Sunday, December 27, 2015

Real funny incident!

Ending the last week of the year with a real incident for a change ;)

One of my friend who is also a recruitment consultant lives very near my home. Whenever he gets a cheque from clients, which is very frequently(!), he drags me along to his bank at Paradise and the tacit agreement is that he had to offer me samosa/curry puff with tea at Paradise restaurant in exchange for my entertaining company ;)

Few months ago on one such trip we were crossing the Paradise cross roads on foot (he parks his car in the bank's compound) and when we were few feet away from the other side suddenly a lady on an Activa was hit by a bike and she fell at my feet, literally and the scooter fell on the opposite side! Apparently both of them tried to jump the signal and hence the mishap happened, am not sure how it happened, as in most cases they happen in a jiffy!

She fell just 6” from me and the following thoughts/questions crossed through my mind in the next 2.5 seconds, needless to say at the speed of thought ;)
She is looking heavy!! As does the scooter :(
Should I risk lifting her?...considering my age and her weight :(
Scooter fell on the opposite side and hence difficult to lift from my side!
Whom should I lift first(!)? She or scooter? As if I'm going to do both!
Scooter can't get up on its own!
But she isn't injured at all and can get up on her own unlike the scooter!

In the meantime..I mean after 2.5 seconds a guy appeared from nowhere/ somewhere and lifted the scooter by which time the lady was getting up on her own having come to a firm conclusion that I'm not going to be doing any heroic help :(  How can I..being an aging hero; I don't have the facility of dupes like the ones in the films :(

Needless to say my friend was a mute spectator to the entire happening!!

And after pulling herself up she sat on the scooter, started it and sped away but not before looking back and giving a mysterious smile! I felt that her smile was just like Draupadi's after seeeing Duryodhana in Maya Sabha :(


నా ఫ్రెండ్ ఒకతను (ఆతను కూడా నాలాగే recruitment consultant!!) నా ఇంటికి/ ఆఫీసు కి దగ్గరలో ఉంటాడు. అతనికి క్లైంట్ నించి చెక్కు వచ్చినప్పుడల్లా నన్ను కూడా అతనితో పాటు పారడైస్ దగ్గరున్న అతని బ్యాంకుకి తీసుకెళతాడు. అగ్రిమెంట్ ఏమిటంటే అతను నాకు పారడైస్ రెస్టారెంట్లో సమోసా / కర్రీ పఫ్, టీ ఇప్పించాలి. నేనతన్ని దారి పొడుగునా మార్గాయాసం తెలీకుండా ఎంటర్టైన్ చేసినందుకు బదులుగా ;)

కొన్ని నెలల క్రితం అలాగే పారడైస్ వెళ్లి  రెస్టారెంట్ కి వెళ్ళడం కోసం నడుస్తూ రోడ్ క్రాస్ చేస్తున్నాం. దాదాపుగా ఆ చివరికి వెళ్ళగానే అకస్మాత్తుగా ఒక ఆక్తివా స్కూటర్ ని ఒక బైక్ గుద్దేసింది. ఇద్దరూ సిగ్నల్ జంప్ చెయ్యాలని ప్రయత్నించారు, ఆ హడావిడిలో! అంతే స్కూటర్ నడుపుతున్నావిడ నా కాళ్ళ దగ్గర దభీమని పడింది. స్కూటర్ అటు వేపు!

ఆ వెనువెంటనే రెండున్నర సెకండ్లలో నా మదిలో మెదిలిన ఆలోచనలు / ప్రశ్నలు !

ఆవిడ చూడపోతే ఒకింత భారీగా ఉంది :(  స్కూటర్ కూడా  !
స్కూటర్ ఏమో అటు వేపు పడింది కాబట్టి దాన్ని నేను లేపడం కష్టం
ఆవిడని లేపే రిస్క్ చెయ్యడం అభిలషణీయమా? నా వయసు, ఆవిడ బరువు దృష్టిలో పెట్టుకొని ;)
ఎవరిని ముందు లేపాలి? స్కూటర్ నా? ఆవిడనా? అక్కడికి నేనేదో ఇద్దరినీ లేపేట్టు ? :(
స్కూటర్ దానంతట అది లేవలేదు !
ఆవిడకి దెబ్బలేమీ తగలలేదు కాబట్టి ఆవిడా తనంతట తానూ లేవగలదు.

ఈ లోపల అంటే రెండున్నర సెకండ్ల తర్వాత ఎక్కడినించి వచ్చాడో ఒకతను వచ్చి స్కూటర్ ని లేపాడు! వెనువెంటనే ఆవిడ కూడా తనంతట తానూ లేచి నిలపడింది! (నే చెప్పలా?!) నేను హీరోచితంగా లేపను  అని ఒక దృఢ నిశ్చయానికొచ్చి :( హీరోనే కాని కొంచం వయసు మీద పడింది కదా! సినిమాల్లో అయితే అలాంటి హీరోలకి డూపులు ఉంటారు! నాకా సౌకర్యం లేదే? అర్థం చేసుకోరూ!

ఈ చోద్యమంతా నా ఫ్రెండ్ వింతగా చూస్తూ అలా ఉండిపోయాడని వేరే చెప్పనక్కరలేదనుకుంటా!

సరే అలా లేచి నిలపడ్డ కొద్ది క్షణాలకి ఆవిడ స్కూటర్ మీద కూర్చొని, స్టార్ట్ చేసి తుర్రుమంది. వెళ్తూ, వెళ్తూ వెనక్కి చూసి అదో రకంగా నవ్వింది! నాకు ఆ నవ్వు మ(మా)యసభలో దుర్యోధనుడిని చూసి ద్రౌపది నవ్విన నవ్వులాగా అనిపించింది :(   

Start the last week of the year with a big loud laugh and #HaveAGreatWorkingWeek

#Telugu

Tuesday, December 22, 2015

Bad looks - దిష్టి - Bura nazar !!!

హిందీ సినిమా పాత పాట ఒకటుంది(ట!) నాకు పెద్దగా హిందీ రాదు. దాని అర్థం ఏమిటంటే "పొరపాటుని కూడా నువ్వు అద్దంలో చూసుకోకు! నీ దిష్టి నీకే తగులుతుంది" అని!!

తెలుగు సినిమాలో ఒక పాట కూడా ఉంది! "కన్ను నీదని, వేలు నీదని పొడుచుకుంటే రాదా రక్తం" అని!!

ఇంతకీ ఈ రెండు పాటలకి ఏమిటి లింక్ అంటారా? అదేనండి. మన దిష్టి మనకే తగలడం :(

పోయిన వారం ఒక ఖద్దర్ షర్టు వేసుకున్నా! అందులో విశేషం లేదు. అది కొత్త షర్టు కూడా కాదు! కాని వేసుకున్నవాడిని వేసుకున్నట్టు ఊరికే ఉండక (ఉండబట్టలేక!!) "ఆహా! ఎంత బాగుందీ షర్టు! ఇందులో నేనెంత బాగున్నానో?!!" అని ఒకటికి మూడు సార్లు అన్నా! అప్పటికీ పక్కనించి మా ఆవిడ అంటూనే ఉంది! " మరీ అంత పొగుడుకోకండి! మీ దిష్టి మీకే తగలగలదు" అని!

కాని నేను వింటేనా? ఎందుకు వినాలి? ఏం? వాళ్ళని మట్టుకు ఎన్నిసార్లు పొగిడినా ఇంకా ఇంకా అని సంతోషం  సినిమాలో "కోట" లాగా "ఇందాకల ఏమన్నారు? అని మళ్ళీ మళ్ళీ అడిగి మరీ పొడిగించి, పొగిడించుకుంటారుగా? ;) పెద్దమనిషిని నన్ను అలా డైరెక్ట్ గా పొగిడే ప్రజలు, అభిమానులు లేక, ఉన్నా వాళ్లకి అభిమానం తగ్గి, కొంచం అభిమానం అడ్డొచ్చి, నన్ను పొగడక పోతే నేనేమయ్యిపోవాలి? నాకేటి దారి? ఇదే! నన్ను నేనే కసి తీరా, మనసారా పొగుడుకోవడమే!! తప్పలేదు! తప్పేం కాదు. అయినా నాకు తెలీక అడుగుతాను. కిట్టని వాళ్ళు పొగడ్త అని చేసే దుష్ప్రచారం కాకపొతే, నిజం చెప్పితే అది పొగడ్త ఎలా అవుతుంది?

సరే అలా కాస్సేపు పోగిడేసుకున్నాక పనిమీద వెళ్ళిపోయాను. ఇక్కడిదాకా అంతా ఓకే!

సాయంత్రం ఇంటికొచ్చి "అబ్బాబ్బబ్బబ్బా!! ఏమి ట్రాఫిక్? ఎన్ని కార్లు? ఎంత జామ్? అసలు పెజలంతా రోడ్లమీదే ఎందుకుంటున్నారు? రోజూ ఇంతమందికి ఇంత తిరగాల్సిన పనులేమిటి ఉంటాయి? వగైరా హస్చార్యార్ధక ప్రశ్నలు జనాంతికంగా టీవీ సీరియల్స్ లో వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకొనే టైపులో ప్రశ్నలు వేసి ఇంకా అలిసిపోయి, షర్టు విప్పి అలా తలుపుకి తగిలించబోతూ (ఇదో బాడ్ హాబిట్ లెండి!) ఒక్కసారి షాక్ అయిపోయాను. షర్టు ఏ మేకుకో తగిలినట్టుంది. ఒక అంగుళం మేర చిరుగు :(

నాకు ఏడుపొక్కటే తక్కువ!

నీతి: మనకి మనం ఎంత ముద్దొచ్చినా మనల్ని మనం పొగుడుకొనరాదు!!

Monday, December 21, 2015

After a night of heavy boozing a man stumbles out of a bar. To sober up a bit he decides to walk home instead of taking a taxi.

Soon he finds himself in a dodgy part of town, where he has never been before. Then a homeless person gets in front of him and asks the man for some change.

The man looks at the bum and says: “I bet you’re gonna get beers for that money, aren’t you?”

"Oh no sir" the bum replies with the face of an angel.

“Hmmm, no beers. So you’re gonna get wine then, ey?!”

– No sir, certainly not. I never drink wine.

“Aha, so you’re gonna get hard liquor right?!

– Absolutely not sir. In fact I never touched a drop of alcohol in my entire life.

“In that case, why don’t you come with me to my place”, the man says.

– Oh sir, that would be too much hospitality. I really couldn’t.

The man looks at the bum and replies: “Hospitality? I’m not offering you anything. I just want you to come with me, so I can show my nagging wife what happens to people who don’t drink.”

Start the week with a smile and you'll #HaveAGreatWorkingWeek

Wednesday, December 16, 2015

Out of box cooking idea!! మీ ఇంట! నా వంట!!

మీ ఇంట! నా వంట!!

About 2 years ago after I finished my talk on "Out of box thinking" in an organization, one of their employees asked me "Sir! I love cooking! How can I cash it?!" I wanted to tell her to "think out of the cooker" ;)  But instead told her an idea I got instantly. And its this!

Please specialize in about 7/8 dishes and tell everyone in your relatives and friends circle that for any small function in their home you'll cook any 2 of those dishes in "their kitchen, with their utensils and cooking materials" and charge initially something like Rs.1,000! I don't know whether she followed my advice or not!

I'm not able to think of a suitable punch line in English for this!!

Any of you who love cooking and are experts can use this idea freely! And pay my Gurudakshina with one of your special dishes ;)

మీ ఇంట! నా వంట!!

ఇదేమిటి అంటారా? నేను కాలేజీల్లోనూ, కంపెనీల్లోనూ "అవుట్ అఫ్ బాక్స్ థింకింగ్" మీద లెక్చర్స్ ఇస్తూంటాను! రెండేళ్ళ క్రితం ఒక కంపెనీలో అలా నా "టాక్" అయ్యాక ఒక ఉద్యోగిని నన్ను అడిగింది "నాకు వంట చెయ్యడం బాగా ఇష్టం! దాన్ని ఎలా కాష్ చేసుకోవాలి?!" అని. నేను వెంటనే అందామనుకున్నా "మీరిప్పుడు "అవుట్ అఫ్ కుక్కర్" థింకింగ్ చెయ్యాలి అని ;) కాని సభామర్యాద కాదని వెంటనే అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన చెప్పాను.
మీరు ఒక 7/8 మంచి డిషెస్ స్పెషలైజ్ చెయ్యండి. ఆ తర్వాత మీ బంధు మిత్ర వర్గంలో అందరికీ చెప్పండి. మీ ఇంట్లో ఏమైనా చిన్న ఫంక్షన్ అయితే నన్ను పిలవండి. మీ ఇంట్లో, మీ వంటింట్లో, మీ వంట సామగ్రితో, మీ వంట సరుకులతో (ఇది మీకు బాలకృష్ణ డైలాగ్ గుర్తుకు తెస్తే నేనేం చెయ్యలేను!!) ఈ 7/8 డిషెస్ లో మీకిష్టమైన ఏవైనా ఒక 2 చెస్తాను. కేవలం వెయ్యి రూపాయలకే!! అని ప్రారంభించండి! అని చెప్పాను. ఆ తర్వాత ఆమె అలా చేసిందో లేదో తెలీదు.

సో మీలో ఎవరికైనా వంట మీద అభిమానం, ప్రావీణ్యం ఉంటే ఈ "అవుట్ అఫ్ బాక్స్" ఐడియా వాడేసుకోండి! నా గురుదక్షిణ ఏదో ఒక మాంచి డిష్ చేసి పెట్టడమే! ఫ్రీగా ;) 

PS: బోనస్ ఆఫర్ - ఈ పోస్ట్ హెడ్డింగ్ మీ పంచ్ లైన్ గా వాడుకోవచ్చు! గురుదక్షిణ మామూలే! మరో డిష్;)
Telugu‬

Sunday, December 13, 2015

Dinner Prayer!

Everyone was seated around the table as the food was being served. When little Johnny received his plate, he started eating straight away.
“Jonny, wait until we’ve said our prayer,” his mother reminded him.
“I don’t have to.” – the little boy replied.
“Of course you do.” – his mother insisted. “We say a prayer before eating at our house.”
“That’s at our house,” Johnny explained, “but this is Grandma’s house and she knows how to cook.”

Start the week with a smile and you'll definitely #HaveAGreatWorkingWeek

Saturday, December 12, 2015

Mara Chembu మరచెంబు

మధుర స్మృతులు!!




60's దశాబ్దం వరకు ఎవరు రైలు ప్రయాణం చేసినా ఇదిగో ఈ భారీ మరచెంబు మట్టుకు మర్చిపోయేవాళ్ళు కాదు!! దీనితో పాటు కొంచం దూర ప్రయాణం అయితే ఒక "హోల్దాల్", ఏ ప్రయాణానికైనా ఒక రేకు పెట్టె ;)

ఆ రోజుల్లో నేను చాలా చిన్నవాడిని. అయినా సరే నా వయసుకి మించిన భారం మొయ్యాల్సి వచ్చేది ఆ లేత వయసులోనే :( ఏమిటని సందేహం కూడానా?! ప్రయాణాల్లో ఇదిగో ఈ భారీ మరచెంబు నా చేతుల్లో పెట్టేవాళ్ళు, చిన్న పిల్లాడిని అనైనా చూడకుండా :( నీళ్ళు లేకుండానే దాని బరువు కనీసం ఒక కే.జి. కి తగ్గకుండా ఉంటుంది. అందులో నీళ్ళు నింపితే ఇంకో కే.జి. చచ్చినంత పనయ్యేది దాన్ని మొయ్యాలంటే. పొరపాటుని చెయ్యి జారి పాదం మీద పడితే? అన్న ఆలోచన కూడా వచ్చేది కాదు ఈ పెద్దొళ్ళకి :( అయితే ఒకటి లెండి! అన్ని "బరువు" బాధ్యతలు అందరూ మొయ్యాలన్న ఒక సాంఘిక సందేశం ఉండేది ఈ ప్రయాణాల్లో ;) పెద్ద వాళ్లకి పెద్ద సామానులు, చిన్న వాళ్లకి మర చెంబులు! సామాజిక న్యాయం అంటే ఇదేనా కొంప తీసి? ;)

ముఖ్య గమనిక: ఈ మరచెంబు ఫోటో ఇక్కడ పోస్ట్ చేసే స్థాయికి తేవడానికి నాకు కనీసం ఒక అరగంట పట్టింది!! అంటే సినిమాల్లో హీరోయిన్ లని అందంగా చూపించడానికి మేక్ అప్ మాన్ కష్టపడతారే అలా ఈ మరచెంబుని కూడా అందంగా చూపించే ప్రయత్నం అన్న మాట!!

దాన్ని ముందు ఒక అంట్లు తోమే సబ్బుతోనూ, పిదప ఒకింత చింతపండు ఉప్పు మిశ్రమం తోనూ, ఆ పైన ఇంకొంచం బ్రాస్సో తోనూ తోమి, తోమి ఇదిగో ఇలా "తళతళ" తప్ప ఇంకేమి మిగలని స్టేజి కి తెచ్చాను. ఇలా తోమడంలో నా "శక్తి""యుక్తులు" అన్నీ ఉపయోగించాను. శక్తి మీకు తెలిసినదే! చేతులు నొప్పెట్టేదాకా తోమడమే! "యుక్తి" ఏమిటంటే ఫోటోలో మర చెంబు 360° కనిపించదు కదా! ఏదో ఒక పక్కే కనిపిస్తుంది. మరయితే నేనెందుకు మరచెంబు మొత్తం తోమి, తోమి తెగ అలిసిపోవడం? ఈ చిదంబర రహస్యం తెలియగానే (Mentos వేసుకోకుండానే సుమండీ!!) వెంటనే నా శక్తినంతా ఈ చెంబు మీకు కనిపిస్తున్న వేపే తోమాను ;) శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు!!

Sunday, November 29, 2015

A local NGO office realized that the organization had never received a donation from the town's most successful lawyer.

The person in charge of contributions calls him to persuade him to contribute. "Our research shows that out of a yearly income of at least $500,000, you did not give a penny to charity. Wouldn't you like to give back to the community in some way?"

The lawyer mulled this over for a moment and replied, "First, did your research also show that my mother is dying after a long illness, and has medical bills that are several times her annual income?"

Embarrassed, the NGO rep mumbled, "Um, no."

The lawyer interrupts, "Or that my brother, a disabled veteran, is blind and confined to a wheelchair?"

The stricken NGO rep began to stammer out an apology, but was interrupted again.

"Or that my sister's husband died in a traffic accident," the lawyer's voice rising in indignation, "leaving her penniless with three children?!"

The humiliated NGO rep, completely beaten, said simply, "I had no idea."

On a roll, the lawyer cut him off once again, "So if I don't give any money to any of them, why should I give any to you?"

Start the week with a smile and #HaveAGreatWorkingWeek 

Monday, November 23, 2015

A dream come true - Tirumala!!

I had an interesting dream about 3 years ago! In that dream I was all alone in the inner sanctum sanctorum of Tirumala temple and there was just one Poojari. I recognized him as he is the Poojari in a temple I frequent in Hyderabad! He told me “Since you are the only one now, you can stay as long as you want” and then he went out! I had the uninterrupted “Special Darshan” of Sri Venkateswara Swamy for at least half an hour and then came out.

In the morning I told about the dream to my wife as well as a close friend. Both of them were unanimous in their interpretation of the dream! They said that the Lord is calling me to Tirumala! I kinda specialize in what can be loosely termed as “vitanda vada”!! So I replied to them “Why should I visit Tirumala when He gave me a long special darshan?!” And both of them kept quiet as they know better ;) Interestingly even after I woke up I could still “see” that dream very very vividly and in fact was kind of flummoxed as I couldn't figure out the temple where I saw that Poojari!! Soon I forgot about that dream. And you too for the moment!

(Somehow I never thought of submitting my "minimum list of demands/wishes to HIM during that long Darshan!!)

After many months I went to a close friend's house at 11 AM very unexpectedly. We went on chatting for some time when he suddenly asked me what I know about the Chilkur temple! Frankly I was surprised (rather shocked was the more appropriate word!) as I've never seen him talking about Gods or temples and I never thought he was a devotee! But keeping aside my surprise feelings I told him what I know about that temple; that one should make 11 pradakshinas of the temple and make a vow. And once the wish is fulfilled then they come back and do 108 pradakshinas!

Here I've added my own theory! I told him that devotees seeking fulfillment of wishes and offering something like tonsuring of head, climbing Tirumala hills on foot, offering money or 108 coconuts AFTER their wish is fulfilled is like the villains in movies who offer a certain amount to hired goondas to kill the hero or heroine and give them a token advance promising to pay the balance AFTER they finish their part of killing! They do so because they don't exactly have 100% faith/belief in those goondas that they will deliver! Devotees offering the God AFTER their wish is fulfilled means even they don't have 100% faith in Him!! And so I told him according to me, if one were to visit Chilkur temple with a wish then they should make 108 pradakshinas in the first visit itself and NOT after their wish is fulfilled! My friend agreed to my theory!

Then I offered to accompany him if he wants to go there on the coming Saturday but he immediately asked me “How about going right now?!” I was surprised again but then decided to go along as I didn't have any pressing work that day. I called my wife and told her that I'm going to Chilkur temple and she immediately gave me the green signal.

So off we went to Chilkur with a pit stop in a restaurant at Banjara Hills where we had a lavish buffet lunch ;) I told my friend that leave alone 108 he can't even do 11 pradakshinas if he were to eat so heavily! But he said he will manage and we both had a heavy lunch and reached Chilkur around 3 PM. It was very cloudy and was threatening to rain any moment. Surprisingly there were just 2/3 cars and about 30 bikes there which is a rare thing!

We both went inside and found that there were hardly about 100 -150 devotees in the temple and they were all doing the pradakshinas and as usual all of them were almost running!! My friend started his rounds and I wanted to give him company for few rounds but after the 3rd round I had terrible pain in my foot. In fact a week before I had that pain and stopped my usual morning walks in the evenings! And so I sat in the veranda watching all the devotees.

After 5 minutes I heard an announcement in the PA system that they need volunteers to give prasadam to devotees etc., I instantly jumped up and went to the place where they give prasadam. A 25 years old man was there and when I told him I want to do the volunteer work he told me to give the prasadam to the devotees after they come out of the inner shrine and also try to sell the Vak magazine to any interested devotees. He said he wants rest for an hour or so. I agreed and stood there. But as I've mentioned since there were very few devotees I was just standing there without any devotee coming out for many minutes. Then a thought struck me and I went inside the shrine and stayed there staring at the main idol of Sri Venkateswara Swamy till a batch of devotees came in. Then I came out and resumed my duties of offering prasadam. Once that batch went off again there was a gap with no one entering the temple. So again I went inside and this went on for about 45 minutes!!

(Incidentally I sold lots of Vak magazine in that short period as I was from sales!!)

That day happened to be some auspicious day and the idol was well decorated. And that's how I ended up having a long darshan of more than half an hour!

I returned home and told my wife about this interesting incident and then she reminded me of my Tirumala darshan dream! Till then I forgot about it totally! I was very happy that the impossible dream of special darshan in His Head Office came true in His branch office :)

Then after few weeks I went to Tadbund Hanuman temple and after darshan came out to the area where the vehicle poojas are performed. When I saw the old Poojari who does the vehicle pooja I instantly recognized him as the one who appeared in my Tirumala dream! I immediately told him about it. He was shocked and said that “Its Lord Hanuman himself who appeared in your dream as me! He never appears as Himself to any one”! It was another pleasant surprise to me. He then asked me whether I “owe” anything to Sri Venkateswara Swamy! I told him I “owe” him a lot but can't repay them all now :( Then he said in that case perform archana/seva in any of his temples and I did that.

That's how my dream came true!! And its just that! Please don't read more into it.

PS: Don't even presume that I'm privileged or close to God!! Far from the truth! My one wish in about dozen visits to Chilkur temple remains unfulfilled :(

On many occasions temple doors were closed when I visited some temples :(

And here under is the #Telugu version for those of you who prefer it!

మూడు, రెండు సంవత్సరాల కిందటి సంగతి! సాధారణంగా రెండు, మూడు సంవత్సరాల కిందట అని మొదలు పెడతారు/చెప్తారు, కాని మీరేంటి రివర్స్ లో చెప్పారు అంటే దానికొక కారణం ఉంది.  కొన్నేళ్ళ క్రితం జరిగిన సంఘటనలు సాధారణంగా కరెక్ట్ గా ఎప్పుడు జరిగాయో గుర్తుండవు. అందుకని సుమారుగా రెండు, మూడు సంవత్సరాలు అంటారు, ఒక్క సంఘటన గురించి చెప్తున్నా. కాని ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక్క సంఘటన గురించి కాదు! రెండు సంఘటనల గురించి. అందులో ఒకటి మూడు సంవత్సరాల క్రితం, రెండోది రెండు సంవత్సరాల క్రితం జరిగినవి. అందుకే అలా రాసాను. ఆ రెండింటికీ లింక్ ఉంది!

మొదటగా మూడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఒక రాత్రి కల వచ్చింది.  పగటి కల కాదు!! ఈ మధ్య కలల గురించి రాస్తున్నారు అని అనుకుంటారేమో? అందుకే ఇది జరిగిన చాల ఏళ్ళకి రాస్తున్నాను. ఇంతకీ ఆ కల ఏంటంటే నేనొక్కడినే తిరుమల గుడి గర్భగుడిలో ఉన్నాను. అక్కడ ఒకే ఒక్క పూజారి ఉన్నారు. గమ్మతేమిటంటే ఆ పూజారి నేను హైదరాబాద్ లో వెళ్ళే ఒక గుళ్ళో పూజారి!!  కాని కలలో ఆయన్ని గుర్తుపట్టాను కాని ఇదేంటి తిరుమలలో ఉన్నారు అన్న సందేహం రాలేదు (కల్లో). అప్పుడు ఆ పూజారి "మీరొక్కరే ఉన్నారు కాబట్టి మీ ఇష్టం వచ్చినంత సేపు ఉండండి అని ఆయన గర్భగుడి బైటికి వెళ్ళిపోయారు. నేను దాదాపు ఒక అరగంట అలా వేంకటేశ్వర స్వామి వారిని చూస్తూ ఉండి పోయాను. తర్వాత ఇంక బాగోదని బైటికి వచ్చేసాను.

పొద్దున్నే మా ఆవిడతో, ఇంకో స్నేహితుడితో చెప్పాను. వాళ్ళిద్దరూ అందరూ అనుకోనేదే చెప్పారు. మిమ్మల్ని తిరుమల రమ్మని పిలుపు అని! నేను వెంటనే నా వితండ వాదం ప్రవేశపెట్టాను. "రాత్రి నాకు కలలో స్వామి వారు ప్రత్యెక దర్శనం ఇచ్చాక ఇంక మళ్ళీ తిరుమల ఎందుకు వెళ్ళడం? నేనేం వెళ్ళను" అని ఖరాఖండి గా చెప్పేసాను. పొద్దున్నకి కూడా ఆ కలలో కనిపించిన పూజారి మొహం కళ్ళకి కట్టినట్టు కనిపిస్తూ ఉంది కాని ఆయన్ని ఏ గుళ్ళో చూసానో ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు. కాలక్రమంలో ఆ కలగురించి మర్చిపోయాను. మీరు కూడా ఈ కల సంగతి ప్రస్తుతానికి మర్చిపోండి!

ఫుట్ నోట్ : పొద్దున్న కాని తట్ట లేదు నాకు, రాత్రి అంతసేపు ఏకాంతసేవ దర్శనం సమయంలో నా "కనీస కోరికలు" కానీ, కస్టాలు కాని తీర్చమని ఎందుకు కోరుకోలేదు?!! నాకిప్పటికీ అర్థం కాని విషయం ఇది :(

తర్వాత సీన్ కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత ఒకరోజు అనుకోకుండా ఒక ఫ్రెండ్ ఇంటికి పొద్దున్న 11 గంటలకి వెళ్లాను. కాసీపు ఆ కబురు, ఈ కబురు చెప్పుకున్నాక, ఆ ఫ్రెండ్ నన్ను హటాత్తుగా "నీకు చిలుకూరు గుడి గురించి తెలుసా" అని అడిగాడు. నేను ఒకింత షాక్ అయ్యాను.  ఎందుకంటే నాకు తెలిసి ఆయన ఎప్పుడూ, దేవుడు, గుళ్ళూ విషయాలు  చర్చించలేదు. పెద్ద దైవభక్తి ఉన్న మనిషిలా కూడా అ(క)నిపించలేదు నాకు అప్పటిదాకా.

సరే చిలుకూరు గుడి గురించి నాకు తెలిసినది, నా పైత్యం కొంత కలిపి చెప్పాను. అక్కడ ముందస్తుగా 11 ప్రదక్షిణాలు చేసి మనసులో ఉన్న ఒక్క కోరిక కోరుకుని, అది తీరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చెయ్యాలి అని! ఇక్కడ కొంచం అప్రస్తుత ప్రసంగంలా అనిపించినా నా అభిప్రాయం ఒకటి ఇలా కోరికలు కోరుకోవడం, అవి తీరితే ఏదో చేస్తాను, ఇస్తాను అని మొక్కుకోవడం మీద నాకు నాదైన అభిప్రాయం ఒకటుంది. అదేమిటంటే ఇలా "నాకు ఎంసెట్ లో పెద్ద రాంక్ వస్తే గుండు గియ్యించుకుంటాను", "మా అమ్మాయి పెళ్లి కుదిరితే 108 కొబ్బరికాయలు కొడతాను", "నాకు ఉద్యోగం వస్తే తిరుమల కొండ నడిచి ఎక్కుతాను" అని అడగడం నాకెలాగ అనిపిస్తుందంటే, సినిమాల్లో విలన్ ఒక కిరాయి రౌడీ ని పిలిచి "హీరోని చంపితే పది లక్షలు ఇస్తాను. ఇదిగో 5 లక్షలు అడ్వాన్సు, మిగతాది పని పూర్తి అయ్యాక" అంటాడు చూసారా, అలా అనిపిస్తుంది. ఆ విలన్ అలా సగం పనయ్యాక ఇస్తాను అని ఎందుకు అంటాడంటే, ఆ సదరు కిరాయి రౌడీ మీద పూర్తి నమ్మకం లేక!! ఇదిగో మరి భక్తులు కూడా ఇలా "నాకీ పని చేసిపెట్టు! చేసాక ఇదిస్తాను. అది చేస్తాను" అని అనడంలో వాళ్లకి తమ కోరికలు తీర్చే విషయంలో దేవుడి మీద పెద్ద నమ్మకం ఉన్నట్టు అనిపించదు. నిజంగా దేవుడి మీద గట్టి నమ్మకం (తన కోరిక తీరుస్తాడు అని) ఉంటే, ఆ చేస్తాను, ఇస్తాను అన్నవి ముందే చెయ్యాలి, ఇవ్వాలి! ఇది నా థియరీ!!

అలా నా ఫ్రెండ్ కి ఆ గుడి సాంప్రదాయం తో పాటు నా థియరీ కూడా చెప్పాను. నేనయితే 108 ప్రదక్షిణాలు ముందే చేస్తాను! అని. నా ఫ్రెండ్ కూడా నా థియరీ ఒప్పుకోని తను కూడా 108 ప్రదక్షిణాలు ముందే చేస్తాను అన్నాడు! నేనయితే వాకే! అన్నా. వచ్చే శనివారం అయితే నేను కూడా కంపెనీ ఇస్తాను అన్నా. నా ఫ్రెండ్ "మనం ఇప్పుడే ఎందుకు వెళ్ళకూడదు" అన్నాడు. నేను అయితే చలో. నాకు పెద్దగా పనేం లేదు ఇవాళ. పద వెళ్దాం అని మా ఆవిడకి ఫోన్ చేసి చెప్పాను. " ఇలా నా ఫ్రెండ్ తో చిలుకూరు వెళ్తున్నా" అని. ఏ బార్ కో అయితే మా ఆవిడ భారీ అభ్యంతరం చెప్పేదేమో కాని గుడికి అంటే ఎప్పుడైనా గ్రీన్ సిగ్నల్ ;)

అంతే ఒంటిగంటకి బయల్దేరాం. మధ్యలో నా ఫ్రెండ్ బంజారా హిల్స్ లో ఒక రెస్టారెంట్ లో భారీ బఫెట్ భోజనం పెట్టించాడు! ఇంత  తింటే 108 కాదు కదా కనీసం ఆ 11 ప్రదక్షిణాలు కూడా చెయ్యలేవని నేను మొత్తుకుంటున్నా వినకుండా భారీగా లాగించేసాడు. భోజనం అయ్యాక వెంటనే నా ఫ్రెండ్ కారులో చిలుకూరు మధ్యాన్నం 3 గంటలకి చేరాము.       

బాగా మబ్బులు కమ్మి ఏ క్షణం అయినా వాన పడేట్టుగా ఉంది వాతావరణం. విచిత్రంగా రెండే రెండు కార్లు, ఒక ఇరవై, ముప్ఫై బైకులు మాత్రమే ఉన్నాయి. నాకు బోల్డు  హాశ్చర్యం వేసేసింది. నేనెప్పుడు చిలుకూరు వెళ్ళినా చాలామంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. కాని ఇవాళ మా అదృష్టం చాలా తక్కువ మంది ఉన్నారు. సరే గుళ్ళోకి వెళ్లి చూసినా అదే పరిస్తితి. ఒక వంద, లేక నూట యాభైమంది ఉంటారేమో. అందరూ యధావిధిగా ఎవరో తరుముతున్నట్టు ప్రదక్షిణాలు పరిగెడుతూ చేస్తున్నారు. నా ఫ్రెండ్ వెంటనే ప్రదక్షిణాలు మొదలెట్టాడు. నేను కేవలం మూడు ప్రదక్షిణాలు చేసాక పాదం నొప్పి మొదలయ్యింది. అంతకు ముందు వారం నించి ఉంది ఆ నొప్పి! ఇక చేసేది లేక సైడ్ ఉన్న వసారాలో కూర్చున్నాను. భక్తుల పరుగుపందెం చూస్తూ!

ఒక అయిదు నిమిషాలకి ఒక అనౌన్స్మెంట్ వినిపించింది. ప్రసాదం భక్తులకి ఇవ్వడానికి ఎవరైనా వాలంటీర్స్ కావాలని.. నేను వెంటనే చెంగున ఒక్క గెంతులో ప్రసాదం దగ్గరకి వెళ్లాను. అక్కడ ఒక పాతికేళ్ళ అబ్బాయి ఉన్నాడు. నేను వాలంటీర్గా ఉంటానన్నాను. అతను ఒక అరగంట ఉంటె చాలు సార్! నేను పొద్దుటినించీ ఉన్నాను. రాత్రి దాక ఉంటాను. కాస్త బ్రేక్ కావాలి అన్నాడు. నేను "దానికేం భాగ్యం! హాయిగా రెస్త్ తీసుకోండి. నేను గంట అయినా ఉంటాను" అని చెప్పాను.

అతను నాకు ఆ పటికబెల్లం ప్రసాదం, వాక్ మాసపత్రిక కాపీలు (అమ్మడానికి!) అప్పచెప్పి వెళ్ళిపోయాడు. నేను అక్కడ నిలబడి భక్తుల రాక కోసం చూస్తూ ఉండిపోయాను. ఎక్కువ మంది లేరని చెప్పానుగా, అందుకని అప్పుడప్పుడూ ఒకరిద్దరు లోపల దర్శనం చేసుకొని రావడం, నేను ప్రసాదం భారీగా ఇవ్వడం, వీలుంటే, వాళ్ళు కావాలంటే వాక్ పుస్తకం అమ్మడం చెయ్యడం మొదలెట్టా. కాసీపయ్యాక నాకు ఒక ఐడియా వచ్చింది. ఇలా భక్తులకి, భక్తులకి మధ్య చాల సమయం ఉంటోంది కదా నేనిక్కడ ఎందుకు అనవసరంగా నిలపడడం! అని. వెంటనే గర్భగుడిలోకి వెళ్ళిపోయి స్వామి వారిని చూస్తూ అక్కడే నిలపడిపోయాను. కాస్సేపయ్యాక ఇంకో భక్తబృందం లోపలి రాగానే నేను మళ్ళీ నా యధాస్థానం దగ్గరకి వెళ్లి నిలపడడం, వాళ్ళు బైటికి రాగానే ప్రసాదం ఇచ్చేసి, మళ్ళీ తుర్రుమని గర్భగుడిలోకి దూసుకు పోవడం!! ఇలా దాదాపుగా ఒక 45 నిమిషాలు ఈ నా "ప్రత్యేక దర్శనం" కార్యక్రమం జరిగింది. ఆ రోజు ఏదో ప్రత్యెక దినం కూడా అందుకని స్వామి వారిని బాగా అలంకరించారు! ఇక చూడండి నా ఆనందం! అలా అనుకోకుండా ఒక అరగంట నాకు దర్శనం దొరికింది.

(నేనొకప్పుడు సేల్స్ ఉద్యోగాలు చేసాను కాబట్టి ఆ కాస్త సమయంలో, పాత రోజులు గుర్తుతెచ్చుకుని, రెట్టించిన ఉత్సాహంతో  చాల వాక్ మాసపత్రికలు అమ్మాను!!)

నేను ఇంటికొచ్చాక నా భార్యతో ఈ విషయం చెప్పగానే తను వెంటనే నాకు ఇంతకుముందు వచ్చిన "తిరుమల ప్రత్యెక దర్శనం" కల గుర్తు చేసింది. బహుశా నమ్మ శక్యం కాక పోవచ్చు కాని ఆమె చెప్పేదాక నాకు ఆ కల గుర్తురాలేదు!! వెంటనే నాకు మరొక్క సారి వర్ణనాతీతమైన ఆనందం, అనుభూతి కలిగాయి. ఆ విధంగా హెడ్ ఆఫీసు (తిరుమల) ప్రత్యెక దర్శనం కల బ్రాంచ్ ఆఫీసు (చిల్కూర్) లో తీరింది.  నా కల నిజమయ్యింది ;)

ఇలా కల నిజమవ్వడానికి ముందో, తర్వాతో గుర్తు లేదు కాని, ఒకసారి తాడ్బండ్ ఆంజనేయ స్వామి గుడికి వెళ్లాను. అక్కడ దర్శనం అయ్యాక గుడి వెనక వేపు ద్వారం గుండా బైటికి వచ్చి, అక్కడ ఇచ్చే తీర్థ ప్రసాదాలు తీసుకొని గుడి పక్క కాంపౌండ్ లో వాహన పూజలు చేసే చోట నిలపడి ప్రసాదం తినడం మొదలెట్టాను. ఆ వాహన పూజకి వచ్చిన కొత్త, పాత కార్లు చూస్తూ. ఇంతలో సడన్ గా ఆ వాహన పూజలు చేసే పూజారిని చూడగానే నాకు వెంటనే ఆనందం వేసింది. ఎందుకంటే నా కలలో తిరుమల గుడిలో ఉన్న పూజారి ఈయనే!! నేను వెంటనే ఆయన చెట్టు కింద కూర్చొని ఇంకా వచ్చే కార్లకోసం ఎదురు చూస్తూంటే వెళ్లి వెంటనే నాకొచ్చిన కల సంగతి చెప్పాను. ఆయన వెంటనే అలా మీకు కలలో కనిపించింది నేను కాదు. నా రూపంలో హనుమంతులవారు! ఆ స్వామి వారు ఎవరికీ తన నిజస్వరూపంలో కలలో నైనా కనిపించరు. ఎవరో ఒకరి రూపంలో దర్శనం ఇస్తారు అని చెప్పారు. ఇది ఇంకో అద్భుతం! ఆయన వెంటనే మీకేమైనా వేంకటేశ్వర స్వామి వారికి బకాయీలు, మొక్కులు ఉంటే అవి తీర్చేయ్యండి అని ఒక సలహా ఇచ్చారు. బాకీలు అయితే బాగానే ఉన్నాయి కాని ఇప్పుడు తీర్చగలిగే పరిస్తితి లేదని ఒక వెర్రి నవ్వు నవ్వాను. ఆ పూజారి అయితే కనీసం ఏదైనా గుళ్ళో స్వామి వారి కళ్యాణం, అర్చన ఏదో ఒక సేవ చేయించండి అని చెప్ప్పారు. అలాగే చేసాను.
ఫుట్నోట్: ఇలా నా కల నిజమయ్యిందని నేనేదో దేవుడికి బాగా దగ్గర అని పొరపాటు పడకండి !!1998 లో అనుకుంటా చిలుకూరు గుడికి మొదటిసారి వెళ్ళాను. అప్పటినుంచి బహుశా ఒక డజన్ సార్లు వెళ్ళాను. అన్ని సార్లు ఒకటే కోరిక కోరుకున్నా! కాని ఇప్పటిదాక తీరలేదు :(

చాలాసార్లు నేను ఏ గుడికైనా వెళ్తే ఆ గుడి తలుపులు మూసేసిన సందర్భాలు కోకొల్లలు! నిన్న కూడా అదే అయ్యింది. ఒక 35 కిలోమీటర్స్ వెళ్ళాను. కాని 11-30 కే గుడి మూసేసారు:(

నా భక్తి లోపం అని మీరంటారని నాకు తెలుసు ;)

Monday, November 9, 2015

Diwali flashback!! దీపావళి ఫ్లాష్ బ్యాక్!!

ఫ్లాష్ బ్యాక్! ఫ్లాష్ బ్యాక్!!

అవి 1960's! నా చిన్నప్పుడు. దాదాపుగా 50 సంవత్సరాల క్రితం రోజుల్లో!!

దీపావళి వస్తోందంటే కనీసం రెండు మూడు వారాల ముందునించి హడావిడి, పని మొదలయ్యేవి! ఇప్పటిలాగా చిచ్చుబుడ్లు, మతాబులు అమ్మడం, కొనడం లేవు ఆరోజుల్లో! ఇంట్లో చేసుకోవడమే :)

రెండు వారాల ముందు ఖాళీ చిచ్చు బుడ్లు కమ్మరి వాళ్ళు చేసి అమ్మేవాళ్ళు.  కనీసం ఒక 30/40 కొనుక్కొచ్చేవాళ్ళం. ఆ తర్వాత వాటి మూతికి చిన్న పేపర్ అంటించి ఒక రోజు ఎండలో పెట్టేవాళ్ళం. తర్వాత ముందుగా కొంచం సిసింద్రి మందు ఆ చిచ్చుబుడ్డిలో వేసి (వెలిగించినప్పుడు సులభంగా అంటుకోవడం కోసం!) దానిమీద భాస్వరం, సూరేకారం, గంధకం (?!) కలిపిన మందు బాగా సగం దాకా కూరి, ఒక పేపర్ అడ్డుగా పెట్టి వెనకాతల బంకమట్టి కూరి, రెండు మూడు రోజులు బాగా ఎండ పెట్టేవాళ్ళం! అంతే చిచ్చుబుడ్డి రెడీ!

దీనితో పాటు మతాబులు కూడా చేసేవాళ్ళం. ముందుగా పాత న్యూస్ పేపర్లని సుమారుగా ఒక అడుగు పొడువున్న గోట్టాలుగా తయారు చేసేవాళ్ళం, ఒక చివర చిన్న వత్తి లాగ చేసి.  దానికోసం మైదా పేస్టు మా అమ్మ చేసిచ్చేది. ఆ గొట్టాలు ఆరాక, వాటిల్లో కూడా ముందుగా మందు గుండు సగం దాక కూరి, వెనక సగం ఇసకతొ నింపి గొట్టం మూసేసే వాళ్ళం. వాటిని కూడా రెండు రోజులు బాగా ఎండపెట్టాక మతాబులు కూడా రెడీ!

మిగిలిన సిసింద్రి మందుతో ఎన్నొస్తే అన్ని సిసింద్రీలు చేసేసేవాళ్ళమి.

ఆ తర్వాత దీపావళి రోజు దాకా  అబ్బాయిలందరికీ "రోలు, రోకలి", కేపులు!! కేపులు కాల్చడానికి రెండు రకాల పిస్తోళ్లు ఉండేవి! ఒకటి పిస్తోలు లాగా ఉండదు. దాన్ని వర్ణించడం కూడా కష్టం!! ఒక మెటల్ ప్లేట్ మీద స్ప్రింగ్ ప్లేట్ ఉండేది. అందులో ఒక్కొక్క కేపు పెట్టి కాల్చాలి! పిస్తోళ్లు వచ్చాక కేపు రీళ్ళు రావడం మొదలయ్యింది. అప్పుడు చూడాలి మా మొహాలు! మతాబుల కంటే వెలిగిపోయేవి! ఎందుకంటారా లూజు కేపుల నించి రీళ్ళు కేపులు వస్తే మా ఫీలింగ్ ఎలాగ ఉండేదంటే, జోడుగుళ్ల గన్ ఉన్న వాడికి AK47 ఇచ్చినట్టు  ;)

ఆ పిస్తోళ్లు పట్టుకొని ఇల్లు వాకిలి, చెట్టూ, పుట్టా, ఊరు, వాడా అన్నీ పరిగెడుతూ "దొంగా పోలీస్" తెగ ఆడేవాళ్ళం. మధ్య మధ్యలో భయంకరమైన, నాలాంటి కాల్చేవాడు కూడా భయపడేంత (!) శబ్దం చేసే "రోలు, రోకలి"! దాన్ని నేను అటు వేపు చూడకుండా, ఒక చెవి, రెండు కళ్ళు మూసేసుకొని,  డాం అని పేల్చే వాడిని :(

నలుగురు పిల్లలం, అప్పుడప్పుడూ మావయ్యలు! ఫుల్ పండగే పండగ!

లీలగా గుర్తుంది. మా నాన్న ఒక మట్టి హుండీలో సంవత్సరం అంతా డబ్బులు వేసేవారు. అప్పుడప్పుడూ దీపావళి కి అది నిండితే దాన్ని మా నలుగురిని పిలిచి గది మధ్యలో ధబీలు మని కింద పదేసేవారు! అంతే గదంతా చిల్లర, మట్టి పెంకులు!! మేమందరం ఆ చిల్లర మొత్తం ఏరి, సార్ట్ చేసి లేక్కపెట్టేవాళ్ళం! ఎంతో చెప్పలేని ఆనందం! ఒక్కోసారి ఆ హుండీ డబ్బులతో మా అందరికీ కొత్త బట్టలు కొనేవాళ్ళు!

ఇహ దీపావళి రోజు సాయంత్రం అన్నీ కాల్చేసి, కొన్ని దాచేవాళ్ళం. తర్వాత రెండు రోజులు, వారం తర్వాత నాగుల చవితి రోజు కూడా కాల్చేవాళ్ళం!!

ఇప్పుడు అంత సరదాలు, హడావిడులు కనుమరుగయ్యాయి. బాణాసంచా కాల్చడం కూడా రాను రాను తగ్గిపోతోంది. ఇంకొన్నాళ్ళకి అంతా కంప్యూటర్ లోనే కాలుస్తారు ఏమో :(

Dilwali Diwali

I've posted this last 2 years too!! In case you've read it you may skip this ;)

Almost all employees working in both public and private sector look forward to Diwali bonus from their employers and those who get it are delighted!!

Just think for a moment...there are many "employees" working for you too! Like maid, driver, apartment watchman, colony gurkha, car cleaner, garbage collector etc. They too "wish" "if only we too get some Diwali bonus"! So how about "giving" that bonus to ALL your service providers?!

Remember real Happiness is in giving! Surprise them with cash and/or crackers or any gifts along with a sweet box! Believe me you'll make their day/Diwali. The bonus need not be huge but just the very act of giving it to them matters most.

So go ahead and "Light up their lives this Diwali"!!

Have a Dilwali Diwali :)

Thursday, September 24, 2015

Lite Lelo!!

ముందస్తు మాట: ఈ నా "రచన" ఆంధ్రప్రభ నవంబర్, 1992 లో వేసారు.

"లైట్ లేలో"

ఓ రోజు ఆఫీసులో తీరిగ్గా కూర్చున్నప్పుడు, అంటే రోజూ తీరికే - అది వేరే విషయం , మా శర్మ నా దగ్గరకొచ్చి "ఇహ నా వాళ్ళ కాదండీ!" అన్నాడు.

ఇందులో కొత్తేమీ లేదు. వింత అంతకన్నా లేదు. కనీసం రెండు మూడు రోజులకోసారైనా  శర్మ నోటినుంచి ఆ డైలాగ్ వినిపిస్తూంటుంది. కాకపోతే ఒక్కోసారి ఒక్కో కారణం.

ఇప్పుడేమయ్యిందో?!

అదే అడిగాను.

"వానలగురించి ఆకాశంలోకి చూసి చూసి మెడ పట్టుకుపోతోందే తప్ప ఒక్క చినుకైనా రాలలేదు కదా?" అన్నాడు మెడ పట్టుకుని.

అతనన్నదాంట్లో ఆవగింజంత అబద్ధం కానీ అతిశయోక్తి కాని లేవు. ఈ ఏడాది హైదరాబాద్ ప్రజానీకం వానలకు ఎంత మొహం వాచిపోయారంటే, ప్రతిరోజూ సాయంత్రం, పగలు పనులుంటాయి కదా, ఇంటిముందు కుర్చీ వేసుకుని ఆకాశంలోకి చూడటం ఒక అలవాటైపోయింది.

ప్రజలంతా చకోరపక్షులైపోయారు కాని చుక్క వాన లెదు.

"మా కాలనీలో నిన్న ఓ నిమిషం వాన పడిందోయ్!" అని అదేదో డబల్ మర్డర్ అయినంత సెన్సేషనల్ న్యూస్ లాగా జనం చెప్పుకోవడం చిన్న ఫాషన్ కూడా అయ్యింది.

సరే, కథ మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మా శర్మ దగ్గరికి, ఆయన అరిగిపోయిన డైలాగ్ దగ్గరికి వద్దాం. మా శర్మకి ఏదో విధంగా ధైర్యం నూరిపోయకపోతే ఆయన ఇంకా నీరు కారిపోవడం, అతన్నలా చూసిన మిగతా వాళ్ళందరూ జావ కారిపోవడం వగైరా ప్రమాదం ఉంది. ఎంచేతంటే మా అందరిలోనూ శర్మ చాలా భారీ మనిషి. కొద్దో, గొప్పో చిన్న లీడర్ కూడా . మరంచేత అతన్ని కొంచం మూడ్ లోకి తెద్దామని "అయితే పదండి! "దేవి" లో మంచి సినిమా ఆడుతోంది దాన్నిండా వాన పాటలే!" అన్నాను   

ఈ డైలాగ్ మిగతా ఆంధ్రులకు కొంచం వింతగా అనిపించినా, మా హైదరా"బాధీ"యులకు మాత్రం ఏ మాత్రం వింత కాదు. ఇన్నాళ్ళూ మేము కూడా సినిమాలకి "చిరు"ని చూడ్డానికో, "విజైశాంతి" రెచ్చిపోయిందనో, అదీ, ఇదీ కాకపోతే పాటలు సూపర్ హిట్లనో వెళ్ళేవాళ్ళం.

కాని ఇప్పుడో - సినిమాలో వాన ఉంటె చాలు రెచ్చిపోయి చూసేస్తున్నాం. లేకపోతే వానలు ఎలా ఉంటాయో మరిచిపోయే ప్రమాదం ఉంది కదా!

ఈనాడన్ని సినిమాల్లోనూ ఓ వాన పాట మస్ట్. మన అదృష్టం బాగుంటే రెండు వాన పాటలు. ఇంక ఆ సినిమా మా ఊళ్ళోమట్టుకు వందరోజులు ఖాయం. "ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఇలాంటి పాటలు వగైరా సినిమాలో పెడుతున్నాం" అని నిర్మాతలు, దర్శకులు చెప్పడం ఎంత నిఝమ్!!

కాగా, పోగా ఇప్పుడు మేము "చిరు"కోసం కాకుండా చిరుజల్లు కోసం సినిమా చూస్తున్నాం!

అసలీ ఏడాది వానలెందుకు పడటంలేదు అని ఈ మధ్య టీవీలో వాతావరణ శాఖ డైరెక్టర్నిడైరెక్ట్ గా ఇంటర్వ్యూ చేసారు.

"వానలు పడకపోవడం ఏమిటి?! శుభ్రంగా పడుతున్నాయి" అన్నాడాయన.

ఆ ఇంటర్వ్యూ ని తిలకిస్తున్న ప్రజానీకం సగంమంది మూర్ఛపోయారు. ఇంటర్వ్యూ చేసే అమ్మాయి కూడా మూర్చిల్లింది. వెంటనే ఆ వాతావరణ డైరెక్టర్ పక్కనే ఉన్న గ్లాస్ లోని నీళ్ళు - కొంప తీసి అవే వాన నీళ్లంటాడేమో? - ఆ అమ్మాయి మొహం మీద చల్లాడు. ఆ ఉపశమనానికి ఆమె "లైట్"గా  తేరుకొని వెర్రి చూపులు చూడటం ప్రారంభించింది.

ఇంక ఆ డైరెక్టర్ గారు (వాతావరణ శాఖ) పరిస్థితి అర్థం చేసుకుని తనే ప్రశ్న వేసుకుని, తనే జవాబు చెప్పి ద్విపాత్రాభినయం చేసాడు. దాని సారాంశం ఏమిటంటే ..

"హైదరాబాద్ లో వానలు చాలా భారీగానే పడుతున్నాయట. అయితే మబ్బుల్లోనుంచి కిందకి ప్రయాణం కట్టిన చినుకులు ఈ భూమ్మీద వేడికి మార్గమధ్యంలోనే ఆవిరైపోయి మళ్ళీ మబ్బులైపోతున్నాయిట. ఇదొక విషవలయంగా తయారయ్యిందిట. దీనికేమైనా ప్రత్యేకమైన చర్యలు సిఫారసు చెయ్యమని ప్రభుత్వం ఓ "మబ్బు కమిటీ"ని కూడా వేసిందిట. వాళ్ళ నివేదిక అందగానే తక్షణ చర్యలు తీసుకుంటారుట. అప్పటివరకు హైదరాబాద్ లో వానలు పడతాయి కాని భూమ్మీద పడవుట. అంటే "టెక్నికల్"గా వానలు పడుతున్నాయి కాని "ప్రాక్టికల్"గా కాదుట" వగైరా వగైరా - ఇలాగే సాగింది ఆయన ఇంటర్వ్యూ ప్రహసనం.

పాపం ఈ పడీపడని వానలకి మొన్న ఆదివారం మావాడు - అయిదేళ్ళ  కుర్రకుంక బలైపోయాడు. అదెలాగంటే - ఆదివారం మధ్యాహ్నం మూడున్నరకి బైట ఆడుకుంటున్న వాడు లోపలికి పరిగెత్తుకొచ్చాడు.

"అమ్మా! అమ్మా! వాన ....వాన పడుతోంది" వాడి ఆవేశానికి, ఆనందానికి పట్టపగ్గాల్లేవు.
కాని జీవితంలో అన్ని ఆనందాలు క్షణికమే అని వాడికి ఓ క్షణం ఆలస్యంగా తెలిసింది!

ముందు వాడు, వాడి వెనకాల వాళ్ళ అమ్మ, నేను బయటకు పరిగెత్తాం. "ఏరా, వెధవా! వేలెడంత లేవు! అప్పుడే అబద్ధాలు మొదలెట్టావా?" అని వాడిని బాదేసింది కన్నతల్లి.
ఆవిడకు ప్రధమ కోపంలెండి!

పాపం! వీడికి మతిపోయింది. వాడు లోపలికి  100 కిలోమీటర్ల వేగాన పరిగెత్తాడే? అయిదు సెకన్ల క్రితం పడిన వాన ఏమైనట్టు? వాన పోయి దెబ్బలు మిగిలాయి.

"వర్షాధార బతుకు"లంటే ఇవేనా?!

వాడు వాకిట్లో ఉన్నప్పుడు చినుకులు మొదలెట్టడం నిజం. కాని వాడు లోపలి వచ్చి, మళ్ళీ బయటకు వెళ్ళేటప్పటికి ఆ పడిన నాలుగు చినుకులు ఆవిరైపోవడం, అది నాలుగు చినుకుల  వానగానే ఆగిపోవడం, వాడి వీపు విమానం మోత మోగడం చాల దారుణంగా జరిగిపోయాయి.

కేవలం "క్షణక్షణముల్ హైదరాబాద్ వానల్".

ఈ మధ్య ఈ ఊళ్ళో పెళ్ళిళ్ళల్లో గుమ్మం దగ్గర పన్నీరు జల్లడం మానేశారు. ఎందుకా? అమ్మాయిలు పన్నీరు బుడ్డీతో తలమీద పన్నీరు చల్లగానే  - ఇక ఈ జీవితంలో వానలు చూడవేమో అని బెంగపెట్టుకున్న ప్రజల నెత్తిమీద నిజంగా పన్నీరు జల్లులా అనిపించి ఎవ్వరూ అక్కడినుండి కదలడం మానేశారు. దాంతో పన్నీరంతా అయిపోయి, అమ్మాయిలు చేతులు నొప్పి పెట్టి, వాళ్ళు నీరు కారిపోయి, ఇక చల్లడానికేమీ మిగలక ఈ సంప్రదాయాన్ని మానేశారు.

ఇంతకీ అసలు కథ - మొత్తానికి శర్మని దేవీలో సినిమాకి లాక్కుపోయాను. సినిమా అయ్యాక జీవుడు తెగ ఆనందపడిపోయాడు. నేను స్కూటర్ తీస్తున్నాను.

"ఏమండోయ్! సినిమాలో వాన కొంపతీసి హాల్ల్లోగాని పడిందేవిటండీ?" అన్నాడు మహదానందంగా.

కొంపతీసి ఈ చకోరపక్షిగాడికి చూడక చూడక రెండు వానలు చూడగానే పిచ్చెక్కలేదు కదా? పూర్ ఫెలో!

"ఎందుకొచ్చిందా సందేహం?" సందేహించాను.

"మరేం లేదు. బట్టలన్నీ తడిసి ముద్దయిపోతేను!" అన్నాడు శర్మ

అది వాన మహత్యం కాదని, ఆ హాల్ ఏ.సి. మహాత్యం అని చాల కష్టపడి నమ్మించాను. కాని తరువాత జాలేసింది.

ఆ అమాయకుడిని ఆ వెర్రి నమ్మకంలోనే ఉంచేస్తే బాగుండేదేమో?!   


Tuesday, September 22, 2015

Unveling an hitherto unknown dimension of my life!!


This IS a long post! Read on to know an unknown facet of my life!

Exactly 35 years ago! 22nd September, 1980 evening around 8 PM. ....flashback!! Am posting this almost exactly to the minute;)

Unveiling a hitherto little known fact of my life!!

On that day, I was eagerly awaiting in Sri Venkateswara Vignana Mandir, Guntur, one among many hopefuls, waiting for the announcement of names of Winners!!

Cut to 1 day before. I've participated in the Grand Scooter Endurance Rally organized by Rotary Club of Guntur on the previous day. It was about 100 K.M.s starting from the Parade Grounds, Guntur and going to Managalagiri onward to Tenali and back, a triangular route. I didn't know, as are the others, anything about motor rallies till then! We all participated in the briefing one day before and all I could understand was that to win we have to maintain the given timings in the given sections! It was a Time, Speed, Distance rally and I had a Priya scooter (well my dad bought it and I was in my final semester of MBA!). I've successfully completed the rally and there were no navigators! Only the rider has to check the TSD charts and maintain those speeds. Of course very safe speeds were given and the most painful part is that we've to actually maintain very low speeds for longer periods! That's why it was called Grand Endurance Rally!!

Next day evening all of us gathered in the huge auditorium and it was the concluding function of their Youth Activities Week celebrations and lots of participants of other games, contests etc., as well as all the members of the Rotary and Rotaract Clubs were there numbering 500+ people in the auditorium! I waited for the announcement of results of our Rally but to my disappointment they announced in the beginning  of the meeting itself that the tabulation of results is still going on and the results will be announced as soon as they were ready!

I wasn't expecting any prize as it was the very first Rally I've participated. But was there just out of curiosity and perhaps with a faint hope! Finally around 8 PM they started announcing the top 3 prizes of the Rally. First prize winner announced! It wasn't my name :( Ditto with the second prize!! And out of the blue I heard my name being announced as the Third prize winner!!

Wow! It was music to my ears and an unbelievable experience, receiving the prize from a dignitary in front of some 100's of people!

(It was the 2nd time for me to receive a prize, first time was in my 7th class when I got a prize for “Best actor” (!) or some such thing for a doctor's role I've played in the school anniversary! I got a soap box as prize for that, a prized possession in those days ;) )

Well another unexpected bonus that evening was an over excited Rotary club member suddenly announced cash prizes to all the winners of the rally!! And I don't exactly remember but I think  it was either Rs.500 or Rs.1,000 which was a HUGE amount in those days!

Am posting the photos of the function and try to identify me ;) Yes! I was THAT thin in those days :(

And I walked err floated in the air and reached home and after showing off my shield to my family immediately rushed to my friends cum classmates room which was just 200 yards from my home and shared that joy with all of them. Next day I showed it off in my University and boasted that I missed the 2nd prize as I wasn't wearing the helmet ;)

That win in the very first Rally got me hooked to motor rallies and after coming to Hyderabad few years later I joined Andhra Pradesh Motor Sports Club (APMSC) and started participating in their Club Rallies for amateurs. Since I had no money to modify my bike to participate in the bigger events I've confined myself to the club events as well as “Treasure Hunts” (fun family events which involve solving clues and visiting those spots) organized by the club.

In one of the rallies I drove my brand new Ind Suzuki motorcycle at speeds of around 100 KMPH in the competitive segments which typically run through the hinterland through villages and all of you should be knowing the condition of rural roads 35 years ago. And in the TSD rallies higher speeds are given in the hinterland and speeds of 20 KMPH are given in the city!! First time I've experienced riding a bike an inch or two above the ground, it was literally flying!! Unfortunately motor rallies aren't exactly a spectator sport and doesn't have much following in India back then at least.

I still remember in one of the rallies I ran out of petrol about 30 K.M.s from Hyderabad and  if I remember correctly it was somewhere in the Vikarabad area. And our only option was to go back about 10 K.M.s to a village which we crossed and where we saw a guy selling petrol in barrels! But how to travel 10 K.M.s and that too on that road with lots of steep gradients?! We stopped a villager on a bike and my brother pillion rode on his bike holding my left hand and dragging me and my bike all along! At some points I literally cried in pain especially while he was pulling me up the steep gradients, literally an uphill task. I've a suspicion that my left hand must've grown at least half an inch longer that day!! In the same rally I distinctly remember another rider NTR as he was called (N Tirumal Roy) had a flat tire but he cut off the tube and tire and completed the last leg of the rally riding on the rim!! Oh Boy!! That was what you call guts. He later became famous in the rally circuit.

As I was unable to participate in the bigger events, to satiate my appetite for rallying, I started thinking out of the box (yes I used to think out of the box even as a student, though that term was coined much later!) and used to volunteer for the Time Check controls  for the Charminar Challenge Rally one of the prestigious events of APMSC in those days! I along with 2/3 other friends used to man one of the Time Control check points and it was an unbelievable experience, sitting in the Narsapur forests in the night and waiting for the very first car to drive in. And the rush of adrenaline even as a Time Keeper when those cars zoomed in was to be experienced. I used to enjoy that experience thoroughly. Later on as I became older I somehow lost interest in mid 90's.

Well, now you “know” that hitherto unknown dimension of my life ;)



Monday, September 21, 2015

Money Plant!!!

టమాటో మొక్కలకి టమాటోలు, బెండ మొక్కకి బెండకాయలు, వంకాయ మొక్కకి వంకాయలు కాసినట్టే మనీ ప్లాంట్ కి డబ్బులు  కాస్తాయని నమ్మాను. ఎందుకంటే నేను తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్ళు అని నమ్మే టైపు! ఘోరంగా మోసపోయాను. రోజూ బోల్డు నీళ్ళు పోసి (అది కూడా డబ్బు పోసి కొన్న నీళ్ళు! ఎలాగో రేపో ఎల్లుండో డబ్బులు కాస్తాయి కదా గుబురు గుబురుగా అని పెట్టుబడి పెట్టాను!) ఎంతో ప్రేమగా పెంచాను. విస్తరాకులంత ఆకులు పెరుగుతూంటే, కాయబోయే డబ్బులకి విస్తరేసుకొని కూర్చున్నాను.

అంతా వృధా! మహాకవి శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పారు "ముందు దగా వెనక దగా! కుడి ఎడమల దగా దగా!!" అని. పెద్దల మాటలు వినకపోతే ఏమవుతుందో మరొక్కసారి తెలిసింది.  ఆ మనీ ప్లాంట్ పీకి బైట పారేసాను. అదృష్ట వశాత్తు నాకేమి ఆకాశవాణి "మొక్కే కదా అని పీకితే....  .."  అని ఏమీ వినిపించలేదు ;) లేకపోతే డబ్బూ పాయె, శని పట్టే అన్నట్టయ్యేది నా పరిస్థితి! బ్రతికిపోయాను.

చేతికి అంది వస్తుందనుకున్నది చెయ్యి జారి పోతే నేనయితే ఈ మనస్తాపం తట్టుకున్నాను కాని ఇంకెవరయినా అయితే?!

Friday, September 18, 2015

Life's purpose or Jeevita Lakshyam !!

కొంతమంది జీవితాలు చూస్తే వాళ్ళు "కారణజన్ములు" ఏమో అనిపిస్తుంది. పుట్టీ పుట్టగానే పరిమళిస్తారు. వాళ్ళనుకున్నది తొందర తొందరగా సాధించేసి ఏదో పెద్ద అర్జెంటు పనున్నట్టు వెళ్ళిపోతారు. ఉదాహరణకి ఆది శంకరాచార్య, స్వామి వివేకానంద, రామానుజన్. మాండొలిన్ శ్రీనివాస్ కూడా అదే కోవకి చెందినవాడు.

నాలాంటి "అకారణజన్ములకి" ఎందుకు పుట్టామా అన్నది తేల్చుకునేలోపలే జీవితం అయ్యిపోతుంది:(

అసలు ఆలోచిస్తూంటే దేవుడు మనుషులందరికీ చాల అన్యాయం చేసాడనిపిస్తోంది! ఎంచక్కా మనందరం పుట్టినప్పుడు మన కాలి బొటనవేలికో, మెడకో ఒక చిన్నట్యాగ్ మన జీవితంలో సాధించాల్సినది రాసిపెట్టి పంపించచ్చుగా? అప్పుడు మనకి యుక్త వయస్సు రాగానే, మన తల్లితండ్రులో, లేదా పెంచిన పెద్దవాల్లో మనల్ని పిలిచి "ఒరే అబ్బీ! ఇదిగోరా నీ జీవితలక్ష్యం అని ఇనప్పెట్టేలో అన్నాళ్ళు భద్రంగా దాచిన ఆ చీటీ మన చేతిలో పెడతారు. అప్పుడు మనం ఎంచక్కా, చేతనైతే చకచకా, చేతకాకపోతే ఒకింత నిమ్మదిగా మన జీవిత లక్ష్యం సాధించేసి హాయిగా కాళ్ళు చాపుకొని కుర్చోవచ్చు :)
 
ఈ ఫెసిలిటీ లేకపోవడంతో చూడండి ఎంత ఇబ్బందో? నా మట్టుకు నాకు దాదాపుగా రిటైర్మెంట్ వయసు దగ్గరపడుతున్నా ఇప్పటిదాకా నేనెందుకు పుట్టానో తెలీకపోవడంతో, నేను దుష్ట రక్షణ చెయ్యాలో, శిష్ట రక్షణ చెయ్యాలో తెలీక అలా పడక్కుర్చీలో కాళ్ళూపుకుంటూ కాలయాపన చేసేస్తున్నాను. ఇదేమన్నా బాగుందా? నాకయితే బాలేదు.

మీరేమంటారు?!!

Antharvani and Akashavani

నా చిన్నప్పుడు అంటే 60's , 70's లో చాలా తెలుగు సినిమాల్లో అంతర్వాణి, ఆకాశవాణి చిన్న ప్రధాన పాత్రలు పోషించేవి!

ఇక అంతర్వాణి విషయానికొస్తే నిలువుటద్దాలే దాని ఇల్లు! హీరో కాని హీరోయిన్ కాని లేదా వాళ్ళ తండ్రి కాని ఏదైనా ఒక "వెధవ" పని చేయ్యపోతే ఇది వెంటనే రంగంప్రవేశం చేస్తుంది. వాళ్ళు అద్దం ముందుకి రాగానే అది వెంటనే "వాళ్ళ ప్రతిబింబం" లా కనిపించి, మంచి ఎఫెక్ట్ కోసం ఒక వికటాట్టహాసం చేస్తుంది. వెంటనే ఆ సదరు పాత్రని పట్టుకొని "తళతళ" తప్ప ఇంకేది మిగలకుండా ఉతికి ఆరేస్తుంది. "ఆయ్! ఏమిటి నువ్వు చేద్దామనుకుంటున్నది. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి? ఎందుకింత అన్యాయానికి ఒడిగట్టావు?" ఇట్లా ఆ కథని పట్టి కడిగేస్తుంది! అప్పుడప్పుడూ మంచి పని చేద్దామనుకున్న వాళ్ళని వెధవ పని చెయ్యమని ప్రేరేపించడం కూడా ఉందండోయ్!! అప్పుడు ఆ హీరో కాని హీరోయిన్ ఉడుక్కొని వెంటనే చేతిలో ఏదుంటే అది కోపంతో ఆ అద్దంమీదకి విసిరేస్తారు! అప్పుడు ఆ అంతర్వాణి ఆ పగిలిన అన్ని అద్దం ముక్కల్లోనూ కనిపిస్తూ, వికటాట్టహాసం రిసౌండ్ వచ్చేలా నవ్వుతూ అదృశ్యం అయ్యిపోయేది! అలాంటి సినిమా చూసి ఇంటికొచ్చాక రెండు రోజులదాక తల దువ్వుకోవడానికి కూడా అద్దం జోలికి పోయేవాడిని కాదు :(

అపుడప్పుడూ హీరో కాని, తరుచుగా హీరోయిన్ కాని భారీ కష్టాల్లో పడ్డప్పుడు "ఆకాశవాణి" ఒక విషాద గీతం ఎత్తుకునేది! అసలే ఆకాశంలో ఎత్తుగా ఉంటుందేమో ఆ పాటలు కూడా సాధారణంగా పై స్థాయిలోనే (High pitch!) ఉండేవి. ఈ ఆకాశవాణి పాటల్లో ప్రధాన వాద్యం వయోలిన్!! ఆ వాయులీనంలో ఈ ఆకాశవాణి పాట లీనమయ్యిపోయేది. ఆ పాట వస్తున్నంతసేపు హీరో లేదా హీరోయిన్ ఒకటే భారీ బరువులు మోస్తూండడం, లేదా భారీ వర్షంలో రోడ్ మీద రాత్రిపూట చీకట్లో, మెరుపుల వెలుగులో అలా నడుచుకుంటూ వెళ్లిపోవడమో చూపించేవాళ్ళు. లేదంటే ఎవరికైనా వర్షంలో ప్రసవం!!

ప్చ్! ఇప్పటి సినిమాల్లో అంతర్వాణి లేదు. ఆకాశవాణి లేదు.  రెండు వాణిలు అంతర్ధానం అయ్యిపోయాయి.  

Wednesday, September 16, 2015

Vinayaka Chavithi in 60's

నేను స్కూల్లో చదివేటప్పుడు, అంటే మూగమనసులు సినిమా ఫస్ట్ సీన్లో ముసలాయన అన్నట్టు "ఎప్పటి కథ బాబు?", 60's లో వినాయకచవితి ముందు రోజు మధ్యాన్నం స్కూల్ సెలవిచ్చేసేవాళ్ళు. అంతే వెంటనే అబ్బాయిలందరం ఊరి మీద పడి, కనిపించిన ప్రతి మొక్క, చెట్టు విచక్షణ లేకుండా పీకేసి, ఇంక మొయ్యలేము అనుకున్నప్పుడు ఇంటికెళ్ళి, సంజీవిని పర్వతం పెకిలించి తీసుకొచ్చిన హనుమంతుడి లాగ (హనుమంతుల వారు ఖచ్చితంగా మా అంత పోజు పెట్టి ఉండక పోవచ్చు!) పెద్ద పోజు ఇచ్చేవాళ్ళం! ఆ రోజుల్లో ఇప్పటిలాగా విరివిగా కెమెరాలు లేవు కాబట్టి ఆ "సెల్ఫీ"లు అన్నీ నా హృదయంలోనే ఉండిపోయాయి. మన మనసులో ఉన్నది ప్రింట్ చేసే రోజు త్వరలోనే వస్తుందని నా ఊహ! ఆశ! అప్పుడు ఆ "సెల్ఫీ" ప్రింట్ తీసి పోస్ట్ చేస్తాను.;)

ఆ తర్వాత వినాయక చవితి రోజు, ఇద్దరు అక్కలు, నేను ఒక తమ్ముడు పాలవెల్లి కట్టడం, మా చేతనైనంత దాన్ని అలంకరించడం షరా మామూలే! పిల్లలం కదా? పూజకంటే ప్రసాదం మీదే ధ్యాస ఎక్కువ ఉండేది. కాని పిల్లల్ని దేవుడు ఇలాంటి విషయాల్లో తప్పు పట్టడు. ఇలాంటి విషయాలేంటి, ఎలాంటి విషయాల్లోనూ పిల్లల్ని దేవుడు అపార్థం చేసుకోడు. ఎందుకంటే "పిల్లలూ, దేవుడూ చల్లని వారే! కల్లాకపట మెరుగని కరుణామయులే" అన్న పాట మీ అందరికీ గుర్తుండే ఉంటుంది!!

ఈ రోజుల్లో కరివేపాకు, కొత్తిమీర దగ్గర నించీ అన్నీ కొనుక్కోవడమే! ఇక వినాయకుడి పూజకి పత్రీ సంగతి చెప్పనఖ్ఖరలేదు. ఆ సరదాలు అన్నీ "హుష్ కాకి" :(
 
నాకందుకే అప్పుడప్పుడూ "ఏంటో గురూ? ఆ రోజులే వేరు" అని వేటగాడు సినిమాలో రాజబాబు లాగ ఒక పెద్ద నిట్టూర్పు వదలాలనిపిస్తూంటుంది:(

ఇంకా రాద్దామని ఉంది కాని ఇప్పుడు వెళ్లి రేపటి పూజకి పత్రీ కొనుక్కు రావాలి కదా? అందుకని ఇప్పటికి శెలవు!

Friday, September 11, 2015

Facebook in Telugu!!

కొంత మంది తెలుగు భాషా వీరాభిమానులు పేస్బుక్ ని ముఖపుస్తకం అని తరుచుగా రాయడం చూస్తున్నాను. అప్పుడప్పుడు సరదాకి రాస్తే బాగానే ఉంటుంది కాని ఎప్పుడూ అలాగే రాస్తేనే కొంచం ఇబ్బందిగా అనిపిస్తోంది నాకెందుకో అది సబబు కాదు అనిపిస్తుంది. ఫేస్బుక్ అనేది ఒక పేరు. కేవలం ఆ పేరు రెండు ఇంగ్లీష్ పదాలతో చెయ్య బడిన ఒక కొత్త పదం! దానికి అనువాదం ఉండదు ఎందుకంటే అదొక పేరు! పేర్లని నామవాచకం అంటారని లీలగా గుర్తు! నామవాచకాలని తర్జుమా చెయ్యకూడదనుకుంటా?!

రెండు ఇంగ్లీష్ పదాలు కనిపించినంత మాత్రాన దాన్ని అలా విడగొట్టి అనువాదం చెయ్యడం ఎబ్బెట్టుగా ఉంటుందేమో? ఇదే పద్ధతిని అవలంబించాలంటే ఎవరెస్ట్ పర్వతాన్ని eve rest అన్న రెండు పదాలు ఉన్నాయి అని చెప్పి "అమ్మాయి విశ్రాంతి" అంటున్నామా? లేదుగా? సింగపూర్ పదంలో sing a pore అన్న మూడు మాటలున్నాయని "పాడు ఒక సూక్ష్మరంధ్రము" అంటామా?

మీరేమంటారు?!!

Monday, August 31, 2015

Betalprasna!!

ఈనాటి #బేతాళప్రశ్న !! కంగారు పడకండి! "ఈనాటి" అంటే ప్రతిరోజు బేతాళప్రశ్నలు వేస్తానని కాదు! ఏదో అప్పుడప్పుడూ!!

నేను కారులో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగితే హైదరాబాద్ లో సిగ్నల్స్ దగ్గర సర్వ సాధారణంగా ఒక బిచ్చగత్తె కిటికీ అద్దాన్ని, దాని ఇంటి తలుపు తట్టినట్టు, తట్టడం మొదలెడుతుంది! ఇది నాకు బాగా ఇర్రిటేట్ చేసే విషయం కాని ఏమి చెయ్యలేని పరిస్తితి. పొరపాటుని ఏమన్నా నోరు జారి అన్నామంటే "పోకిరి" సినిమాలో లాగా రేపటి నించీ నన్ను టార్గెట్ చేసి బాధపెడతారేమో అని, నోరుమూసుకొని వాళ్ళున్న వేపు చూడకుండా,  రెండో వేపో, ఎదురుగానో చూస్తూ ఉంటాను. వాళ్ళు అలా కిటికీ అద్దంమీద కొట్టీ, కొట్టీ, విసిగి వెళ్ళిపోతారు.

ఇంతకీ ఇలా అసలు విషయం చెప్పకుండా నానుస్తున్నానని భావించే పాఠకులకి ఒక మనవి. ఇదే బేతాళ కథ చందమామలో వస్తే నాలుగు పేజీల తర్వాత బేతాళుడు రంగప్రవేశం చేస్తాడు కదా అందుకని నన్ను కనీసం నాలుగు లైనులు రాయనివ్వండి!

ఇక అసలు కథలోకి వస్తే ఒకరోజు నేను నాఫ్రెండ్ నా కారులో వెళ్తున్నప్పుడు ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాము. నా ఫ్రెండ్ కిటికీని ఒక బిచ్చగత్తె మాములుగానే ఠపఠప కొట్టడం మొదలెట్టింది. నేను కూడా మామూలుగా రెండో వేపు చూస్తూ, నిమ్మకు నీరెత్తినట్టు, కూర్చున్నాను. ఇంతలో నా ఫ్రెండ్ కిటికీ అద్దం దించేసి, రెండు సీట్లకి మధ్యలో నేను అపురూపంగా దాచుకున్న చిల్లరలోంచి ఒక అయిదురూపాయల కాయిన్ మంచి స్టైల్ గా తీసి ఆమె చేతిలో వేసాడు, నేను ఆపేలోపల :(

నాకు బోల్డు కోపం వచ్చింది. కాని ఏం మాట్లాడకుండా, సీరియస్గా (ఏడుపు) మొహం పెట్టుకోని గ్రీన్ సిగ్నల్ రాగానే అక్కడినించి నిష్క్రమించాను. పక్కవాళ్ళదయితే అయిదు రూపాయలేం ఖర్మ, అగ్రహారాలే దానం ఇస్తాను నేనైతే!

ఇంతకీ బేతాళప్రశ్న ఏమిటంటే ఆ బిచ్చగత్తెకి డబ్బు వేసింది నా ఫ్రెండ్ కాబట్టి, ఆ 5 రూపాయల పుణ్యం నా ఫ్రెండ్ కి వస్తుందా? డబ్బు నాది కాబట్టి పుణ్యం నాకు వస్తుందా? లేక ఇద్దరికీ చేరి సగమా?

సమాధానం తెలిసీ చెప్పకపొతే ఏమవుతుందో నాక్కూడా తెలీదు :(

NB: అద్దిరబన్నా ఇన్నాళ్ళకి ఒక బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చే అవకాశం వచ్చింది కదా అని మొత్తం పుణ్యం నా ఫ్రెండ్ కే చెందుతుంది అని చెప్దామనుకునేవాళ్లకి ఒక చట్ట బద్ధమైన హెచ్చరిక. (ఎందుకంటే ఆ దానం నా అనుమతి లేకుండా చేసాడు కాబట్టి!) అలాంటి తీర్పు ఇచ్చిన వాళ్ళ ఇళ్ళకి నేను వచ్చి, వీధిలో వెళ్తున్న బిచ్చగాళ్ళకి మీఇంట్లోంచి తలా ఒక కేజీ ఉల్లిపాయలు దానం ఇచ్చే ప్రమాదం ఉంది! తస్మాత్ జాగ్రత్త!!! 

Saturday, August 22, 2015

Un Fair & Not so Lovely!!

అన్ ఫెయిర్ & నాట్ సో లవ్లీ!!

ముందు మాట: ఈ రచనలో ఒక్క రవ్వ మనం ప్రతిరోజూ వినే ఒక రెండు slang పదాలు సందర్భానుసారం అంటే ఎమోషన్కి expression పండాలంటే (సినిమా వాళ్ళ భాషలో) ఆ మాత్రం మాండలీకం వాడాల్సిందే అని రాయడం జరిగింది! కొంతమందికి అసభ్యంగా అనిపిస్తే క్షంతవ్యుడిని.

ఇంకొంచం ముందు మాట: ఈ రచన కొంచం సత్యజిత్ రే సినిమాలా అనిపించచ్చు!! అంటే నేను ఆయన రేంజ్ అని కాదు. ఆయన సినిమాల్లో లాగా కొన్ని జీవిత నగ్న సత్యాలు చెప్తానన్నమాట! ఇక్కడ నాకో సందేహం అసలు ఈ "నగ్న సత్యం" అన్న మాట ఎందుకు పుట్టింది? అంటే కొన్ని నిజాలు బట్టలు వేసుకుని, లేదా ఎవ్వరికీ కనిపించకూడదని ముసుగులు వేసుకుని ఉంటాయా?

చివరి మాట: ఇదేమిటి ఈ విచిత్రం? చివరి మాట కూడా ముందస్తుగా చెప్పేస్తున్నారు అని హాస్చర్య పడిపోతున్నారా? ఇలా ఎందుకంటే కొంతమంది చివరి దాక చదవక పోయే ప్రమాదం ఉంది! అందుకని ముందు జాగ్రత్త చర్య అన్నమాట. ఇంతకీ విషయం ఏమిటంటే నేను మానసిక వైద్యుడిని కాదు! నేను రాసిన దానికి ఎక్కడా రీసెర్చ్ చేసి తెలుసుకున్నవి లేవు. కేవలం నా సొంత తెలివి మాత్రమే! నేను రాసిన దాంట్లో ఒకింత లేదా బోల్డంత నిజం ఉందనిపిస్తే నమ్మండి.

ఇహ కథా ప్రారంభం!

సాధారణంగా ఇంట్లో కూతురైనా, కొడుకైనా నాన్న దగ్గరి నించి కొంచం భారిగా సొమ్ములు కావాలంటే, అంటే వాళ్లకి ఏ Samsung S 6 కాని iPhone 6 కాని కావాలనుకోండి. నాన్నని డైరెక్ట్ గా అడిగితే బెడిసి కొట్టే అవకాశాలు ఎక్కువ కదా. ముందు అమ్మని కాకా పడతారు రికమండేషన్ కోసం! అప్పుడేం చేస్తారు? అమ్మ వంటింట్లో వంట చేస్తున్నప్పుడు వెళ్లి పక్కని నిలబడి మెల్లిగా ఆ కబురు ఈ కబురు చెప్తారు. డైరెక్ట్ గా విషయంలోకి వస్తే బాగోదు కదా. మేనమామ కబుర్లు పుట్టింటిదగ్గరా అన్నట్టు వీళ్ళ సంగతి అమ్మలకి తెలీకనా. వాళ్ళు కూడా వీళ్ళ కబుర్ల ప్రహశనంలో పాల్గొంటారు. తర్వాత ఏమి అడుగుతారో అని లోపల్లోపల ఆలోచించేస్తూ!

(పిడకల వేట: ఇక్కడ ఇంకో సందేహం. Samsung వాళ్ళు, Apple వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు పోటీపడి ఇలా నంబర్ల వారీగా ఫోనులు అమ్మేస్తూ ఉంటారా? ఇద్దరి లేటెస్ట్ ఫోనులు 6 దాక వచ్చి ఆగాయి. అసలు Apple కంపెనీ వాళ్ళు iPhone 2 మార్కెట్ లో వదిలినప్పుడే నేను వాపోయాను. నేను iPhone కొనే సొమ్ములు కూడపెట్టేటప్పటికి iPhone 8 వస్తుంది అని. నేనింకా ఒక మట్టిహుండీ కొనలేదు. కనీసం మార్గదర్శి లోనైనా చేరలేదు. వీళ్ళు అప్పుడే iPhone 6 దాక వచ్చేసారు!)

అప్పుడు కూతురో, కొడుకో అమ్మ తరుగుతున్న వంకాయలు నీళ్ళల్లో వెయ్యడం చూసి "అదేంటమ్మా? వంకాయ ముక్కలు నీళ్ళల్లో ఎందుకేస్తున్నావు? మొన్న బెండకాయలు తరిగాక వాటిని నీళ్ళల్లో వెయ్యలేదు కదా?" అంటారు. అప్పుడు ఆ అమ్మ ఏమంటుంది "వంకాయ నీళ్ళల్లో వెయ్యక పొతే ముక్కలు నల్లగా అయిపోతాయి" అంటుంది! దాంతో ఈ కుర్రాళ్ళకి ఏమర్థం అవుతుంది? ఒక్కసారి మీరే ఆలోచించండి. నలుపు చూడ్డానికి బాగుండదు. తెలుపు కాని ఇంకే రంగైనా బాగుంటుంది అనే కదా! అది వాళ్ళ మనసులో నాటుకు పోతుంది. అంతే అది అలా కొన్ని సంవత్సరాలకి బలపడి వాళ్ళు నల్లగా ఉంటే వీలయినంత తెల్లగా అవ్వడం కోసం ఫెయిర్ అండ్ లవ్లీ లాంటివి వాడడం, పెళ్లి ఊసోచ్చేటప్పటికి అబ్బాయిలంతా (వాళ్ళు నల్లగా ఉన్నా సరే!) తెల్లగా ఉన్నఅమ్మాయే కావాలని పట్టు పట్టడం చాల సర్వ సాధారణం అయ్యిపోయింది. మరి ఈ discrimination కి పునాది వేసి దాన్ని పెంచి పెద్దది చేసి తొక్కలోది ఈ తెల్ల తొక్కకి అంత పెద్దపీట వేసి, చివరాఖరికి పిల్లలని తప్పుపట్టేది కేవలం పెద్దవాళ్ళే!

నాకు తెలీక అడుగుతాను వంకాయ కూరకాని, పచ్చడి కాని చేసాక అది నల్లగా ఉంటే ఏమయ్యిందిట? వంకాయగా ఉన్నప్పుడు మహా సుందరమైన రంగులో ఉన్నట్టు! కూర నల్లగా ఉంటే వచ్చే ఉపద్రవం ఎమన్నా ఉందా? లేదు.ఏ రంగులో ఉంటే ఏమిటి. అనవసరంగా పిల్లల మనస్సుల్లో నలుపు బాగుండదని ఒక ఆలోచన ఎందుకు పెట్టడం?

ఒక్కసారి ఆలోచించండి! నేనుచెప్పినదాంట్లో ఒకింత నిజం ఉందనిపిస్తే ఇవాల్టి నించి కనీసం వంకాయలని తరిగాక నీళ్ళలో వెయ్యడం మానేయ్యండి!

ఈ వర్ణ వ్యత్యాసానికి తెర దించెయ్యండి, ఇవాల్టి నుంచీ వర్ణరహిత సమాజం కోసం మీ వంతు తోడ్పడండి !!

Wednesday, July 1, 2015

Lite Lelo!!


ఇప్పుడే అందిన వార్త! BREAKING NEWS!!

హైదరాబాద్ లో ఎక్కడో నాలుగు చుక్కలు వాన పడిందిట!!! దాన్ని పురస్కరించుకొని నేనెప్పుడో రాసిన "రచన" చదవండి. దీన్ని "కథ" అనడానికి మనసు రావడంలేదు. ఎందుకంటే అందులో "కథ:" ఉంటె కదా?!!






Tuesday, June 23, 2015

Kaki Gola! కాకి గోల!!

ఇప్పుడే ఒక కాకి "కావ్, కావ్, కావ్" అని అరిచింది!

(అప్రస్తుత ప్రసంగం! ఇలా మూడు సార్లు అరవడానికి ఏదో ప్రాతిపదిక, సాంప్రదాయం ఉండి ఉంటుంది. న్యాయస్థానంలో కూడా ముద్దాయిలని, సాక్షులని, కేసు వేసిన వాళ్ళనీ కూడా ఇలాగే బిళ్ళ బంట్రోతు మూడు సార్లు పిలుస్తాడు! వాడి చేతిలో "చాయ్ పానీ" కి పదో పరకో పెట్టక పొతే తర్వాత వాయిదాలో ఎవ్వరికీ వినిపించకుండా "అశ్వద్ధామ హతః! కుంజరః! అన్నసాంప్రదాయంలో మెల్లిగా పేరు పిలుస్తాడు! మూడు సార్లు గబగబా పిలిచి "హాజిర్ నహి హై సాబ్" అని జడ్జి గారికి చెప్పేస్తాడు!!)

మీరు మరీనండి! మరీ ఇంత బడాయా? రాయటానికి ఏమి దొరక్కపొతే ఇలా కాకి అరిచింది, కోయిల కూసింది అని రాస్తారా? అయినా కాకి అరవడంలోనూ, అది కూడా "కావ్, కావ్, కావ్" మని అరవడంలోనూ పెద్ద వింత ఏముంది? కాకి పిల్లిలాగా అరిచింది అని మీరు రాసినా బాగుంది అని మీరు ప్రధమ కోపం తెచ్చుకుంటే మీ తప్పు ఎంతమాత్రం లెదు!

కాస్త ఓపిగ్గా ఇంకొంచం చదివితే ఆ కాకి అరుపులో విశేషం తెలుస్తుంది!

ఇంతకీ ఇప్పుడు టైం ఎంతయ్యింది అనుకుంటున్నారు? ఓహ్! నా మతిమండా? నేను ఇది ఎప్పుడు రాస్తున్నానో మీకెలా తెలుస్తుంది? నేనే చెప్తాను. ఇప్పుడు నిలయంలో సమయం సాయంత్రం ఏడుగంటలు దాటి ముప్ఫై నిమిషాలు అయ్యింది!! మరిప్పుడు అర్థం అయ్యిందా కాకి అరుపులో విశేషం? కాకులు ఎక్కడైనా రాత్రి 7-30కి అరుస్తాయా? అఫ్ కోర్స్ (ఈ పదాలకి సరైన తెలుగు మాట తట్టడంలేదు! దానిగురించి టైం వేస్ట్ చెయ్యడం వేస్ట్!) ఒక కాకి మొగుడు, ఆ మొగుడి కాకి పెళ్ళాం రాత్రి భోజనం అయ్యాక దెబ్బలాడుకుంటే రాత్రి ఏ టైంకైనా అరవచ్చు! కాని నాకు అలా రెండు కాకుల అరుపులు, విరుపులు వినిపించలేదు. కేవలం ఒక్క కాకి అలా మూడుసార్లు అరిచి తన పనయ్యిపోయినట్టు ఎగిరిపోయింది. ఎగిరిపోయింది అన్నది నా ఊహాగానం! ఎందుకంటే చీకట్లో నల్లటి కాకి ఎగిరినా, ఎగరకపోయినా నాకు కనిపించదు! (అసలే వృద్ధ్యాప్యం దగ్గర పడుతోంది, పైగా చత్వారం!)

ఇంతకీ "వేర్ ఆర్ వుయ్?". ఒక సినిమాలో సునీల్ అన్నట్టు "రాస్తున్న మీకే తెలీకపొతే, చదువుతున్న మాకేం తెలుస్తుంది" అంటారా? అనండి ఫర్వాలేదు!

మళ్ళీ కథలోకి వస్తే కాకి రాత్రి ఏడున్నరకి అరవడం విశేషమా కాదా? నా దృష్టిలో విశేషమే. ఇక్కడ ఇంకో విశేషం ఉంది! కాకి ఇంట్లో అరిస్తే చుట్టాలు వస్తారంటారు! కాబట్టి ఈ సదరు కాకికి ఏదో ఉప్పందింది;)

కాని మా ఇంట్లో ఇప్పుడు వచ్చే చుట్టాలు ఎవరూ లేరే! పోయిన వారమే ఇద్దరు వచ్చారు! మరిప్పుడు ఎవరొస్తారు? అయినా నాకు తెలీకుండా ఈ కాకికి ఎలా తెలుస్తుంది? ఈ రోజుల్లో చెప్పా పెట్టకుండా పోవడం పెద్ద బ్యాడ్ హాబిట్ అయ్యిపోయింది కాని చెప్పాపెట్టకుండా రావడం అన్నది లేదే? ఆ మాటకొస్తే ఒక్కసారి కాదు నాలుగు సార్లు చెప్పి వస్తున్నారు! ముందు మొబైల్లో చెప్తారు, ఫలానా రోజు వస్తాము అని. ఇంకో రెండురోజులయ్యాక మళ్లీ ఫోన్ చేసి ఫలానా రైల్లోనో, బస్సులోనో, లేక విమానంలోనో వస్తున్నాము అని చెప్తారు! ఆ ఫలానా రోజు ఇదిగో ఇప్పుడే ఇల్లు వదిలాం, బయల్దేరాం అని ఒక ఫోనో, లేక SMS పెడతారు. ఆ రైలో, బస్సో, విమానమో లేట్ అయ్యిందని, లేక కరెక్ట్ టైమేనని మళ్లీ ఇంకో ఫోన్ లేదా మెసేజ్! ఇదిగో రైల్, బస్సు, విమానం స్టార్ట్ అయ్యాయని ఇంకో ఫోన్ లేదా మెసేజ్! ఇదిగో ఇప్పుడే మీ ఊరి స్టేషన్, ఎయిర్పోర్ట్ లో దిగామని ఇంకో మెసేజ్! ఆటో లేదా టాక్సీ ఎక్కామని ఇంకో ఫోన్ లేదా మెసేజ్ ఇలా మనకి ప్రత్యక్ష ప్రసారం ఇస్తారు కదా మరింక నాకు తెలీకుండా ఈ కాకికి ఎలా తెలిసిందో! ఎలా తెలిసిందో అన్నదానికంటే ఎవరు వస్తారో అని ఆలోచించడం మంచిదనిపించింది.

మా అమ్మ రెండు రోజుల క్రితం ఈ ఊళ్లోనే ఉన్న నా అక్క వాళ్ళింటికి వెళ్ళింది. రేపు పొద్దున్న వస్తున్నానని నాకు ఫోన్ చేసి చెప్పింది! ఈ కాకిగారు ఇంట్లో వేడికి నిద్ర పట్టకో, లేక వాళ్ళ ఆవిడతో దేబ్బలాడో అలా బైటకి వచ్చి ఆ సెల్ టవర్ మీద కూర్చున్నప్పుడు మా అమ్మ ఫోన్ చేస్తే అది ఆ టవర్ మీద ఆ మెసేజ్ పట్టేసుకుంది! ఇంక అదేదో పెద్ద "బ్రేకింగ్ న్యూస్" లాగ వెంటనే నాకు చెప్పెయ్యకపోతే దానికి ఇంటికెల్లినా నిద్ర పట్టదు కాబట్టి వెంటనే దాని పని గంటలు అయిపోయినా నా ఇంట్లోకి (అంటే మరీ హాల్లోకి కాదనుకోండి, బైట కాంపౌండ్లోకి అన్నమాట!) వచ్చి అలా వెంటనే వచ్చిన, అప్పుడే అందిన సమాచారం సాంప్రదాయం ప్రకారం అరిచి కాకి గోల చేసి వెళ్ళిపోయింది!!

ఇక్కడ నేనొక "లా" పాయింట్ లాగాలి! అదేమిటంటే నా దగ్గరే ఉన్న నా అమ్మ మళ్ళీ నాదగ్గరకి వస్తూంటే ఆమె చుట్టమవుతుందా? అవ్వదు! కాని ఈ కాకికి మా ఇంట్లో సభ్యుల వివరాలు అందినట్టు లేవు, బహుశా ఆ మధ్య జరిగిన "సార్వత్రక సర్వే" కాపీ దానికి అందలేదేమో? ఈ విషయం మీద అంటే ఇలా మన ఇంట్లోనే ఉంటున్న వాళ్ళు అలా బైటికి రెండు రోజులు వెళ్లి వస్తే ఈ కాకులు వాళ్ళని చుట్టాల కింద పరిగణించి వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తూంటే ఇలా అరిచి కాకిసందేశం ఇవ్వడం సబబేనా అని ఏదైనా టివి చానెల్లో ఒక పానెల్ డిస్కషన్ పెట్టడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి!

అంటే బాధ పడుతుంది కానీ ఇప్పుడంత అర్జెంటుగా నాకు చెప్పెయ్యాల్సిన అవసరం ఉందంటారా? కాని ఈ కాకి కొంచం లోకజ్ఞానం తెలిసిన కాకి అయ్యుంటుంది. (ఇలా లోకజ్ఞానం ఉన్న కాకుల్ని లోకులు అని అందురు. అందుకే కదా అంటారు "లోకులు పలు కాకులు" అని!) ఏమో రేప్పొద్దున్న నా ప్రాణం ఉంటుందో ఉండదో, ఒకవేళ నేను (అంటే కాకి, నేను కాదు అని మనవి) బతికుంటానో లేదో, ఒకవేళ నిద్రలోనే పొతే, ఇలా నాకు అందించాల్సిన సమాచారం అందచెయ్యనందుకు, పైలోకంలో ఏవైనా కుంచం శిక్ష పడుతుందేమో? ఎందుకొచ్చిన గొడవ? ఇప్పుడే చెప్పేసి ఇంటికి చక్కా పొతే పోలా? అయినా ఎవరో మహానుభావుడు అన్నాడు కూడా "ఇవాల్టి పని ఇవాళే చెయ్యమని". అలా అలోచించి ఆ కాకి రాత్రయ్యిపోయినా దాని కర్తవ్య నిర్వహణ చేసేసి చేతులు క్షమించాలి, రెక్కలు దులుపుకుని వెళ్ళిపోయింది.

కథ కంచికి! కాకి దాని ఇంటికి!

Saturday, May 16, 2015

Embarrassing repetition of history!!


Flashback to 1985. I had “Priya” scooter in those days.

A little of “Priya” history! You can skip this if you aren't interested history! In 70's my dad booked the scooter at the dealer in Vijayawada, though we were in Guntur there was no dealership there, by paying the advance booking amount in US $ which he arranged with great difficulty! The advantage of booking with foreign currency is we get the delivery of the scooter within 4 years else its a waiting of 7 or more years:(

One fine morning in 1985 I tried to start the scooter to go to office but it just refused to start. I tried for at least 5 minutes and started to sweat profusely. Anyone who's used to kick start stubborn bikes know how difficult, tiring and irritating it is. Its easier to kick start a venture than a stubborn bike!

Then I realized that the matter is beyond my capabilities and has to be referred to expert; I had no choice but to push it all the way to the mechanic located 2 K.M.s away. The mechanic checked up the carburetor, spark plug and both were fine. He couldn't understand why its not starting. He made 2/3 pradakshinas of the scooter while scratching his head. Finally he even checked up the petrol tank to see whether the petrol was exhausted! Petrol was there in the tank but the mechanic got exhausted :( 

Finally thanks to the head scratching he got a brilliant idea and Voila he jumped 2 feet into the air!! Remember Archimedes?! This is what happens to people when they make a earth shattering discovery!

Then he did a very small thing!

You should've seen his face and my face too at that moment!

What was the thing he did and how does our faces looked like? Answers after few paras!

Would like to draw your attention to the very 1st sentence of yesterday's post “Embarrassing repetition of history!!” The key operative word here is “repetition”! So here's how it repeated. Read on

One night last week at 10-15 PM the power went off, as usual, to say. (Though KCR's govt vehemently denies any power cuts there are definitely daily “power off” periods which vary from 5 minutes to 1 hour!) And to our surprise the inverter didn't work and we had a horrible 20 minutes in the hot summer. We were at a loss as to the reasons for the inverter not working and after discussing with my wife I came to the conclusion that perhaps during the day there was more power cut than the inverter could handle and hence it didn't have enough time to get recharged.

But after 2 days the inverter didn't work again. And then I decided that there could be a problem with it and called up the customer care of the company. To my pleasant surprise 2 service engineers came within 2 hours. They inspected it and short of dismantling it did everything and were at a loss themselves as to the reasons for its failure! Then one of them scratched his head for an inspiration. And voila he got it.

His face changed instantly to one of glee and he almost jumped in the air in the usual Archimedes tradition!! His “discovery” startled his associate too.

Then that guy slowly turned to me and said “Sir ................”. And you should've seen my face! It had the same expression like in 1985!! And that's how the embarrassing history repeated.

Finally here are the answers and in both cases the answer is the same and I paid the price for others deeds!

The mechanic opened the dicky of the scooter and found the engine switch 'Off” as he expected! And he said “What Sir? You've switched off the engine switch, pushed the scooter for a long distance and made me work half an hour and all for nothing” :(

Needless to say you should've or on second thoughts you shouldn't have seen my face!  

What happened was my dad used the scooter the previous evening and like all elderly people switched off the engine switch faithfully. I, as a angry young man never bothered about it! So I couldn't eve think of that possibility even remotely and paid the price!

And the UPS service engineer also made a similar discovery after struggling for some time! He “discovered” that the UPS switch was turned off!! And he said “What Sir? You've switched off the UPS and gave a complaint?!” Again you should've seen or rather on second thoughts you shouldn't have seen my face!

I was like dumbstruck. I didn't even know that the UPS had a on/off switch! We never touched it after its installation and it was untouched by human hands, so to say! So how did this happen? I and my wife did some thinking and it suddenly stuck us that 4 days before a relative of ours visited us with her family. Her 2 young boys started roaming around our house as there are no kids, small or grown up, in our home, to play with. The younger one who is very active and restless type must've fiddled with the switch and turned it off!!

So what's the moral of both these instances. There are more than one in fact!

1. History repeats, faster than we imagine :(
2. Sometimes we have to cut a sorry figure in front of others for no fault of ours :(
3. Sometimes we are forced to pay the price for others acts :(
4. Many a time there will always be simple solutions to complex problems :)

Saturday, February 28, 2015

ఈమధ్య ఆదివారం వస్తోందంటే భయమేస్తోంది :(

ఈమధ్య ఆదివారం వస్తోందంటే భయమేస్తోంది:(

అదేమిటి సార్? అందరికీ ఆదోరం అంటే అమితానందం కదా? అంటారేమో! అనేముందు ఒక్కసారి ఇవాళ ఆదివారమే కాబట్టి నాలాగా కాకుండా మీరంతా విపరీతంగా ఖాళీగా ఉంటారు కాబట్టి ఒక్కసారి ఆసాంతం చదవండి. అప్పుడు తెలుస్తుంది. కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు ఆదివారం అంటే ఎందుకు నేను భయపడుతున్నానో.

అసలు ఆదివారం అంటే ఏమిటి? అందరం వారం అంతా పని చేసి అలిసి పోతాం కాబట్టి శుభ్రంగా సెలవురోజు హాయిగా విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఒక ఆరు రోజులు నిరవధికంగా పని చెయ్యడానికి సిద్ధం అయ్యిపోవడమే కదా?

కాని నేనో?

కారణం నం 1:ఆదివారం ఖాళీ కాబట్టి ఎవరు ఎక్కడికి రమ్మన్నా వాళ్ళతో తెగిన గాలిపటంలా ఊరంతా తిరిగేయ్యడం. దాంతో సాయంత్రానికి పనిరోజులకంటే ఎక్కువగా అలిసిపోవడం

కారణం నం 13: ఆరు రోజులు మా ఆవిడ చేతి వంట తింటాను కదా అందుకని ఒక్క రోజు ఆవిడకి కాస్త విశ్రాంతి ఇచ్చినట్టు ఉంటుంది, నాకు కూడా నా చేతి వంట (ఏ మాటకామాటే! నా వంట అమోఘం, అద్భుతం, అఖండం, ఇంకా ఇలాంటివే చాల చాల:) తిన్నట్టుంటుంది అని ఒక జంధ్యాల సినిమాలో శ్రీలక్ష్మి లాగా ఒక పెద్ద వంటకం కార్యక్రమం చేపడతాను. స్వీట్ చెయ్యడం పీకులాట పంచాంగం. తినడం నిమిషం లాగ! నేను చేసే ఆ వంటకం ఒక రెండు గంటలు వీజీగా పడుతుంది. తినడమో రెండు నిమిషాలు. కాని ఇలా ఈ నలభీమ పాకం చేసి అలిసిపోయి మళ్ళీ పుంజుకొనె లోగా సోమవారం వచ్చేస్తుంది

కారణం నం 44: ఆదివారం ఖాళీగా ఉన్నానని ఏదో ఒకటి కడగడమో, లేక బూజులు దులపడమో, ఇంకేదన్నా తుడవడమో ఇలాంటి భ్రుహత్పధకం ఒకటి చేపట్టి, అది ఎప్పటికీ అవ్వక, మధ్యలో ఆపలేక, ఎందుకు మొదలెట్టామో అని ఆత్మని అది జవాబివ్వకపోతే అంతరాత్మని, ఆపైన కుంఛమ్ ఓపిక మిగిలుంటే పరమాత్మని ప్రశ్నించి, ఎంత ప్రశ్నించినా  రాని జవాబు కోసం అలా శూన్యంలోకి చూస్తుంటే ఇంతలో పాత కాలం గోడ గడియారం ట్టంగ్ మని రెండు సార్లు కొట్టేటప్పటికి ఇంక స్నానం, ధ్యానం అన్నీ గాలికొదిలేసి హావురావురుమంటూ అన్నం తినేసి నిస్త్రాణంగా బోజ్జోవడం. లేచి చూస్తే ఏముంది "మీరు ఇవాళ లేచామనుకుంటున్నారేమో? మీరు లేచింది ఇవాళ కాదు. రేపు!" అని మా ఆవిడ సుప్రభాతం పలికితే అందులో గూడార్థం అర్థం చేసుకోనేటప్పటికి "ఏమిటీ ఈ పూట ఆఫీసుకి సెలవు పెట్టారా లేక వాళ్ళే ఇంక చాలు సెలవు తీసుకోమన్నారా" అన్న మా ఆవిడ ప్రశ్నతో గబుక్కుని పేపర్లో చూస్తే సోమవారం అని చదివాక అర్థం అయ్యేది. కుంభకర్ణుడి టైపులో ఒక 15 గంటలు బోజ్జున్నానని!

కారణం నం 72: అబ్బే ఇటువంటివి చేసి ఆదివారం అలిసిపోతున్నాం అని వెరైటీగా నేను మా ఆవిడా ఎంచక్కా బైటికి ఒక పెద్ద లాంగ్ డ్రైవ్ వెళ్లి బైట హోటల్లో భోజనం చేసి వద్దామని బయల్దేరితే, ఎటు వెళ్ళాలో తెలీక అలా బాగా దూరంగా ఉన్న ఏదో ఒక గుడికెళ్ళి అక్కడినుంచి ఏ హోటల్కి వెళ్ళాలని ఒక గంట తిరుగు ప్రయాణంలో డిస్కస్ చేసి చివరికి ఎప్పుడూ వెళ్ళే హోటల్కి ఎందుకు ఏదైనా కొత్త దానికి వెళ్దామని ఒక (పిచ్చి) నిర్ణయానికొచ్చి ఏదో కనిపించిన హోటల్లో ఒక కొత్త ఐటెం ఆర్డర్ ఇచ్చి అది వచ్చాక ఇలా కొత్త హోటల్లల్లో తెలీని ఐటమ్స్ చెప్పకూడదని నూట ఎనిమిదోసారి తిట్టుకుని, ఏదో తిన్నామనిపించి ఇంటికొచ్చి పడిపోయి భారీ ఎత్తుని అలిసిపోయాం కాబట్టి  వెంటనే ఒళ్ళు తెలీకుండా సాయంత్రం 7 దాక బోజ్జోని లేచి అనవసరంగా ఏమీ చెయ్యకుండా ఆదివారం వేస్ట్ అయిపోయిందని మరొక్క సారి నిద్ర మత్తులో వాపోవడం:(

వీటన్నితోపాటు నా ఏకలవ్య గురువుగారు www.Twitter.com/S_Sivakumar.  (అంటే నేను ఆయన్ని గురువుగా నియమించేసుకున్నాను. ఆయన అనుమతితో ప్రమేయం లేకుండా!:) Twitter లో #SundayScience  quiz అప్పుడప్పుడూ పెట్టినప్పుడు వచ్చీ రాని పరిజ్ఞానంతో వాటికి సమాధానాలు చెప్పడం, ఆయన సాయంత్రం కరెక్ట్ సమాధానాలు చెప్పేదాక విపరీతమైన మానసిక ఆందోళనకి గురవ్వడం (ఎందుకంటే నాకెంత వచ్చో, క్షమించాలి రాదో ప్రపంచం మొత్తం తెలిసిపోతుందేమోనన్న టెన్షన్ తో!) దాంతో ఇంకా మానసికంగా కూడా అలిసి పోవడం

ఇలా వేర్వేరు ఆదివారాలు పలుపలు విధములుగా విశ్రమించకుండా పరిశ్రమించి మామూలు పనిరోజులకంటే ఎక్కువగా అలిసిపోవడం అన్నది సర్వ సాధారణం అయిపోయింది.

మరందుకే ఆదివారం అంటే చెప్పలేని చెప్పుకోలేని భయం!

నోట్: పైన ఉదహరించిన కారణాల వరుస క్రమంలో ఏదో అపశ్రుతి దొర్లిందని పొరపాటు పడకండి! హైదరాబాద్లో ఆటోలో ప్రయాణించిన వాల్లెవరికైనా అలా అనిపించదు. ఎందుకంటే మా ఉళ్ళో ఆటో మీటర్లు అలాగే తిరుగుతాయి (అవి పని చేసినప్పుడు!)          

నోట్ 2: కాని ఇవాళ అనగా ఈ ఆదివారం మట్టుకు పైన ఉదహరించిన ఏ రకంగా కాకుండా ఇదిగో ఇది రాసి అలిసిపోయాను! మీరు భలేవారండీ! ఇంత నాలుగు ముక్కలు రాస్తే అలిసిపోతారేంటి ఎవరైనా? అని హాశ్చర్య పోయేవాళ్ళకి ఒక మనవి. రాసిన వాడికి తెలుస్తుంది ఆ "ప్రసవ వేదన"!!

Monday, February 23, 2015

A dashed down Jumbo wish :(

ఒక సంవత్సరంగా ఉన్న ఒక చిన్ని ఆశ ఇవాళ పేపర్ చదవగానే "హుష్ కాకి" అయ్యిపోయింది:(

అదేమిటంటే ఆమధ్య పేపర్లో చదివాను. మైసూరు మహారాజ వంశంలో చివరి రాజుగారు పిల్లలు లేకుండా మరణించారు అని. అంతే. నాకొక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. అదేమిటంటే నా చిన్నప్పుడు చాల జానపద సినిమాల్లో చూసాను. చందమామ కథల్లో చదివాను. పూర్వం ఎవరైనా రాజుగారు కూడా పిల్లలు లేకుండా మరణిస్తే రాజుగా ఎవరిని నియమించాలి అన్నదానికి ఒక పధ్ధతి అవలంబించేవాళ్ళు. అదేమిటంటే రాజుగారి మదపుటేనుగుకి ఒక తాజా పూలహారం ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఆ ఏనుగు దానిష్టం వచ్చిన వేపు ఇష్టం ఉన్నన్నాళ్ళు తిరిగి దానికి ఇష్టం వచ్చిన వాడి మెడలో ఆ హారం వేసేది. వెంటనే ఆ వ్యక్తిని మహారాజుగా ప్రకటించేసి తతిమ్మా కార్యక్రమం చేపట్టే వాళ్లు. (ఆ ఏనుగు అప్పుడు అలా రోజులు రోజులు, కొండొకచో కొన్ని వారాలు అలా రాజ్యమంతా తిరిగేస్తూంటే ఆ పూలహారం వాడిపోతే, తరుచుగా మళ్ళీ తాజా హారాలు దానికిచ్చే వాళ్ళా అన్న డిటైల్ చరిత్ర పుటల్లో మరుగున పడిపోయింది!)

ఇప్పుడు ఈ మైసూరు మహారాజు గారి ఆస్థాన advisors కూడ ఇలా మరుగుపడ్డ సాంప్రదాయాన్ని పాటిస్తారేమో అని ఒక చిన్ని ఆలోచన వచ్చింది. ఏం? ఎందుకు అలా చెయ్యకూడదు? అసలే మైసూరుకి దగ్గరలోనే ముదుమలై అడవి ఉంది. దాన్నిండా బోల్డు ఏనుగులున్నాయి. అందులో మాంఛి నదరుగా ఉన్న ఏనుగు "అడవి రాముడు" సినిమాలో "కాళి"గా అద్భుతంగా నటించింది కూడా:) కాబట్టి అలా ఏనుగుల్ని తరుచుగా చూస్తుంటారు కాబట్టి, ఇప్పుడు వాటిని వాడుకొనే అవకాశం వచ్చింది కాబట్టి ఈ ఆలోచన వచ్చే అవకాశాలు చాల ఎక్కువ!

వెంటనే ఒక చిన్ని ఆశ కూడా! అదేమిటని మీరు అడగక్కరలేదు. చెప్పకుండా ఉండలేను! అలా వాళ్ళు దేశం మీదకి వదిలిన ఏనుగు సరాసరి హైదరాబాద్ వచ్చి నా మెడలో ఆ హారం వేసే అవకాశం ఉంది కదా అని:) అసలే  (అదృష్ట)లక్ష్మికి ఏనుగులు బాగా క్లోజ్ కూడా. ప్రతి లక్ష్మీదేవి ఫోటోలో వెనకాల రెండు ఏనుగులుంటాయి కదా! ఒక తెలుగు సినిమాలో ఓ డైలాగ్ కూడా ఉంది "లక్ష్మి దేవి బిజీగా ఉంటే ముందస్తుగా ఏనుగుని పంపిస్తుందని!

ఇలా ఆలోచన వచ్చిందే తడవు వెంటనే ప్రతి రోజు వీధి కుక్కకంటే ఎక్కువగా రోడ్లమీద తిరగడం మొదలెట్టాను. ఎందుకంటే ఏనుగు కంట్లో పడాలి కదా! నా ఇంట్లో నేను కూర్చుంటే ఎట్లా? పోనీ ఏనుగు నన్ను వెదుక్కుంటూ వస్తుందనుకుంటే నేను మేడమీద ఉంటానాయే! ఏనుగుకి మేడ ఎక్కడం కొంచం Jumbo ప్రొబ్లెం కదా. అయినా అంటే బాధ పడతారు కాని సమయం వస్తే అదృష్టం తలుపు తడుతుందని వీధి తలుపు వేసేసి, గడియ పెట్టేసి, ఏసి రూంలో ముసుగేసుకోని పడుక్కుంటామా? మన వంతు కూడా కుంఛమ్ సహకరించాలి కదా. అంటే కనీసం ఇంటి బైట ఒక నేమ్ బోర్డు పెట్టడం, పగలంతా వీధి తలుపు తీసి ఉంచడం లాంటివి అన్నమాట! కాని అదృష్టం ఏనుగు రూపంలో వస్తున్నప్పుడు ఇంకొంచం సహకరించాలి కదా. అందుకని రోడ్లన్నీ తిరిగేశాను.

కొన్నాళ్ళకి ఇంకో అనుమానం వచ్చింది. అదేమిటంటే ఆ సదరు ఏనుగుకి వయసు మీద పడ్డా, లేక బద్ధకం ఎక్కువైనా, లేక బొత్తిగా వ్యాయామం లేక కొంచం బరువు ఎక్కువైనా, లేక మరీ దూరం వెళ్తే మళ్ళీ ఇంత దూరం వెనక్కి నడవాలనే బ్రిలియంట్ ఆలోచన వచ్చినా ఆ ఏనుగు మైసూరు నించి హైదరాబాద్ దాక వచ్చే అవకాశాలు కొంచం సన్నగిల్లే ప్రమాదం లేకపోలేదు. అంతే ఇలా ఈ అనుమానం రావడం ఆలస్యం వెంటనే ఒక మంచిరోజు చూసుకుని బెంగుళూరు వెళ్లాను. వెళ్లి ఆ రోడ్లన్నీ లోకల్ కుక్కల కన్నా ఎక్కువగా తిరిగాను. కాని విధి వైపరీత్యం. నాకు ఏనుగు కనిపించలేదు. ఏదో నా పిచ్చి కాని నాకు ఏనుగు కనిపించడం ఏమిటి? ఏనుగుకి నేను కనిపించాలి కాని! అయినా నా ప్రయత్న లోపం లేకుండా కృషి చేసాను. కాని బెంగుళూరులో ట్రాఫిక్ మరీ ఎక్కువ. ఏనుగైనా సరే ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అలా గంటలు గంటలు ఉండిపోవాల్సిందే. నాకింకో చిన్ని సందేహం కూడా వచ్చిందండోయ్! సినిమాల్లో చూపించినట్టు ఏదైనా సిగ్నల్ దగ్గర ఒక వేపు ఏనుగు కోసం నేను, ఇంకో వేపు నాకోసం ఏనుగు చూసుకుంటూ, ఒకర్ని ఒకరు చూసుకోకుండా చెరో వేపు వెళ్లిపోయామేమోనని! అందుకీ ఇంగ్లీష్ వాళ్ళు "లైఫ్ ఈజ్ స్ట్రేంజర్ than ఫిక్షన్" అని వాళ్ళ భాషలో వాపోయారు! అయినా ఊరు కాని ఊళ్ళో కాబోయే మహారాజుని అలా వీధుల వెంట ఎక్కువగా తిరగడం మంచిది కాదని వెనక్కి తిరిగి వచ్చేసాను .

వచ్చేసి మా ఇంట్లో హాల్లో ఎంచక్కా కాలి మీద కాలేసుకుని కూర్చోడం మొదలెట్టాను. రేప్పొద్దున్న మహారాజు అయ్యాక అలాగే దర్జాగా కూర్చోవాలి కదా! ఇప్పటినించీ ప్రాక్టీసు అన్న మాట. అలా కాలి మీద కాలేసుకుని కూర్చుంటే కడుపు కాలే ప్రమాదం ఉన్నా కూడా లక్ష్య పెట్టకుండా! The Secret పుస్తకం చాలాసార్లు చదివి వంట పట్టించుకున్నాను! మనకేదైనా కావాలంటే అది మన దగ్గర ఉన్నట్టే ప్రవర్తిస్తే అది వెంటనే వస్తుంది/ జరుగుతుంది అని!

అలా కాలి మీద కాలేసుకుని కూర్చుంటే టైం పాస్ ఎలా? అందుకని పేపర్ ఈ చివరి నుంచి ఆ చివరిదాకా చదవడం మొదలెట్టాను. అదిగో అందులో భాగంగానే ఇవాళ పేపర్ చదివేస్తుంటే చూసిన షాకింగ్ వార్త  ఏమిటంటే మైసూరు మహారాణి ఎవరినో దత్తత చేసుకుందని!

మరి నా ఆశ "హుష్ కాకి" కాక "హుష్ ఏనుగు" అవుతుందా?

ఏమిటో జీవితం! చిన్ని చిన్ని కోరికలు కూడా తీరటం లేదు.

Sunday, February 1, 2015

A TVC for GSK's Boost!!

An unsolicited 15 Sec TVC for "Boost"!!!

Tom is chasing Jerry for few seconds.

Jerry suddenly stops with a screeching sound and signals to Tom also to stop.

Surprised Tom also stops with great difficulty!

Then Jerry pulls out a Boost mug (bigger than him!) and drinks the whole of it in one gulp and says "Boost is the secret of MY energy!"

Then Tom also pulls his mug of Boost (smaller mug than Jerry's!) drinks it and adds "Boost is the secret of OUR energy"!

Then both of them take off and fade in to horizon!

Tweak: "Our energy" could be first in Sachin Tendulkar's voice followed by Tom clearing his throat and saying it again in his voice! 

Howzzat?!!!

PS: These ideas are only to "Boost" my creative juices:)

PPS: I don't watch TV!! So if Glaxosmithkline (GSK) Indian arm has already made a commercial on the above lines just ignore this ;)

Friday, January 23, 2015

Four unique surprises not seen these days!!

Other day had lunch with a friend in a famous restaurant in an upmarket area in Hyderabad - "Chutneys" in Jubilee Hills.

Had 4 (pleasant!) unique surprises not seen these days, all at once!!

Few minutes after we went in 3 young girls, must be between 18-20, came and sat at the next table. They were dressed like today's (rich) girls. No surprise there!

Now for the surprises.

Surprise #1 - All 3 of them talked only in Telugu!! I almost fainted. No "nayire"s No "you know"s, No "that thingy, the thingy"s, No "Sh.."s!!

Surprise #2 - All of them ordered thali and idli ...No burger, No noodles, No pizzas, No pastas, No fried rices!!

Surprise #3 - Only one of the girls got just one call on her mobile and she spoke briefly for a minute. That's all. No other incoming or outgoing calls on any of their 3 mobiles!!!

Surprise #4 - None of them checked up WhatsApp, FB or Twitter on their mobiles for the full 45 minutes we were there!!

I could barely take any more surprises that day:) 

PS: Did we see "Aliens" ? :)

Kids and Castor Oil in Telugu

నా చిన్నప్పుడు అంటే 60'లో చిన్న పిల్లకి, చిన్న పిల్లల్ని చేసి, మూడు నెలలకో, అర్నెల్లకొ (చిన్న పిల్లాడ్ని కదా సరిగ్గా లెక్కలు రావు, గుర్తు లేదు!) ఆముదం పట్టేవాళ్ళు. 

అదొక చిన్న ప్రహశనం లాగ జరిగేది. నన్ను చిన్న పిల్లాడ్ని కాబట్టి తేలిగ్గా మాయచేసి పట్టేవాళ్ళు. కాని రాను రాను నాకు తెలివితేటలు బాగా ఎక్కువయ్యి వాళ్ళ "ప్రయత్నాలు" పసి గట్టి వాళ్ళకి దొరక్కుండా దూరం దూరంగా తిరిగేవాడిని. ఇంక లాభం లేక వాళ్ళు నా వెనకాల ఆముదం సీసాతో పరిగెత్తే వాళ్ళు. నేను ముందు. వాళ్ళు వెనక. కాని చిన్నపిల్లలం ఎంత సేపు పరిగెడతాం. పైగా పెద్దవాళ్ళు వాళ్ళ దెబ్బలాటలు, గొడవలు అన్నీ మర్చిపోయి ఇలాంటి విషయాల్లో అందరూ ఒకటయ్యిపోయి "joint operation" చేసేవాళ్ళు. అందుకని కూడా పిల్లలు చాల తేలిగ్గా దోరికిపోయేవాళ్ళు.  దొరికిపోయాక ఇంకేముంది. అందరికీ తెలిసిన భాగోతమే.  గట్టిగా కాళ్ళు చేతులు పట్టేసుకొని ముక్కు మూసేసి నోట్లో ఆముదం పోసేసేవాళ్ళు. అంతే. ఆ తర్వాత మనం ఒక్కళ్ళమే పరిగెట్టడం. ఎక్కడికో చెప్పనఖ్ఖరలేదుగా?!. విజ్ఞులైన వయసొచ్చిన చదువరులకి విదితమే:)

ఇంతకీ ఇప్పుడు చెప్పొచ్చేదేమిటంటే, కాదు అడిగేది ఏమిటంటే, ఇలా "అంతః శుద్ది" చేసుకొని కొన్ని దశాబ్దాలు అవుతోంది. ఇవాళ్టి రోజుల్లో ఆ ఆముదానికి తగిన ప్రత్యాన్యాయం ఏమయినా ఆముదం కాకుండా ఉందా? ఏమన్నా చిట్కాలు, టాబ్లెట్స్ వగైరా!!