Idi maree bagundandi..moothalu ante edo ginnela meeda pedathamu kaani wash basin meeda pedathaara evarayina:(

Inka laabham ledu ani appatiki appudu ashuvugaa oka paata katti "Chandamama Raave, Jabilli Raave" paata tunelo paadanu.

"Balli pilla raave, pulla ekki raave, mee intikellave malli itu raake" ani manchi aveshamgaa paadadam modalu pettanu. Oo nimishaaniki adi o cinemalo Brahmanandam laaga thalakindulugaa padi naalugu kaallu kottukovadam modalu pettindi...comaloki vellipothundemonani bhaya paddanu..endukayina manchidani paata apaanu.

inko nimishaaniki adi therukuni atoo itoo yama speedgaa thirigeyyadam modalettindi. aa thiragadamlo naa adrustam baagundi emi chesthondo daaniki kooda theleekunda pulla ekki paiki 100 KMs speedlo ekkesi brathuku jeevudaa ani okka jumptho daani intiki paaripoyindi.

Ammayya o problem solve ayyindi...Kaani oka doubt...a balli pilla daani intikelli vaalla mummytho naa meeda chilavalu palavalu chepthundemo:(

Mothaaniki ilaa ee Balli Episode sukhaantham ayyindi!

Katha kanchiki. manamintiki.

Annattu balli kooda kanchike! kaavalante kanchi vellil choodandi. balli leka pothe nannadagandi:)


బ(బు)ల్లి ఉదంతం
   
అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ, బల్లిపిల్ల కాదేది కథానికకనర్హం:)

ఇంకా ప్రస్తుత "బల్లి కథ" ప్రారంభం!

ఇవాళ పొద్దున్నే లేచాను. ఏమిటో ఈమధ్య పొద్దున్నే లేవడం ఒక బాడ్ హాబిట్ అయ్యిపోయింది:( సరే పొద్దున్నే లేవగానే కాఫీ పడకపోతే మనిషిని కాదు. వెంటనే వంటింట్లోకి వెళ్లి ఫిల్టర్ కడుగుదామని చూస్తే వాష్ బేసీన్లో  ఒక బల్లి పిల్ల ఒక మూల భయం భయంగా ఉంది. నాకు బల్లులంటే భయం లేదు కాని  జుగుప్త్స. దాన్ని ఎలాగ బైట పడేయ్యాలని తెగ ఆలోచించాను. ఈలోపల ఇంకెవరయినా కూడా నాలాగా పొద్దున్నే లేచి ఉంటారేమో వాళ్ళ సలహా కూడా తీసుకుందామని వెంటనే ఫేస్బుక్, త్విట్టర్లలో  పోస్ట్ చేసాను.....ఏదయినా సలహా చెప్పండహో అని!

ఈలోపల నా ప్రయత్నాలు నేను చెయ్యడం మొదలెట్టా. "బల్లి బల్లి...నా తల్లివి కదూ కొంచం బైటికి రామ్మా" బుజ్జగించాను. కాని సమస్య ఏమిటంటే నాకు బల్లి భాష, బల్లికి తెలుగు రావు:( ఆ బల్లి పిల్ల అలా భయంగా చూస్తూనే ఉంది. దీన్ని మా ఆవిడా లేచే లోగా బైట పదేయ్యలని ఒక పుల్ల వాష్ బేసీన్లో పెట్టాను. అది ఎక్కి వస్తుందేమోనని నా ఆలోచన. కాని బల్లికి అందులోను బల్లి పిల్లకి చాల చిన్న బ్రెయిన్ ఉంటుంది కదా. దానికి ఆ ఆలోచన రాలేదు. పైగా అది ఈ "పుల్లలు పెట్టడం" వేరేగా అర్థం చేసుకుంది. బహుశా వాళ్ళ మమ్మీ దానికి చెప్పి ఉంటుంది. పుల్లలు పెట్టేవాళ్ళకి కొంచం దూరంగా ఉండమని. ఎప్పటికి ఎక్కలేదు. పైగా అటూ ఇటూ తిరిగేయ్యడం మొదలు పెట్టింది. సరే ఇది నా మంచికే అనుకున్నా. రాత్రి ఎప్పుడో  పడి ఉంటుంది. నిన్న ఎప్పుడు తిండి తిందో. రాత్రి అంతా ఈ వాష్ బేసీన్లో బావిలో కప్పలాగ తిరిగి తిరిగి శోష వచ్చి పడిపోతే అప్పుడు నేనే ఎలాగో బైట పడేయ్యచ్చుకదా అని.
కాని చూడడానికి పిల్లే కాని చాల ఎనర్జేతిక్ గా ఉంది. సర్కస్లో గ్లోబులో మోటర్ సైకిల్ లాగ నాన్ స్టాప్ తిరుగుతోంది కాని అలిసి పోయే సూచనలు ఏమి కనిపించలేదు.

ఒక పక్క సినిమాలో చూపించినట్టు నా చెవిలో ఆకాశవాణి మాటలు పదేపదే వినిపించడం మొదలెట్టాయి "అందుకే నేను ఎప్పుడు చెప్తూంటాను.వంటింట్లో అన్నింటి మీద మూతలు పెట్టాలి అని" ఈ ఆకాశవాణి ఎవరో విజ్ఞులైన చదువరులు ఈపాటికే గ్రహించి ఉంటారు. అయినా ఇది మరీ బాగుందండి. మూతలు అంటే ఏదో గిన్నెలమీద పెడతాము కాని వాష్ బేసిన్ మీద పెడతారా ఎవరయినా!

ఇంకా లాభం లేదని అప్పటికప్పుడు ఒక పాట ఆశువుగా రాసి "చందమామ రావే, జాబిల్లి రావే" పాట ట్యూన్లో పాడాను.

"బల్లి పిల్ల రావే, పుల్ల ఎక్కి రావే, మీ ఇంటికెల్లవే, మల్లి ఇటు రాకే" అని మంచి ఆవేశంగా పాడడం మొదలెట్టాను. ఓ నిమిషానికి అది ఒక సినిమాలో బ్రహ్మానందంలాగ తలకిందులుగా పది నాలుగు కాళ్ళు కొట్టుకోవడం మొదలు పెట్టింది. కోమాలోకి వెళ్ళిపోతుందేమోనని భయపడ్డాను. ఎందుకయినా మంచిదని పాట ఆపాను. ఇంకో నిమిషానికి అది తేరుకుని అటూ ఇటూ యమ స్పీడుగా తిరిగేయ్యడం మొదలెట్టింది. ఆ తిరగడంలో నా అదృష్టం బాగుండి, ఏమి చేస్తోందో దానికి కూడా తెలీకుండా పుల్ల ఎక్కి పైకి 100  కిమీ స్పీడులో బ్రతుకు జీవుడా అని ఒక్క జంపుతో దాని ఇంటికి పారిపోయింది. అమ్మయ్య! ఒక ప్రాబ్లం సాల్వు అయ్యింది.

కాని ఒక డౌటు! ఆ బల్లి పిల్ల దాని ఇంటికెళ్ళి వాళ్ళ మమ్మీతో నా మీద చిలవలు పలవలు చెప్తుందేమో:(

ఏమయితేనేం! మొత్హానికి ఈ బల్లి ఉదంతం ఇలా సుఖాంతం అయ్యింది.

కథ కంచికి. మనమింటికి.

అన్నట్టు  బల్లి కూడా కంచికే! కావాలంటే కంచి వెళ్లి చూడండి. బల్లి లేకపోతే నన్నడగండి:)